24 గంటల్లో 3.35 లక్షలు.. ‘టాక్సిక్’ స్పీడ్ మామూలుగా లేదే!
‘టాక్సిక్’ రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. అయితే ఇలాంటి సినిమాలకు రిలీజ్ కు రెండు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగా పెరుగుతాయి.
By: M Prashanth | 22 Aug 2026 11:58 AM IST‘టాక్సిక్’ రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. అయితే ఇలాంటి సినిమాలకు రిలీజ్ కు రెండు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగా పెరుగుతాయి. కానీ యష్ సినిమా మాత్రం బుకింగ్స్ ఓపెన్ చేసిన మొదటి రోజు నుంచే మంచి స్పీడ్ చూపిస్తోంది. పైగా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఒక సెక్షన్ తగ్గుతుందనే లెక్క ఉన్నా.. ప్రస్తుతం టికెట్ సేల్స్‌లో మాత్రం దాని ఎఫెక్ట్ పెద్దగా కనిపించడం లేదు.
బుకింగ్స్ మొదలైన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా ‘టాక్సిక్’కు 3.35 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ వెల్లడించారు. మరోవైపు బుక్‌మైషోలో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించిన వారి సంఖ్య 12 లక్షలు దాటింది. ఇంట్రెస్ట్ చూపించిన ప్రతి ఒక్కరూ టికెట్ కొంటారని చెప్పలేం. కానీ రిలీజ్‌కు నాలుగు రోజుల ముందే ఆ నంబర్ రావడం అంటే సినిమాపై క్రేజ్ మామూలుగా లేదని అర్థమవుతుంది.
ఇప్పుడు అసలు చూడాల్సింది ఈ 3.35 లక్షల నంబర్ చివరి రోజు వరకు ఎక్కడికి వెళ్తుందనేది. ఎందుకంటే ఇంకా అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో షోలు ఓపెన్ కావాల్సి ఉంటుంది. షోలు పెరిగే కొద్దీ టికెట్ సేల్స్ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా రిలీజ్ ముందు రోజు బుకింగ్స్‌లో వచ్చే జంప్ పెద్ద సినిమాల ఓపెనింగ్‌ను బాగా మార్చేస్తుంది. ‘టాక్సిక్’కు ఇప్పటికే వచ్చిన స్టార్ట్ వల్ల ఆ చివరి పుష్ మీద బజ్ పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు పెద్ద రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు ఇక్కడ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో థియేటర్ల విషయంలో మంచి ప్లేస్‌మెంట్ దొరికే అవకాశం ఉంది. యష్‌కు తెలుగులో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈసారి ‘టాక్సిక్’ పూర్తిగా కొత్త వరల్డ్‌తో వస్తోంది. అందుకే తెలుగు బుకింగ్స్ ఎంత వరకు వెళ్తాయన్నది కూడా డే 1 లెక్కలో కీలకం కానుంది.
మరోవైపు ఆగస్ట్ 26న హాలిడే ఉండటం సినిమాకు కలిసొచ్చే విషయం. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి లాంటి పెద్ద కాస్ట్ కూడా ఉంది. గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ పీరియడ్ క్రైమ్ డ్రామాలో యష్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలా ఉండదనే ఆసక్తిని పెంచింది. ఇంకా నాలుగు రోజుల బుకింగ్స్ మిగిలే ఉన్నాయి. అందులోనూ చివరి 48 గంటలే అసలు కీలకం. ప్రస్తుతం ఉన్న స్పీడ్ అక్కడ కూడా కొనసాగితే రిలీజ్ రోజు భారీగా షోలు నిండే అవకాశం ఉంది.
