పాన్ ఇండియా క్రేజ్ ను వాడుకోలేకపోతున్న యశ్... కారణమేంటంటే...
ప్రస్తుతం పాన్ ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లు ఎవరి ప్రాజెక్ట్ లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. మరి యశ్ తో ఇప్పటికిప్పుడు సినిమాలను తీసే దర్శకులు ఎవరున్నారు.
By: Gopi Velupala | 5 Oct 2026 3:29 PM ISTకొంతమంది హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ లేక ఇబ్బందులు పడుతుంటే మరి మరి కొంతమంది మాత్రం ఇండియా వైడ్ గా పాపులారిటీని సంపాదించుకున్న కూడా దాన్ని నిలబెట్టుకోవడంలో చాలా వరకు తడబడుతున్నారు... నిజానికి వాళ్ల సినిమాల సెలక్షన్ అంత ఎఫెక్టివ్ గా ఉండడం లేదు. దానివల్ల అంతకు ముందు వాళ్ళు చేసిన సినిమాలతో ఇప్పుడు చేస్తున్న మూవీస్ ను పోల్చి చూస్తున్న ప్రేక్షకులు ఆ హీరో సినిమా లైనప్ మీద పెద్దగా సాటిస్ఫై అవ్వడం లేదు. ఇక ఈ విషయంలో కన్నడ స్టార్ హీరో 'యశ్' గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 'కేజిఎఫ్' మూవీతో పాన్ ఇండియా హీరోగా అవతరించిన ఆయన 'కేజిఎఫ్ 2' సినిమాతో దాదాపు 1200 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. దాంతో స్టార్ హీరోగా మారిపోయాడని అందరు అనుకున్నారు. కానీ ఆయన రీసెంట్ గా చేసిన 'టాక్సిక్' సినిమా భారీ డిజాస్టర్ ను మిగిల్చడంతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో ఆయన చిన్న పాటి డైలమాలో ఉన్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమాలో రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. 'రన్బీర్ కపూర్' రాముడిగా నటిస్తున్న ఈ సినిమాతో యశ్ తన నట విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. నటుడిగా తన సత్తా ఏంటో చూపించడానికి ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ప్లానింగ్ లేకపోవడం...
ప్రస్తుతం పాన్ ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లు ఎవరి ప్రాజెక్ట్ లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. మరి యశ్ తో ఇప్పటికిప్పుడు సినిమాలను తీసే దర్శకులు ఎవరున్నారు. ఒకరకంగా చెప్పాలంటే యశ్ కెజిఎఫ్ తరువాత పర్ఫెక్ట్ గా కొంతమంది దర్శకులను లైనప్ లో పెట్టుకుంటే బాగుండేది. తను ముందు ఎలాంటి ప్లానింగ్ లేకుండా కేజీఎఫ్ లాంటి భారీ హిట్ తర్వాత పెద్దగా క్రేజ్ లేని ఒక లేడీ డైరెక్టర్ కి సినిమా ఇచ్చి ఆయన పెద్ద తప్పు చేశాడు. టాక్సిక్ మూవీ వల్ల ఆయనకి ఉన్న మార్కెట్ భారీగా డ్యామేజ్ అయింది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్స్ ఎవరు సినిమా చేయకపోవడంతో తనే కొంతమంది దర్శకులను ఎంచుకొని వాళ్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు రాబోయే సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన పాన్ ఇండియా మార్కెట్ ను పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
కాబట్టి ఇప్పటికైనా ఆయన ఆచితూచి ముందుకు అడుగులు వేస్తే మంచిదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం అతనికి సలహాలను ఇస్తున్నారు... ఏది ఏమైనా కూడా స్టార్ డైరెక్టర్లు ఇతర స్టార్ హీరోలతో బిజీగా ఉన్నారు. అందువల్లే యశ్ తో సినిమా చేయడానికి ఎవ్వరికి వీలు కావడం లేదు. మరి కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులతో ఆయన మంతనాలు జరుపుతున్నాడు. దాంతో పాటుగా తెలుగు సినిమా దర్శకులతో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికి అవేవి వర్కౌట్ కావడం లేదు. రీసెంట్ గా 'టాక్సిక్ ' సినిమాతో అతనికి భారీ దెబ్బ పడటంతో తనతో ఎంత బడ్జెట్ లో సినిమా చేస్తే సేఫ్ అనే ధోరణిలో కూడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆలోచిస్తున్నారు. దాంతో తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది దర్శకులను తనతో సినిమా చేయాలని యశ్ వాళ్ళతో కథ చర్చలు జరుపుతున్నాడట... ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది...
