Begin typing your search above and press return to search.

టాక్సిక్ నుండీ యష్ షర్ట్ లెస్ లుక్ లీక్!

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోయే తాజా మూవీ టాక్సిక్:ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా నుండే ఇప్పుడు ఒక వీడియో లీక్ అయింది అంటూ ట్విట్టర్ లో వార్తలు వస్తున్నాయి.

By:  Madhu Reddy   |   14 Oct 2025 12:05 PM IST
టాక్సిక్ నుండీ యష్ షర్ట్ లెస్ లుక్ లీక్!
X

కే.జి.ఎఫ్ సిరీస్ లతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు నటుడు యష్.. ఒకప్పుడు కన్నడ సినిమాలు చేస్తూ కన్నడ వరకే పరిమితమైన ఈయన ఒక్కసారిగా కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన కేజీఎఫ్ 1,కేజీఎఫ్ 2 రెండు సినిమాలు యష్ కెరియర్ ని మార్చేశాయి. అయితే ఈ రెండు సినిమాల తర్వాత యష్ టాక్సిక్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకి లేడీ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ నుండి ఒక వీడియో లీక్ అయింది అంటూ ట్విట్టర్ లో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో యష్ లుక్ చాలా స్టైలిష్ గా కనిపించడమే కాదు.. అది చూసిన ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.? ఎందుకు యష్ ఫ్యాన్స్ దీన్ని అంతలా వైరల్ చేస్తున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోయే తాజా మూవీ టాక్సిక్:ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా నుండే ఇప్పుడు ఒక వీడియో లీక్ అయింది అంటూ ట్విట్టర్ లో వార్తలు వస్తున్నాయి. ఆ వీడియోలో యష్ బాల్కనీలో నిల్చొని షర్ట్ లెస్ లుక్ లో స్మోకింగ్ చేస్తున్న ఈ వీడియో వైరల్ గా మారడంతో చాలామంది ఇది టాక్సిక్ సినిమాలోని సన్నివేశమే అని, టాక్సిక్ మూవీ నుండి వీడియో లీక్ అయింది అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలో యష్ ఒంటిమీద చొక్కా కూడా వేసుకోకుండానే తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తున్నారు.. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి చిన్న ఫోటో కూడా లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే ఇలాంటి సమయంలో ఈ వీడియో లీక్ అయ్యింది అంటూ వస్తున్న వార్తలు దర్శకురాలికి ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సీన్ అఫీషియల్ కాదు లీక్డ్ సీన్ కావడంతో ఇది కాస్త ట్విట్టర్ మొత్తం మార్మోగిపోతుంది.

దీంతో చిత్ర యూనిట్ కి కొత్త భయం పట్టుకుంది.ఎందుకంటే ఓ సినిమా చేస్తే ఆ సినిమాకి సంబంధించి చిన్న సీన్ కూడా లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సందర్భంలో ఫొటోస్, వీడియోస్ లీక్ అవుతూ ఉంటాయి. అలా తాజాగా టాక్సిక్ మూవీ నుండి యష్ స్మోకింగ్ వీడియో లీక్ అయ్యి.. ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. దీంతో చిత్ర యూనిట్ అలర్ట్ అయ్యి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు.

టాక్సిక్ మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కాబోతోంది .. మొదట ఈ సినిమా ఈ ఏడాది విడుదలవుతుందని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత పలు కారణాల వల్ల వాయిదా పడింది. పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీలో యష్ హీరోగా నటించగా.. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, అక్షయ్ ఒబెరాయ్, హ్యూమా ఖురేషి, సుదేవ్ నాయర్ లు కీరోల్స్ పోషిస్తున్నారు.. ఇక ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యష్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఈ మూవీ ఉండడం విశేషం. యష్ టాక్సిక్ మూవీ చేస్తూనే మరో పక్క బాలీవుడ్ లో రామాయణ మూవీలో రావణుడి పాత్రలో నటిస్తున్నారు