Begin typing your search above and press return to search.

య‌ష్ 'టాక్సిక్‌'లో మ‌రో కాక పుట్టించే సీన్‌?

ఎట్టిప‌రిస్థితుల్లోనూ సినిమా జూన్ 4న రిలీజ్ అవుతుంద‌ని, అంత‌ర్జాతీయ స్థాయిలో దీన్ని ప్ర‌మోట్ చేయ‌బోతున్నామ‌ని క్లారిటీ ఇచ్చింది.

By:  Ravindar Gorantla   |   14 April 2026 1:50 PM IST
య‌ష్ టాక్సిక్‌లో మ‌రో కాక పుట్టించే సీన్‌?
X

`కేజీఎఫ్` వంటి సంచ‌ల‌న సిరీస్ త‌రువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించి మ‌రో భారీ పాన్ ఇండియా మూవీ `టాక్సిక్‌`. గీతూ మోహ‌న్ దాస్ డైరెక్ట‌ర్‌. కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్, మోన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ల‌పై వెంక‌ట్ కె. నారాయ‌ణ‌, హీరో య‌ష్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. కియారా అద్వానీ, న‌య‌న‌తార‌, హ్యుమ ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వ‌సంత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. య‌ష్ ఇందులో రాయ‌గ‌, టికెట్‌గా రెండు భిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌లో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు.

మిడిల్ ఈస్ట్ వార్ కార‌ణంగా ఈ మూవీ రిలీజ్‌ని మార్చి 19 నుంచి పోస్ట్ పోన్ చేయ‌డం, జూన్ 4న రిలీజ్ చేస్తామంటూ టీమ్ ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయోల్ వార్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో సినిమా రిలీజ్‌పై, అది సాధించే వ‌సూళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో టీమ్ ఈ మూవీ రిలీజ్‌ని చివ‌రి నిమిషంలో వాయిదా వేయ‌డం తెలిసింది. అయితు జూన్ 4న కూడా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని ప్ర‌చారం జ‌రగ‌డంతో దీనిపై టీమ్ క్లారిటీ ఇచ్చింది.

ఎట్టిప‌రిస్థితుల్లోనూ సినిమా జూన్ 4న రిలీజ్ అవుతుంద‌ని, అంత‌ర్జాతీయ స్థాయిలో దీన్ని ప్ర‌మోట్ చేయ‌బోతున్నామ‌ని క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాని రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. అమెరికాలో జ‌రుగుతున్న సినిమా కాన్ కార్య‌క్ర‌మానికి హీరో య‌ష్ హాజ‌రు కాబోతున్నారు. అదే వేదిక నుంచి `రామాయ‌ణ‌` ప్ర‌మోష‌న్స్‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా `ట్యాక్సిక్‌` రిలీజ్‌పై మ‌రింత క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

ఇదిలా ఉంటే ఫ‌స్ట్ టీజ‌ర్ నుంచే వార్త‌ల్లో నిలుస్తున్న ఈ సినిమా చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. గ్లింప్స్‌లో బ‌రేల్ డ్రౌండ్‌లో ఆగివున్న కారులో య‌ష్ మ‌రో న‌టితో క‌లిసి క‌నిపించిన స‌న్నివేశం అప్ప‌ట్లో వివాదం కావ‌డం, ఇలాంటి సీన్‌ని సెన్సార్ వారు ఎలా ఆమోదించార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డం, దీనిపై స్వ‌యంగా సెన్సార్ ఆఫీస‌ర్ వివ‌ర‌ణ ఇవ్వ‌డం తెలిసిందే. ఇప్ప‌టికీ నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ సినిమాలో మ‌రో హాట్ సీన్ ఉంద‌ట‌. య‌ష్‌, కియారా మ‌ధ్య ఓ హాట్ సీన్ ని షూట్ చేశార‌ట‌.

అది దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విమర్శ‌ల‌కు గుర‌య్యే విధంగా ఉంద‌ని, దాన్ని ప‌క్క‌న పెట్టి మ‌రో సీన్‌ని సినిమాలో పెట్టార‌ట‌. కియారా వ‌ల్లే టీమ్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంద‌ని, టీజ‌ర్‌లో చూపించిన సీన్ వివాదాస్ప‌దం కావ‌డంతో ఆ భ‌యం వెంటాడ‌టం వ‌ల్లే హాట్ సీన్‌ని ప‌క్క‌న పెట్టి వేరే సీన్‌ని సినిమాలో జోడించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే మేక‌ర్స్ మాత్రం ఇందులో ఎలాంటి నిజం లేద‌ని చెబుతున్నారు. కానీ టీజ‌ర్‌తో వ‌చ్చిన నెగిటివిటీని, విమ‌ర్శ‌ల‌ని దృష్టిలో పెట్టుకుని మ‌ళ్లీ వివాదాన్ని కోరి కొని తెచ్చుకోవ‌డం ఎందుక‌నే ఈ సీన్‌ని మార్చార‌ని ఇన్ సైడ్ టాక్‌.