Begin typing your search above and press return to search.

రామాయణ : అదే నిజమైతే రాముడి కంటే రావణుడికి ఎక్కువ?

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న 'రామాయణ' మూవీ నవంబర్‌ 6, 2026న దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   8 Sept 2026 11:53 AM IST
రామాయణ : అదే నిజమైతే రాముడి కంటే రావణుడికి ఎక్కువ?
X

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న 'రామాయణ' మూవీ నవంబర్‌ 6, 2026న దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌ ను ఈ సినిమాలో రాముడిగా చూడబోతున్నాం, ఇక లేడీ పవర్‌ స్టార్‌ అంటూ అభిమానులు పిలుచుకునే సాయి పల్లవిని ఈ సినిమాలో సీతాదేవి పాత్రలో చూడబోతున్నాం. ఇప్పటికే వీరికి సంబంధించిన లుక్స్ రివీల్‌ అయ్యాయి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా రావణాసురుడు పాత్ర నిలువనున్నట్లు చెబుతున్నారు. రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్‌ యశ్‌ నటించిన విషయం తెల్సిందే. కేజీఎఫ్‌ సినిమాతో యశ్‌ కి పాన్‌ ఇండియా రేంజ్‌లో మార్కెట్‌ క్రియేట్‌ అయింది. అందుకే యశ్ ను రామాయణ లో రావణాసురుడు పాత్రలో నటింపజేశారు. ఆయన ప్రజెన్స్‌తో సినిమా వెయిట్‌ పెరగడం ఖాయం అని మేకర్స్ భావించారు.

నితేష్ తివారీ రామాయణ విడుదల తేదీ...

రామాయణ మేకర్స్ ముఖ్యంగా దర్శకుడు నితేష్ తివారీ అనుకున్నట్లుగానే యశ్‌ నటించడంతో రావణాసురుడి పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగి, సినిమాకు పబ్లిసిటీ దక్కుతుంది. రామాయణ సినిమాలో యశ్‌ నటించడం మాత్రమే కాకుండా సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. మొదట యశ్‌ కి నిర్మాతలు రూ.100 కోట్ల పారితోషికం ఆఫర్‌ చేశారని సమాచారం. అందుకు యశ్‌ కూడా ఓకే చెప్పాడట. కానీ షూటింగ్‌ ప్రారంభం అయ్యే సమయంలో యశ్‌ ను సినిమా నిర్మాతల్లో భాగస్వామ్యం చేయడం జరిగిందట. యశ్‌ తన పారితోషికంను పెట్టుబడిగా పెట్టినందుకు గాను సౌత్‌ ఇండియన్‌ భాషల డబ్బింగ్‌ రైట్స్ ఇచ్చే విధంగా ఒప్పందం జరిగిందట. కన్నడం, తెలుగు, మలయాళం, తమిళ్‌ భాషల్లో విడుదల చేయగా వచ్చిన డబ్బు యశ్‌ కి పారితోషికంగా దక్కబోతుంది అనేది బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

రావణుడి పాత్రలో కన్నడ స్టార్‌ యశ్‌...

ఈ సినిమాలో రాముడిగా నటించినందుకు గాను రణబీర్‌ కపూర్‌ దాదాపు రూ.150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. పలు జాతీయ మీడియా సంస్థలు రణబీర్‌ కపూర్‌ రెండు పార్ట్‌లకు గాను రూ.75 కోట్ల చొప్పున మొత్తం రూ.150 కోట్ల పారితోషికం అందుకున్నాడనే కథనాలు ప్రచురించాయి. సాయి పల్లవి సైతం రెండు పార్ట్‌లకు కలిపి భారీ పారితోషికం అందుకున్నట్లుగా సమాచారం అందుతోంది. కెరీర్‌లో ఇప్పటి వరకు తీసుకోని పారితోషికంను సాయి పల్లవి అందుకుందట. కేజీఎఫ్‌తో దక్కిన క్రేజ్‌తో యశ్‌ ఈ సినిమాకు ఏకంగా సౌత్‌ ఇండియా డబ్బింగ్‌ రైట్స్ దక్కించుకోవడంతో అందరి కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నట్లు అయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామాయణ సినిమాకు సౌత్‌ ఇండియాలోనూ మంచి క్రేజ్ ఉంది. కనుక అన్ని భాషల్లో కలిపి కచ్చితంగా రూ.150 కోట్లకు మించి వచ్చే అవకాశం ఉంది.

రాముడిగా రణబీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి...

టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రేక్షకులు అమితంగా అభిమానించే సాయి పల్లవి ఈ సినిమాలో సీత పాత్రలో ఉండటంతో రామాయణ సినిమా గురించి తమిళ, తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కన్నడ స్టార్‌ యశ్‌ ఉండటం వల్ల అక్కడి ప్రేక్షకులు సైతం రామాయణ సినిమాకు బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే బయ్యర్లు తమిళ, తెలుగు, కన్నడ భాషలకు అత్యధిక రేటును కోట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు భాషలకు కలిపి భారీ మొత్తంలో యశ్‌ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

సినిమాకు ఏమాత్రం హిట్‌ టాక్‌ వచ్చినా వసూళ్లు వందల కోట్లలో నమోదు కావడం ఖాయం. దాంతో యశ్‌ కి మరింత భారీగా లాభాలు వస్తాయి. సినిమాకు హిట్‌ టాక్‌ వస్తే యశ్‌ కచ్చితంగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. అంటే రాముడిగా నటించిన రణబీర్‌ కపూర్ కంటే కూడా ఎక్కువగా రావణుడి పాత్రలో నటించిన యశ్‌ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు ఎలా ఉంటాయి అనేది విడుదల సమయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లాభాలు సినిమా విడుదల తర్వాత తేలనున్నాయి.