Begin typing your search above and press return to search.

యష్ 'టాక్సిక్'.. నార్త్ విషయంలో టెన్షన్ తప్పదా?

యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు

By:  M Prashanth   |   26 Jun 2026 4:00 AM IST
యష్ టాక్సిక్.. నార్త్ విషయంలో టెన్షన్ తప్పదా?
X

బ్లాక్ బస్టర్ హిట్ కేజీఎఫ్ 2 తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో ఆనందం కనిపిస్తున్నా.. ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌ లో సినిమాకు అనుకున్నంత స్ట్రాంగ్ రిలీజ్ విండో దొరుకుతుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది.

పలుమార్లు వాయిదా పడిన టాక్సిక్ చివరకు ఆగస్టు 26న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్ తెరకెక్కిస్తున్న ఆ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తోంది. యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు ఇంగ్లీష్‌ లో కూడా సినిమాను విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ వీడియోలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. యష్ పవర్‌ ఫుల్ లుక్, స్టైలిష్ యాక్షన్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 1940- 1970 మధ్య గోవా బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ కథలో మాఫియా వరల్డ్, స్మగ్లింగ్, వైలెన్స్ మధ్య ఓ సాధారణ వ్యక్తి ఎలా పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగాడన్న అంశాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే సినిమా కంటెంట్‌ పై ఉన్న నమ్మకంతో పాటు రిలీజ్ టైమింగ్ కూడా ఇప్పుడు కీలకంగా మారింది. పాన్ ఇండియా సినిమాలకు ముఖ్యంగా హిందీ మార్కెట్‌ లో మంచి ఓపెనింగ్స్ రావాలంటే సరైన విడుదల తేదీ కూడా ఎంతో ముఖ్యం. అదే సమయంలో పెద్ద సినిమాలు వరుసగా విడుదలయ్యేలా కనిపిస్తుండడంతో స్క్రీన్ల సంఖ్య, ప్రేక్షకుల దృష్టి, వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో టాక్సిక్ విడుదల తేదీపై చర్చ సాగుతోంది.

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఆ చిత్రాన్ని మరోసారి మార్చే పరిస్థితి కనిపించడం లేదు. మరింత ఆలస్యం చేస్తే సినిమాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలు అనౌన్స్ చేసిన తేదీకే విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో నార్త్ లో పోటీ ఎక్కువగా ఉంటే ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ చూపుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే చివరికి ఏ సినిమా రిజల్ట్ ను అయినా డిసైడ్ చేసేది కంటెంట్‌ మాత్రమే. స్టోరీ, యాక్షన్, ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే రిలీజ్ డేట్, పోటీ వంటి అంశాలను కూడా డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అదే రేంజ్ లో టాక్సిక్ ప్రేక్షకులను మెప్పిస్తే నార్త్ లో భారీ వసూళ్లు సాధించడం కష్టమేమీ కాదు. మరి యష్ ఈసారి కూడా బాక్సాఫీస్‌ వద్ద డామినేషన్ కంటిన్యూ చేస్తారా? లేక రిలీజ్ టైమింగ్ ఎఫెక్ట్ చూపుతుందా? అన్నది ఆగస్టు 26న తేలనుంది.