యష్ టాక్సిక్ 'లేడీస్'.. ఈసారి మరింత బోల్డ్ గా..
రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ కొత్త గ్లింప్స్ సినీ ప్రియులను ఓ రేంజ్ లో మెప్పిస్తోంది.
By: M Prashanth | 1 July 2026 12:55 PM ISTరాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ కొత్త గ్లింప్స్ సినీ ప్రియులను ఓ రేంజ్ లో మెప్పిస్తోంది. ఇప్పటివరకు యష్ రోల్ ను హైలైట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్న మూవీ టీమ్, ఈసారి సినిమాలోని ఉమెన్ రోల్స్ పై దృష్టి పెట్టింది. లేడీస్ అండ్ లేడీస్ అంటూ విడుదల చేసిన గ్లింప్స్ లో కథలో కీలకంగా ఉండే లేడీ ఓరియంటెడ్ రోల్స్ ను పవర్ ఫుల్ గా పరిచయం చేసింది.
గ్లింప్స్ ప్రారంభం నుంచి చివరి వరకు రా అండ్ రస్టిక్ విజువల్స్ తో పాటు గ్యాంగ్ స్టర్ వరల్డ్ ను స్ట్రాంగ్ గా చూపించే ప్రయత్నం కనిపించింది. ఇందులో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ విభిన్న లుక్స్ లో కనిపించారు. ఇప్పటివరకు వీరిని ఇలాంటి బోల్డ్ అవతార్ లో చూడని ప్రేక్షకులకు ఆ గ్లింప్స్ కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తోంది. ప్రతి రోల్ వెనుక ఒక స్టోరీ ఉన్నట్లు చూపిస్తూ మూవీ టీమ్ ఆసక్తి పెంచింది.
ఇప్పటికే విడుదలైన యష్ గ్లింప్స్ లో డాడీ ఈజ్ హోమ్ అనే డైలాగ్ తో హీరో రోల్ లోని ఇంటెన్సిటీ చూపించిన మేకర్స్, ఇప్పుడు ఉమెన్ రోల్స్ కూడా కథలో అంతే కీలకమని వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సాధారణంగా గ్యాంగ్ స్టర్ సినిమాల్లో హీరో చుట్టూనే కథ తిరుగుతుంటుంది. అయితే టాక్సిక్ లో మాత్రం ఉమెన్ రోల్స్ కు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందని ఆ గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.
గ్లింప్స్ లోని విజువల్ ట్రీట్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ప్రతి ఫ్రేమ్ ను స్టైలిష్ గా చూపించడంతోపాటు, గోవా అండర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ను చూపించే ప్రయత్నం కనిపిస్తోంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ అన్నీ కలిసిన భారీ పాన్ ఇండియా సినిమాగా ఉంటుందని అర్థమవుతోంది. ఇక సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 1940-1970 నేపథ్యంలో గోవా డ్రగ్ కార్టెల్ వరల్డ్ ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి యష్ తన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇంటర్నేషనల్ రేంజ్ విజువల్స్, స్టార్ క్యాస్టింగ్ తో రూపొందుతున్న సినిమా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ గా పెట్టుకుని తెరకెక్కుతోంది. సంగీతానికి రవి బస్రూర్ తో పాటు మరికొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు తీసుకొచ్చింది. ఇప్పుడు వచ్చిన లేడీస్ అండ్ లేడీస్ గ్లింప్స్ యష్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం, ఆంగ్ల భాషల్లో ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, ప్రతి ప్రమోషనల్ స్టెప్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందని చెప్పాలి.
