యష్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు..?
సౌత్ లో ఏ హీరో అయితే సూపర్ హిట్ కొడతారో అలాంటి వారిని తెలుగు పరిశ్రమకు తీసుకు రావడం కామన్ అయ్యింది.
By: Ramesh Boddu | 11 Dec 2025 9:00 PM ISTసౌత్ లో ఏ హీరో అయితే సూపర్ హిట్ కొడతారో అలాంటి వారిని తెలుగు పరిశ్రమకు తీసుకు రావడం కామన్ అయ్యింది. అందుకే తెలుగులో మన హీరోలతో పాటు తమిళ, కన్నడ స్టార్స్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లు చేస్తున్న సినిమాలు తెలుగు డబ్ రిలీజ్ అవ్వడమే కాకుండా ఇక్కడ ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తారు కాబట్టి తెలుగు ఆడియన్స్ ఆ స్టార్స్ ని ఇష్టపడతారు. ఈ క్రమంలోనే కె.జి.ఎఫ్ రెండు భాగాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న యష్ కి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది.
కె.జి.ఎఫ్ తర్వాత టాక్సిక్..
కె.జి.ఎఫ్ తర్వాత అతను చేస్తున్న టాక్సిక్ సినిమా బిజినెస్ కూడా తెలుగులో భారీగా జరిగింది. టాక్సిక్ తర్వాత యష్ చేసే సినిమాపై క్లారిటీ రాలేదు. ఐతే తెలుగు నిర్మాతలు యష్ ని డైరెక్ట్ తెలుగు సినిమా అఫ్కోర్స్ అతనితో తీస్తే అది పాన్ ఇండియా బొమ్మే అవుతుంది. యష్ ని స్ట్రైట్ తెలుగు సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నారు. కె.జి.ఎఫ్ తర్వాతే ఆ ప్లాన్స్ జరిగినా టాస్కిక్ కమిట్ మెంట్ వల్ల అది కుదరలేదు.
ఐతే యష్ టాక్సిక్ తర్వాత అయినా తెలుగులో చేస్తాడా లేదా అన్న క్లారిటీ లేదు. ఎందుకంటే తెలుగులో చేయాలంటే సరైన కథ కుదరాలి. కె.జి.ఎఫ్ తో తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కి తగిన కథలతోనే యష్ సినిమాలు చేయాల్సి ఉంటుంది. అలా కాదని చేస్తే ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారు. అందుకే యష్ కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఐతే కన్నడలో ఆల్రెడీ సూపర్ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.
కె.జి.ఎఫ్ చాప్టర్ 3 అంటూ..
సో అతని దారిలోనే యష్ కూడా తెలుగు డైరెక్టర్, నిర్మాతలతో డీల్ సెట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఐతే అది జరగాలంటే టాక్సిక్ రిలీజ్ అవ్వాలి. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు యష్ మరో సినిమా ఓకే చేసే ఛాన్స్ లేదు. తెలుగు నిర్మాతలు మాత్రం యష్ తో భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క కె.జి.ఎఫ్ మేకర్స్ హోంబలే ప్రొడక్షన్స్ కూడా యష్ తో సినిమాలు చేయాలని చూస్తున్నారు.
కె.జి.ఎఫ్ చాప్టర్ 3 అంటూ ఒక కన్ ఫ్యూజన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ యష్ తోనే అది తీస్తాడా లేదా అతనికి ఏదైనా సెపరేట్ ప్లాన్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది. టాక్సిక్ తో పాటు బాలీవుడ్ రామాయణంలో కూడా యష్ నటిస్తున్నాడు. టాక్సిక్, రామాయణ్ పార్ట్ 1 రెండు సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్నాయి. ఐతే రామాయణ్ మూడు భాగాలు చేసే ప్లానింగ్ ఉంది కాబట్టి అది చేస్తూనే యష్ నెక్స్ట్ సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటాడని చెప్పొచ్చు. యష్ కి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ కి అతనితో ఒక క్రేజీ సినిమా చేస్తే బాగుంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. యష్ చేస్తానంటే చాలు కానీ అతని కోసం బడా నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయి.
