Begin typing your search above and press return to search.

20 లక్షలు దాటేసింది.. ‘టాక్సిక్’ బుకింగ్స్ మామూలుగా లేవుగా!

యష్ ‘టాక్సిక్’ థియేటర్లలోకి రావడానికి ఇక కొన్ని గంటలే ఉన్నాయి. ‘కేజీఎఫ్ 2’ తర్వాత నాలుగేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని యష్ వస్తుండటంతో మొదటి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనే లెక్కలు ముందు నుంచే ఉన్నాయి.

By:  M Prashanth   |   25 Aug 2026 4:45 PM IST
20 లక్షలు దాటేసింది.. ‘టాక్సిక్’ బుకింగ్స్ మామూలుగా లేవుగా!
X

యష్ ‘టాక్సిక్’ థియేటర్లలోకి రావడానికి ఇక కొన్ని గంటలే ఉన్నాయి. ‘కేజీఎఫ్ 2’ తర్వాత నాలుగేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని యష్ వస్తుండటంతో మొదటి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనే లెక్కలు ముందు నుంచే ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఆ గ్యాప్ యష్ మార్కెట్‌ను పెద్దగా ఎఫెక్ట్ చేసినట్లు కనిపించడం లేదు. చివరి రోజు బుకింగ్స్ మరింత స్పీడ్ అందుకున్నాయి.





‘టాక్సిక్’ టీమ్ విడుదల చేసిన లేటెస్ట్ లెక్కల ప్రకారం బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ కలిపి ఇప్పటికే 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అంతేకాదు బుక్‌మైషోలో ఒక్క గంటలోనే దాదాపు 50 వేల టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ చెబుతున్నారు. రిలీజ్‌కు ఒక్కరోజు ముందు ఇంత వేగంగా టికెట్లు కదలడం చూస్తుంటే బజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు. అయితే ఈ 20 లక్షల నెంబర్ మొత్తం అడ్వాన్స్ సేల్స్‌కు సంబంధించినదని టీమ్ ప్రకటించింది.





ఇక డబ్బుల లెక్కలోనూ ‘టాక్సిక్’ పెద్ద నంబర్స్ వైపు వెళ్తోంది. మంగళవారం మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉన్న ట్రేడ్ లెక్కల ప్రకారం ఇండియాలో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ రూ.40 కోట్ల మార్క్ దాటింది. హిందీ వెర్షన్ నుంచే రూ.15 కోట్లకు పైగా రావడం ఇక్కడ మరో పెద్ద పాయింట్. కర్ణాటకతో పాటు నార్త్ మార్కెట్ కూడా యష్‌కు భారీగా ఓపెన్ అవుతోంది.

నిజానికి ‘టాక్సిక్’కు ఉన్న అసలు చాలెంజ్ కూడా ఇదే. ‘కేజీఎఫ్ 2’తో యష్‌కు దేశవ్యాప్తంగా వచ్చిన మార్కెట్ ఒక్క సినిమా వరకేనా, లేక తర్వాత సినిమాకు కూడా అలాగే వస్తుందా అనే ప్రశ్న ఉంది. పైగా ఈసారి ‘కేజీఎఫ్’ బ్రాండ్ లేదు. ప్రశాంత్ నీల్ కూడా లేడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో పూర్తిగా కొత్త కథతో వస్తున్నాడు. అయినా అడ్వాన్స్ బుకింగ్స్‌లో హిందీ మార్కెట్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే యష్ పేరు అక్కడ ఇంకా బలంగానే పని చేస్తోంది.

మరోవైపు ‘టాక్సిక్’కు ‘A’ సర్టిఫికెట్ రావడం కూడా బుకింగ్స్‌ను పెద్దగా ఆపినట్లు లేదు. పెద్ద స్టార్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా కీలకం. కానీ ఈ సినిమా మొదటి నుంచే పెద్దల కోసం తీసిన కథగా ప్రమోట్ చేశారు. మూడు గంటలకు పైగా రన్‌టైమ్ ఉన్నా, కొన్ని నగరాల్లో టికెట్ ధరలు భారీగా ఉన్నా అడ్వాన్స్ సేల్స్ మాత్రం కొనసాగుతున్నాయి.

ఇక నెక్స్ట్ యష్ ముందున్న టార్గెట్ అడ్వాన్స్ బుకింగ్స్ కాదు.. మొదటి రోజు ఉదయం నుంచి వచ్చే అసలు టాక్. మొదటి రోజు భారీ ఓపెనింగ్‌కు కావాల్సిన గ్రౌండ్ మాత్రం ఇప్పటికే రెడీ అయింది. ‘కేజీఎఫ్’ తర్వాత యష్ ఎలాంటి సినిమా ఎంచుకుంటాడనే నాలుగేళ్ల ఎదురుచూపులకు మరికొన్ని గంటల్లో సమాధానం రాబోతోంది. టాక్ కూడా బుకింగ్స్‌కు తోడైతే వీకెండ్ లెక్కలు ఎక్కడికి వెళ్తాయన్నదే నెక్స్ట్ పాయింట్.