Begin typing your search above and press return to search.

యూకే సెన్సార్ బోర్డులో టాక్సిక్ క‌ల‌క‌లం!

సాధారణంగా యశ్ సినిమాలు మాస్ ప్రేక్షకులను అలరించే కమర్షియల్ యాక్షన్ డ్రామాలుగా ఉంటాయి. కానీ టాక్సిక్ కోసం ఆయన ఎంచుకున్న కథాంశం -మేకింగ్ స్టైల్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

By:  Sivaji Kontham   |   19 Aug 2026 11:09 PM IST
యూకే సెన్సార్ బోర్డులో టాక్సిక్ క‌ల‌క‌లం!
X

రాకింగ్ స్టార్ యశ్ న‌టిస్తోన్న `టాక్సిక్` చిత్రం ఇప్పటికే వినూత్న ప్రమోషన్లతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లీకైన సెన్సార్ వివరాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. యూకేలోని సెన్సార్ బోర్డు ఈ సినిమాకు హై వయొలెన్స్ ..సె... కంటెంట్ కారణంగా కఠినమైన రేటింగ్‌ను కేటాయించినట్లు సమాచారం. ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన‌ చిత్రం యశ్ కెరీర్‌లోనే అత్యంత బోల్డ్ - వైలెంట్ సినిమాగా నిలవబోతోందని ఈ ఫీడ్ బ్యాక్ ద్వారా అర్ద‌మ‌వుతోంది.

సాధారణంగా యశ్ సినిమాలు మాస్ ప్రేక్షకులను అలరించే కమర్షియల్ యాక్షన్ డ్రామాలుగా ఉంటాయి. కానీ టాక్సిక్ కోసం ఆయన ఎంచుకున్న కథాంశం -మేకింగ్ స్టైల్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే కథలో హింస - బోల్డ్ ఎలిమెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయనేది యూకే సెన్సార్ బోర్డు ఇచ్చిన రేటింగ్‌ను బట్టి అంచనా వేయోచ్చు. రణ్‌వీర్ సింగ్ న‌టించిన `ధురంధర్` వంటి సినిమాలతో పోలిస్తే టాక్సిక్ కంటెంట్ పరంగా ఎంతో తీవ్రతను కలిగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

సినిమా రన్‌టైమ్ -సెన్సార్ సర్టిఫికేషన్ వివరాలు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పౌరాణిక లేదా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల జోరు మధ్య, ఇలాంటి డార్క్ అండ్ బోల్డ్ కంటెంట్‌తో వస్తున్న టాక్సిక్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మేకర్స్ మాత్రం ఈ సినిమాను పెద్దల కోసం రూపొందించిన అద్భుతమైన ఫెయిరీ టేల్‌గా అభివర్ణిస్తున్నారు. కంటెంట్‌లో ఉన్న తీవ్రతను బట్టి ఈ సినిమాను పరిణతి చెందిన ప్రేక్షకులు మాత్రమే చూడాలని సెన్సార్ నిబంధనలు సూచిస్తున్నాయి.

గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే యశ్ ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుని కొత్త ప్రయోగానికి తెరలేపారు. `టాక్సిక్` లో య‌శ్ పాత్ర అత్యంత క్రూరంగా ఉంటుందని టీజర్ ద్వారానే అర్థమైంది. యూకే సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం హింస , అడల్ట్ కంటెంట్ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. అలాంటి చోట సినిమాకు భారీ సెన్సార్ అడ్డంకులు ఉండటంతో చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ క‌థ‌నాల‌తో టాక్సిక్ పై అంచనాలు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. కమర్షియల్ హంగులతో కాకుండా కంటెంట్ ఆధారంగా సినిమాను నడిపించాలని మేకర్స్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని చెప్పాలి. ముఖ్యంగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వ ప్రతిభ, యశ్ నటన కలిసి సినిమాను అంతర్జాతీయ స్థాయి డార్క్ థ్రిల్లర్‌గా మార్చాయి. ప్రేక్ష‌కులు ఇన్నాళ్లు చూసిన యశ్ సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా సెన్సేషనల్ రిజల్ట్‌ను ఇస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది.