Begin typing your search above and press return to search.

టాక్సిక్ కి షాక్ ఇచ్చిన సెన్సార్!

అయితే సెన్సార్ బోర్డు `టాక్సిక్` సినిమాకు ఒక్క కట్ కూడా చెప్పకుండా పూర్తిగా ఆమోదించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Srikanth Kontham   |   21 Aug 2026 3:29 PM IST
టాక్సిక్ కి షాక్ ఇచ్చిన సెన్సార్!
X

రాకింగ్ స్టార్ యష్ క‌థానాయ‌కుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్: ఏ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్` విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ఎలాంటి మేజర్ కట్స్ లేకుండా `ఏ` సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

భారీ హింసాత్మక సన్నివేశాలు, బోల్డ్ కంటెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. రెండు చిన్న పదాలను .. డైలాగ్‌లను మ్యూట్ చేసి రీప్లేస్ చేయాలని మాత్రమే మేకర్స్‌ను బోర్డు కోరింది. అలాగే చట్టబద్ధమైన యాంటీ స్మోకింగ్, యాంటీ డ్రింకింగ్ వార్నింగ్‌లను జోడించమంటూ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌లో తగిన మార్పులు చేయాలని సూచించింది.

ఈ చిత్రానికి 3 గంటల 12 నిమిషాల రన్‌టైమ్ ఖరారైనట్లు సెన్సార్ సర్టిఫికేట్ ద్వారా తెలుస్తోంది. సినిమాలోని డార్క్ థీమ్ ..ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ముందు నుంచే పెద్దల కోసం మాత్రమేనని స్పష్టం చేస్తూ వచ్చారు. యష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా పిల్లల కోసం కాదని.. కేవలం అడల్ట్ ఆడియన్స్ కోసమే ప్రత్యేకంగా రూపొందించబడిందని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే సెన్సార్ బోర్డు `టాక్సిక్` సినిమాకు ఒక్క కట్ కూడా చెప్పకుండా పూర్తిగా ఆమోదించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఇదే స్థాయిలో వచ్చిన కొన్ని సినిమాలకు భారీగా కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డు, ఈ చిత్రానికి మాత్రం ఎలాంటి కోతలు విధించకపోవడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాల విషయంలో చిన్న చిన్న కిస్సింగ్ సీన్లను కూడా తొలగించే బోర్డు యష్ సినిమాలోని వయొలెన్స్ .. బోల్డ్ కంటెంట్‌ను ఎలా అనుమతించిందంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సెన్సార్ ఎలాంటి కట్స్ లేకుండా విజయవంతంగా దాటేసిన `టాక్సిక్` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతుండటంతో యష్ ఫ్యాన్స్ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషి, రుక్మిణీ వసంత్, తారా సుతారియా వంటి ప్రముఖ నటీమణులు నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. భారీ బడ్జెట్‌తో, గ్లోబల్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ఆగస్టు 26న ప్రపం చవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.