Begin typing your search above and press return to search.

టాక్సిక్ హైప్‌కు కొత్త బెంచ్‌మార్క్? రిలీజ్‌కు ముందే కలెక్షన్ల‌పై చర్చలు

క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ హీరోగా తెర‌కెక్కుతున్న టాక్సిక్ సినిమా రిలీజ్ కు ముందే విప‌రీత‌మైన చర్చ‌ల్లో నిలుస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   26 Feb 2026 10:38 PM IST
టాక్సిక్ హైప్‌కు కొత్త బెంచ్‌మార్క్? రిలీజ్‌కు ముందే కలెక్షన్ల‌పై చర్చలు
X

క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ హీరోగా తెర‌కెక్కుతున్న టాక్సిక్ సినిమా రిలీజ్ కు ముందే విప‌రీత‌మైన చర్చ‌ల్లో నిలుస్తోంది. దానికి కార‌ణాలు చాలానే ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబ‌ర్లు, సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్న క‌లెక్ష‌న్స్ గురించి నెంబ‌ర్లు ఇలా చాలానే ఉన్నాయి. తాజాగా #Toxic పేరుతో సోష‌ల్ మీడియాలో ప్ర‌చార‌మ‌వుతున్న నెంబ‌ర్లు మాత్రం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో డిస్క‌ష‌న్ టాపిక్ గా మారింది.

మూడు ప్రాంతాల్లోనే రూ.288 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్

సోషల్ మీడియాలో ప్ర‌చార‌మ‌వుతున్న వివరాల ప్రకారం, ఈ సినిమాకు కేవలం మూడు ప్రధాన మార్కెట్ల నుంచే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ కలిపి రూ.120 కోట్లకు, ఓవర్సీస్ మార్కెట్ రూ.105 కోట్లకు, తమిళనాడు రూ.63 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఈ మూడు ప్రాంతాల నుంచే మొత్తం రూ.288 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు చెప్తున్నారు. మామూలుగా ఒక సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం దాదాపు డబుల్ గ్రాస్ రావాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే, టాక్సిక్ ఈ మూడు మార్కెట్లలోనే సినిమా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ క‌లెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇది కేవలం మూడు ప్రాంతాల నుంచే రావాల్సిన సంఖ్య కావడం గమనార్హం. మిగిలిన ఏరియాల లెక్క‌లు వేరేగా ఉన్నాయి.

ఇక్కడే ప్రధానంగా చర్చ మొదలైంది. ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి నెంబర్లు సాధారణ స్టార్ సినిమాలకు కూడా చాలా కఠినమైన టార్గెట్. గతంలో భారీ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో ఈ స్థాయి గ్రాస్ సాధించాయి. అలాంటి సందర్భాల్లో కూడా కంటెంట్, పాజిటివ్ టాక్, లాంగ్ రన్ లాంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి.

భారీ హైప్ అవ‌స‌ర‌మా అని కామెంట్స్

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫిగర్స్‌పై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ నెంబ‌ర్స్ ఎలా సాధ్యం? రిలీజ్‌కు ముందే ఇలా భారీ హైప్ క్రియేట్ చేయడం అవసరమా? అని ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే ఈ నెంబ‌ర్స్ పూర్తిగా అతిశయోక్తి మాత్రమేనని, ప్రొడ్యూసర్స్ ప్రచారం కోసం ఇలాంటి ఫిగర్స్ బయటకు వదులుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు, అభిమాన వర్గాలు మాత్రం ఇది సినిమాపై ఉన్న భారీ క్రేజ్‌కు నిదర్శనం అని అంటున్నారు. స్టార్ పవర్, భారీ స్కేల్, పాన్ ఇండియా మార్కెట్.. వీట‌న్నింటినీ క‌లిపి చూస్తే టాక్సిక్ రికార్డులు కొల్ల‌గొట్ట‌డం సాధ్యమేనని వారు నమ్ముతున్నారు. మొత్తానికి, టాక్సిక్ సినిమా రిలీజ్‌కు ముందే కలెక్షన్ నెంబర్ల చుట్టూ పెద్ద చర్చ నెలకొంది. ఈ ప్రచారం నిజమా? లేక హైప్ కోసమేనా? అన్నది తేలాలంటే సినిమా రిలీజై, బాక్సాఫీస్ వద్ద అస‌లు రిజ‌ల్ట్ వ‌చ్చే వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు మాత్రం ఈ కలెక్షన్ గోల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా కొనసాగడం ఖాయం.