టాక్సిక్ హిట్ అయితే? గీతూ రేంజ్!
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రతిభావంతురాలైన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన `టాక్సిక్: ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్` ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది.
By: Srikanth Kontham | 23 Aug 2026 11:00 PM ISTరాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రతిభావంతురాలైన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన `టాక్సిక్: ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్` ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా గనుక బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తే దర్శకురాలిగా గీతూ మోహన్‌దాస్ రేంజ్ ఇండియన్ సినిమా స్థాయిలో వేరే లెవెల్‌కు వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రెమండస్ బజ్, గ్లోబల్ లెవల్ మేకింగ్ స్టైల్ చూస్తుంటే గీతూ మోహన్‌దాస్ టేకింగ్ ఎంత రిచ్‌గా ఉందో అర్థమవుతోంది.
ప్రాంతీయ పరిధికి పరిమితం కాకుండా హాలీవుడ్ రేంజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని మలిచిన తీరు గీతు ప్రతిభకు నిదర్శనం. సినిమా విడుదల దగ్గరవుతున్న కొద్దీ ట్రేడ్ వర్గాల్లో ..ప్రేక్షకుల్లో నెలకొన్న హైప్ ప్రాజెక్ట్ స్థాయిని తెలియజేస్తోంది. `టాక్సిక్` బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసి, బాషాతీతమైన ఆదరణను సొంతం చేసుకుంటే మాత్రం పాన్-ఇండియా హీరోలందరూ గీతూ మోహన్‌దాస్ తో పనిచేయడానికి క్యూ కట్టడం ఖాయం. అగ్రశ్రేణి కథానాయకులను డీల్ చేయగల సత్తా ఉన్న లేడీ డైరెక్టర్ల జాబితాలో ఆమె అత్యున్నత స్థానానికి చేరుకుంటారు.
పెద్ద బడ్జెట్ సినిమాలను, బలమైన ఎమోషన్స్‌తో కూడిన మాస్ కథలను కూడా ఎంతో పకడ్బందీగా తెరకెక్కించగల దర్శకురాలిగా గీతూ పేరు మారుమోగుతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు అరుదుగా కనిపించే లేడీ డైరెక్టర్ల గ్లోబల్ సక్సెస్ లెక్కలను ఈ సినిమా పూర్తిగా మార్చేయగలదు. మేకింగ్ పరంగా రాజీ పడకుండా ఆమె చూపించిన పట్టుదల, నటీనటుల నుంచి రాబట్టిన నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఈ సక్సెస్ గనుక దక్కితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆమెతో భారీ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేయ డానికి ముందుకొస్తాయి. పాన్ఇండియా హీరోలు-బడా నిర్మాణ సంస్థలు ముందుకొస్తే బడ్జెట్ కూడా కాశాన్నం టుంతుంది. ఇప్పటికే సౌత్ నుంచి 500 కోట్ల బడ్జెట్ సినిమాలు వచ్చేసాయి. తదుపరి టార్గెట్ 1000కోట్ల బడ్జెట్ సినిమా తీయడమే ఇక్కడి మేకర్స్ లక్ష్యం. ఇప్పుడున్న దర్శకుల్లో అంతటి సత్తా ఉన్న వారు రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి వారే. కానీ వీరంతా మేల్ డైరెక్టర్లు..ఇండస్ట్రీలో ఫీమేల్ డైరెక్టర్లు పెద్దగా లేని తరుణంలో గీతూ మోహన్ దాస్ గనుక టాక్సిక్ విజయం అనంతరం అలాంటి ఛాన్స్ తీసుకుంటే? ఇండియన్ సినిమాలో సంచ లనంగా మారిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
