రష్మిక కామెంట్ పై రెస్పాండ్ అయిన యష్
కన్నడ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు భారీ డిస్కషన్ కు దారితీసిన రష్మిక మందన్న మిస్టర్ షోఆఫ్ కామెంట్ కు ఇప్పుడు యష్ స్వయంగా స్పందించారు.
By: Sravani Lakshmi Srungarapu | 16 Aug 2026 11:24 PM ISTకన్నడ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు భారీ డిస్కషన్ కు దారితీసిన రష్మిక మందన్న మిస్టర్ షోఆఫ్ కామెంట్ కు ఇప్పుడు యష్ స్వయంగా స్పందించారు. చాలా ఏళ్ల క్రితం రష్మిక కెరీర్ ఆరంభ దశలో ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో కన్నడ సినీ పరిశ్రమలో మిస్టర్ షోఆఫ్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు యష్ పేరు చెప్పగా, ఆ తర్వాత యష్ ఫ్యాన్స్ నుంచి రష్మికపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కాలం గడిచిపోయిన తర్వాత కూడా ఆ కామెంట్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ కు వస్తూనే ఉంది.
తాజాగా రజత్ శర్మ నిర్వహించే ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న యష్‌కు ఇదే విషయంపై ప్రశ్న ఎదురైంది. అయితే గతాన్ని గుర్తు చేసుకున్న యష్ ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా చాలా కూల్‌గా రియాక్ట్ అవడం ఆసక్తిని కలిగించింది. ప్రతి ఒక్కరికీ తమదైన అభిప్రాయం ఉంటుందని, ఒక వ్యక్తి తన గురించి ఏమనుకుంటున్నారనే దాని ఆధారంగా తన వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసుకోలేనని ఆయన స్పష్టం చేశారు.
అప్పటికి రష్మిక ఇండస్ట్రీలో కొత్తగా ఉన్న విషయాన్ని కూడా యష్ ప్రస్తావించారు. టెలివిజన్ కార్యక్రమాల్లో ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు, ఇచ్చిన ఆప్షన్లలో ఒకదాన్నే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె ఆ కామెంట్ ను చెప్పి ఉండొచ్చని, అందుకే దాన్ని పర్సనల్ గా తీసుకుని తనను తాను మార్చుకోవాల్సిన అవసరం లేదని యష్ చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ కు కూడా యష్ ఓ కీలక సందేశం ఇచ్చారు. తాను అభిమానించే మరో నటుడిని గౌరవించలేని వ్యక్తిని నిజమైన యష్ అభిమానిగా భావించనని స్పష్టం చేశారు. దీంతో తన పర్సనల్ ఇమేజ్ కంటే సినీ ఇండస్ట్రీలో పరస్పర గౌరవానికే ప్రాధాన్యత ఇస్తున్నాననే మెసేజ్‌ను ఆయన ఇచ్చారు. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే యష్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ లో ఆయన హీరోగా నటిస్తున్నారు. దాంతో పాటూ నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణలో రావణుడిగా కనిపించనున్నారు యష్. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
