Begin typing your search above and press return to search.

'రామాయ‌ణ' కోసం మేక‌ర్స్‌ భారీ ప్లాన్ రెడీ!

రామాయ‌ణ గాథ ఆధారంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సినిమాలొచ్చాయి. ఇప్పుడు ఇదే గాథ‌తో బాలీవుడ్‌లో అత్యంత భారీ స్థాయిలో `రామాయ‌ణ‌`ని రూపొందిస్తున్నారు.

By:  Tupaki Entertainment Desk   |   4 Feb 2026 8:00 AM IST
రామాయ‌ణ కోసం మేక‌ర్స్‌ భారీ ప్లాన్ రెడీ!
X

రామాయ‌ణ గాథ ఆధారంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సినిమాలొచ్చాయి. ఇప్పుడు ఇదే గాథ‌తో బాలీవుడ్‌లో అత్యంత భారీ స్థాయిలో `రామాయ‌ణ‌`ని రూపొందిస్తున్నారు. `దంగ‌ల్‌` మూవీతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు నితేష్ తివారీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నాడు. ర‌ణ్‌బీర్ క‌పూర్‌, సాయి ప‌ల్ల‌వి సీతారాములుగా న‌టిస్తున్న ఈ మూవీలో హ‌ను మంతుడిగా స‌న్నీడియోల్‌, రావ‌ణుడిగా య‌ష్ న‌టిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీని ఐమ్యాక్స్ వెర్ష‌న్‌లో అత్యంత ఆధునిక టెక్నాల‌జీతో రూపొందిస్తున్నారు.

య‌ష్‌, న‌మిత్ మ‌ల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కోసం ఏకంగా రూ.1600 కోట్ల మేర ఖ‌ర్చు చేస్తున్న‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌. దేశ వ్యాప్తంగానే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమా కోసం ప‌దివేల మంది న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ప‌ని చేస్తున్నారు. హాలీవుడ్ పాపుల‌ర్ మూవీస్ అవ‌తార్‌, డ్యూన్ వంటి సినిమాల‌కు వ‌ర్క్ చేసిన టెక్నీషియ‌న్స్ కంటే ఎక్కువ మంది ఈ మూవీ కోసం వ‌ర్క్ చేస్తుండ‌టం, హాలీవుడ్ టెక్నీషియ‌న్‌లు, వీఎఫ్ ఎక్స్ కంప‌నీలు వ‌ర్క్ చేస్తుండ‌టంతో ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది.

ఇంట్ర‌డ‌క్ష‌న్ పేరుతో విడుద‌ల చేసిన వీడియో ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్‌గా మారి సినిమాపై అంచ‌నాల్ని తారా స్థాయికి చేర్చింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ మొత్తంపూర్త‌యింది. 2026 దీపావ‌ళికి మొద‌టి భాగాన్ని భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నామ‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు కూడా. ఇక రెండ‌వ పార్ట్‌కు సంబంధించిన రిలీజ్ టైమ్‌ని కూడా అనౌన్స్ చేసేశారు. దీన్ని 2027 దీపావ‌ళికి రిలీజ్ చేయ‌బోతున్నారు. ఎండో భాగానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల షూటింగ్ కొంత వ‌ర‌కు బ్యాలెన్స్‌గా ఉంద‌ని తెలిసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇందులోని క్యారెక్ట‌ర్ లుక్స్‌ని డైరెక్ట్‌గా రివీల్ చేయ‌ని మేక‌ర్స్ ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఓ డేట్‌ని ఫిక్స్ చేసుకున్న‌ట్టుగా తెలిసింది. మార్చి 26న శ్రీ‌రామ న‌వ‌మి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 27న టీమ్ ఓ భారీ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోంది. సినిమాలోని కీల‌క పాత్ర‌ల ప‌రిచ‌యానికి సంబంధించిన వీడియోని ఈ సంద‌ర్భంగా మార్చి 27న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం భాయ‌తీయ చ‌రిత్ర‌లో విక్ట‌రీకి చిహ్నంగా నిలిచిని ఇండియా గేట్‌ని ఇందుకు `రామాయ‌ణ‌` టీమ్ వేదిక‌గా ఎంచుకుందని తెలిసింది.

ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ స్టార్స్ అంతా పాల్గొంటార‌ని, అంతే కాకుండా `రామాయ‌ణ‌`లో భాగ‌మైన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంతా పాల్గొంటార‌ని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన పూర్తి ప్లాన్ ని నిర్మాత న‌మిత్ మ‌ల్హోత్రా సిద్ధం చేశాడ‌ని, ఈ భారీ ఈవెంట్‌ని నెవ‌ర్ బిఫోర్ అనే స్థాయిలో స‌క్సెస్ చేయాల‌ని అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. ఇండియ‌న్ స్క్రీన్‌పై మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా ఓ టెక్నిక‌ల్ వండ‌ర్‌గా `రామాయ‌ణ‌`ని తెర‌పై ఆవిష్క‌రించ‌బోతున్నార‌ని తెలుస్తోంది.