Begin typing your search above and press return to search.

'టాక్సిక్' కు మరో కట్.. ఇంగ్లీష్ లో ఇలా..

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ రన్ టైమ్. తెలుగు, కన్నడ, హిందీ సహా ఇండియన్ వెర్షన్లు దాదాపు 3 గంటల 14 నిమిషాలు ఉన్నాయి.

By:  M Prashanth   |   3 Sept 2026 3:23 PM IST
టాక్సిక్ కు మరో కట్..  ఇంగ్లీష్ లో ఇలా..
X

యశ్ ‘టాక్సిక్’కు ఇప్పుడు మరో వెర్షన్ థియేటర్లలోకి వస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి ఇండియాలో ఇంగ్లీష్ వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది ఇప్పటికే చూసిన సినిమాకు ఇంగ్లీష్ డబ్బింగ్ మాత్రం కాదు. సినిమా మొదలుపెట్టినప్పుడే కన్నడతో పాటు ఇంగ్లీష్‌లో కూడా షూట్ చేశారు. ఇప్పుడు ఆ ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్‌ను ఇండియాలో కొన్ని నగరాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ రన్ టైమ్. తెలుగు, కన్నడ, హిందీ సహా ఇండియన్ వెర్షన్లు దాదాపు 3 గంటల 14 నిమిషాలు ఉన్నాయి. ఇంగ్లీష్ కట్ మాత్రం 2 గంటల 56 నిమిషాల 52 సెకన్లకే పరిమితమైంది. అంటే దాదాపు 17 నిమిషాల 20 సెకన్లు తక్కువ. మేకర్స్ కూడా ఇది ఇండియన్ వెర్షన్‌లో చూసిన కథకు షార్టర్ కట్ అని స్పెషల్ గా మెన్షన్ చేశారు.

అయితే ఆ 17 నిమిషాల్లో ఏ సీన్లు తగ్గించారు, కథలో ఏ భాగాలను చిన్నగా చేశారు అనే వివరాలు మాత్రం చెప్పలేదు. ఇంగ్లీష్ ట్రైలర్ కూడా ఇండియన్ ట్రైలర్ కంటే కొద్దిగా వేరుగా కట్ చేశారు. ఇప్పుడు పూర్తి సినిమాలోనూ అదే విధంగా కొన్ని మార్పులు ఉండబోతున్నాయి. కథ మాత్రం అదే అయినా, ఎడిటింగ్ పరంగా కొంచెం వేగంగా నడిచే వెర్షన్ దొరకనుంది.

‘టాక్సిక్’ విషయంలో ఇంగ్లీష్ వెర్షన్ ముందే ప్లాన్‌లో ఉంది. నార్మల్ గా పాన్ ఇండియా సినిమాలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో షూట్ చేసి లేదా డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. కానీ గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్‌లో కూడా చిత్రీకరించారు. అందుకే నటీనటుల డైలాగ్ డెలివరీ కూడా ఇంగ్లీష్ వెర్షన్ కోసం విడిగా జరిగింది.

సినిమాలో యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. ఆగస్టు 26న ఇండియన్ భాషల్లో సినిమా రిలీజ్ కాగా, ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం ఇప్పుడు ఇండియాలోకి వస్తోంది. ఈ కట్‌కు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 4 నుంచి ఈ ఇంగ్లీష్ కట్ కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక ఈ వెర్షన్ కు ఎలాంటి క్రేజ్ వస్తుందో చూడాలి.