టాక్సిక్: బెస్ట్ ఫైట్ మేకింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ వెనుక యష్ కష్టం
ఇక ఆ యాక్షన్ వెనుక పడిన కష్టాన్ని ఇందులో చూపించారు. భారీ రాయల్ సర్కస్ సెట్ లో రాత్రి వేళ చిత్రీకరించిన ఈ యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ ప్రాసెస్ ఉహించని రేంజ్ లో ఉంది.
By: M Prashanth | 29 Aug 2026 1:01 PM ISTరాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీకి సంబంధించిన ఓ అదిరిపోయే మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సినిమాను గ్రాండ్ గా నిర్మించిన విషయం తెలిసిందే. మేకింగ్ వీడియోలో ఆ గ్రాండియర్ మళ్ళీ హైలెట్ అవుతోంది. సినిమాలో బెస్ట్ ఫైట్ గా నిలిచిన వాటిలో సర్కస్ యాక్షన్ ఎపిసోడ్ ఒకటి. ఇక ఆ యాక్షన్ వెనుక పడిన కష్టాన్ని ఇందులో చూపించారు. భారీ రాయల్ సర్కస్ సెట్ లో రాత్రి వేళ చిత్రీకరించిన ఈ యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ ప్రాసెస్ ఉహించని రేంజ్ లో ఉంది.
సర్కస్ టెంట్, జెయింట్ వీల్, లైటింగ్, జగ్లర్స్ లాంటి విజువల్స్ ఏమాత్రం గ్రాఫిక్స్ కావని అర్థమవుతుంది. ఫేమస్ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జె.జె. పెర్రీ ఈ సర్కస్ ఫైట్ ను డిజైన్ చేసిన విధానం ఈ వీడియోలో మెయిన్ హైలైట్. రెగ్యులర్ లొకేషన్స్ లో కాకుండా ఇలాంటి సర్కస్ వాతావరణంలో యాక్షన్ కంపోజ్ చేయడం వల్ల సీన్ కు ఒక కొత్త పేస్ వస్తుందని తన ఎక్స్ పీరియన్స్ పంచుకున్నారు. దీన్ని ఒక పవర్ఫుల్ ఫైట్ గా ఆయన ఎలివేట్ చేశారు.
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ విజన్ ను పెర్రీ ఈ వీడియోలో ప్రత్యేకంగా మెచ్చుకోవడం విశేషం. ఈ బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ కోసం యష్ పడిన కష్టం తెరవెనుక ఎలా ఉందో ఈ మేకింగ్ గ్లింప్స్ లో క్లియర్ గా ఎలివేట్ చేశారు. షూటింగ్ గ్యాప్ లో యష్ జిమ్ లో బరువులు ఎత్తుతూ తన సాలిడ్ ఫిజిక్ ను మెయింటైన్ చేయడం మరో హైలెట్. యాక్షన్ డైరెక్టర్ తో కలిసి కొత్త క్రియేటివ్ ఐడియాలు డిస్కస్ చేయడం ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్ పర్ఫెక్షన్ కోసం యష్ గ్రౌండ్ లెవల్ లో ఇన్వాల్వ్ అయ్యారని అర్థమవుతుంది.
కెమెరా ముందు యష్ కు ఉండే మ్యాడ్ స్వాగర్ గురించి యాక్షన్ డైరెక్టర్ ఇచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తోంది. భారీ ఫైర్ బ్యాక్ డ్రాప్ లో యష్ వైల్డ్ లుక్స్, ఒక చేత్తో గన్ పట్టుకుని చేసే మాస్ స్టంట్స్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం పక్కా. సినిమాలో నటించిన యాక్ట్రెస్ కూడా చాలా ఫాస్ట్ గా యాక్షన్ మూవ్స్ నేర్చుకున్నారని, సెట్ లో వాళ్ళ డెడికేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోలో కొందరు టీమ్ మెంబర్స్ తెలిపారు.
టెక్నికల్ గా చూసుకుంటే ఓవరాల్ గా ఈ మేకింగ్ వీడియోలో కెమెరా వర్క్, భారీ లైటింగ్ అరేంజ్మెంట్స్, ఫైర్ ఎఫెక్ట్స్ ఏవీ కూడా గ్రాఫిక్స్ చేయలేదని.తెలుస్తోంది. డైరెక్టర్ మానిటర్ లో యాక్షన్ అవుట్ పుట్ చూసుకుంటూ టీమ్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ను ఇందులో నేచురల్ గా క్యాప్చర్ చేశారు. సర్కస్ సెట్ లో ఫైటర్స్ తో యష్ తలపడే విధానం చూస్తుంటే హాలీవుడ్ స్టాండర్డ్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఫైట్ ను ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. మేకింగ్ వీడియో ఎండింగ్ లో కియారా అద్వానీతో కలిసి యష్ నవ్వుతూ మాట్లాడుకునే కొన్ని బ్యూటిఫుల్ క్యాండిడ్ మూమెంట్స్ ను జోడించారు. ప్రస్తుతం ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యశ్ యాక్షన్ కు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
