రేర్ ప్లాన్ ను అమలు పరిచిన టాక్సిక్ టీమ్!
టాక్సిక్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కనుండగా, గీతూ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 26 Aug 2025 2:00 AM ISTఅప్పటివరకు కేవలం కన్నడ ప్రేక్షకులకే పరిచయమైన యష్ లైఫ్ ను కెజిఎఫ్ సినిమా ఒక్కసారిగా మార్చేసింది. కెజిఎఫ్2 తర్వాత యష్ రాక్‌స్టార్ కూడా అయ్యారు. ఆ రెండు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ తో పాటూ గుర్తింపును తెచ్చుకున్న యష్ తర్వాత ఏ సౌత్ స్టార్ డైరెక్టర్‌తోనో లేదా బాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ తోనో సినిమా చేస్తారనుకున్నారు.
లేడీ డైరెక్టర్‌తో యష్ మూవీ
కానీ యష్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. టాక్సిక్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కనుండగా, గీతూ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఏకకాలంలో ఇంగ్లీష్ లో కూడా రూపొందుతుంది. టాక్సిక్ కోసం పలు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా వర్క్ చేస్తున్నారు.
45 రోజుల యాక్షన్ షెడ్యూల్
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం మేకర్స్ 45 రోజుల యాక్షన్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మేకర్స్ ఒకేసారి యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించరు. బ్రేక్ తీసుకుంటూ పలు షెడ్యూల్స్ లో యాక్షన్ పార్ట్ ను పూర్తి చేస్తారు కానీ టాక్సిక్ టీమ్ మాత్రం ఈ 45 రోజుల షెడ్యూల్ లోనే కీలకమైన యాక్షన్ సీన్స్ షూటింగ్ ను చేయనున్నట్టు తెలుస్తోంది.
హాలీవుడ్ స్టంట్‌మాస్టర్ నేతృత్వంలో..
హాలీవుడ్ స్టంట్ మాస్టర్ జేజే పెర్రీ మరియు ఇంకొందరు ఈ షెడ్యూల్ ను మానిటరింగ్ చేస్తున్నారు. కాగా యష్ ఈ సినిమా కోసం చాలా కొత్త లుక్ లోకి మేకోవర్ అయ్యారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తవగా ఆ అవుట్‌పుట్‌తో మేకర్స్ హ్యాపీగా ఉన్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
