'టాక్సిక్' హిట్ అయితే గేమ్ చేంజ్.. కొత్త ట్రెండ్ స్టార్ట్?
‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో రికార్డులు తిరగరాసిన రాకింగ్ స్టార్ యశ్, తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు.
By: Madhu Reddy | 8 Aug 2026 11:26 PM IST‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో రికార్డులు తిరగరాసిన రాకింగ్ స్టార్ యశ్, తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాను కర్ణాటక వ్యాప్తంగా తన స్వంత నిర్మాణ సంస్థ ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’ ద్వారానే సొంతంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలని యశ్ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంతో భారతీయ చిత్రసీమలోనే ఒక సరికొత్త వ్యాపార వ్యూహానికి తెరలేపారు..
బాక్సాఫీస్ వద్ద హీరోల సరికొత్త పవర్:
సాధారణంగా భారతీయ సినిమాలో నటులే ప్రొడక్షన్, క్రియేటివ్ డిసిషన్స్ చూసుకోవడం అరుదుగా జరుగుతుంది. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి అగ్ర నటులు మాత్రమే తమ సినిమాల మేకింగ్, క్రియేటివ్ విషయాలతో పాటు హోమ్ మార్కెట్ డిస్ట్రిబ్యూషన్‌ను కూడా సొంతంగా హ్యాండిల్ చేస్తుంటారు. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఒక హీరో నటిస్తూ, నిర్మిస్తూ, దానికి తోడు తన హోమ్ మార్కెట్‌లో డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను కూడా పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడం చాలా అరుదైన విషయం.
కర్ణాటకలో రికార్డు స్థాయి పంపిణీ వ్యూహం:
ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ‘టాక్సిక్’ చిత్రం కోసం కర్ణాటక మార్కెట్‌లో మునుపెన్నడూ చూడని రీతిలో భారీ ప్లాన్ చేశారు. ఇక మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా రికార్డు స్థాయిలో స్క్రీన్లను కేటాయించి, మొదటి రోజే అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించాలని చూస్తున్నారు. ఇక కేవలం కర్ణాటకలోనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలోనూ ఇప్పటికే భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు కావడం యాష్ బిజినెస్ మైండ్‌కు నిదర్శనం.
రాబోయే స్టార్లకు రూట్ మ్యాప్:
ఒకవేళ ‘టాక్సిక్’ కనుక బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఈ డిస్ట్రిబ్యూషన్ మోడల్ సక్సెస్ అయితే అది రాబోయే రోజుల్లో పెద్ద గేమ్‌చేంజర్‌గా మారనుంది. మిగిలిన పాన్-ఇండియా హీరోలు కూడా కేవలం పారితోషికానికే పరిమితం కాకుండా, తమ సినిమాల థియేట్రికల్ మార్కెటింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను తమ సొంత బ్యానర్ల ద్వారా నియంత్రించే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇక రాబోయే తరం స్టార్ హీరోలకు యశ్ ఒక రోల్ మోడల్‌గా నిలవనున్నారు.
నటుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్.. ఆల్ ఇన్ వన్:
యశ్ కేవలం తెరపై కనిపించే నటుడిగానే కాకుండా, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ నుంచి పంపిణీ వరకు ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. గేమ్ ఛేంజింగ్ కంటెంట్‌తో వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నాయకత్వ లక్షణాలను చూపుతూ, వ్యాపారంలోనూ నంబర్ వన్ అనిపించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక నటనతో పాటు బిజినెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో యాష్ వేస్తున్న అడుగులు ఇండస్ట్రీ పెద్దలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
‘టాక్సిక్’ సృష్టించబోయే సంచలనం:
ట్రైలర్ రాకతోనే ఈ సినిమాపై క్రేజ్ రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆగస్టు 26న రాబోతున్న ‘టాక్సిక్’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఇండియన్ సినిమా వ్యాపార సరళిలోనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఇక క్రియేటివ్ మేకింగ్ మరియు బిజినెస్ ఆస్పెక్ట్స్ రెండింటినీ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తూ యాష్ చేపట్టిన ఈ సాహసోపేత ప్రయత్నం ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.
