యశ్ నెక్స్ట్.. కథ చెప్పింది ఎంత మంది?
యశ్ కు తగ్గ కొత్త కథ రాయడానికి మరింత సమయం పడుతుందని భావించిన నర్తన్, శివరాజ్ కుమార్ తో భైరతి రణగల్ సినిమా చేసేశాడు.
By: M Prashanth | 10 Oct 2026 3:40 PM ISTకేజీఎఫ్ 2 సృష్టించిన సెన్సేషన్ తర్వాత యశ్ నెక్స్ట్ లైనప్ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సౌత్ లోని స్టార్ డైరెక్టర్లందరి పేర్లు ఆయన తర్వాతి సినిమా కోసం గట్టిగా వినిపించాయి. కానీ ఆ ప్రచారానికి భిన్నంగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు ఓకే చెప్పి టాక్సిక్ మూవీని లైన్లో పెట్టాడు. కానీ ఆ కాంబినేషన్ క్లిక్ కాలేదు.
అయితే ఇంతకాలం యశ్ పేరుతో లింక్ అయిన స్టార్ దర్శకుల లిస్టు పెద్దగానే ఉంది. అసలు ప్రాజెక్టులు ఎందుకు పట్టాలెక్కలేదనేది ఫ్యాన్స్ లో మెదులుతున్న సందేహం. కేజీఎఫ్ 2 థియేటర్లలో ఉన్న టైమ్ లోనే పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో యశ్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తాడనే టాక్ నడిచింది. కానీ అది చర్చలకే పరిమితం కాగా, పూరి లైగర్ వర్క్ లోకి వెళ్లిపోయారు.
ఆ తర్వాత 2022లో స్టార్ డైరెక్టర్ శంకర్ తో భారీ బడ్జెట్ సినిమా ఉంటుందనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఆ కాంబినేషన్ కూడా పుకార్లకే పరిమితమైపోయింది. కన్నడ దర్శకుడు నర్తన్ తో మాత్రం ప్రాజెక్ట్ దాదాపు సెట్ అయినంత పనైంది. మఫ్తీ సినిమా తర్వాత యశ్ కోసమే ప్రత్యేకంగా కథ రాసినట్లు నర్తన్ అప్పట్లో స్వయంగా వెల్లడించారు. ఆ స్క్రిప్ట్ కోసం ఏళ్ల తరబడి వర్క్ చేసినా, ఫైనల్ గా ఆ కథ అప్పటికే వచ్చిన కొన్ని సినిమాల ఛాయలతో ఉండటంతో పక్కన పెట్టేశారు.
యశ్ కు తగ్గ కొత్త కథ రాయడానికి మరింత సమయం పడుతుందని భావించిన నర్తన్, శివరాజ్ కుమార్ తో భైరతి రణగల్ సినిమా చేసేశాడు. ఇక మల్టీస్టారర్ల విషయంలోనూ యశ్ చుట్టూ రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. రజనీకాంత్ చేయబోయే ఒక సినిమాలో యశ్ కీ రోల్ చేస్తాడని గట్టి ప్రచారం జరగ్గా, అందులో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్ అప్పట్లోనే కొట్టిపారేసింది.
ఆ తర్వాత సప్త సాగరాలు దాటి ఫేమ్ హేమంత్ రావుతో సినిమా ఉండబోతోందని టాక్ వచ్చినా, ఈ ప్రాజెక్ట్ పై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. లేటెస్ట్ గా తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ ఈ ప్రాజెక్టుల వ్యవహారంపై ఒక కొత్త అప్డేట్ బయటపెట్టాడు. ఇండియానా జోన్స్ తరహాలో ఒక భారీ అడ్వెంచర్ కథను యశ్ కు వినిపించానని, అది అతనికి బాగా కనెక్ట్ అయిందని చెప్పాడు.
అయితే రామాయణ కమిట్మెంట్స్ వల్లే ఆ సినిమా చర్చలు మళ్ళీ ట్రాక్ లోకి రాలేదు. మరో KGF అసిస్టెంట్ హనుమ రెడ్డి తో కూడా ఓ కథపై మాట్లాడినట్లు ఈమధ్య రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ అందులో కూడా నిజ లేదని తెలుస్తోంది. ఇన్ని పేర్లు వినిపించినా కేజీఎఫ్ 2 తర్వాత సోలో హీరోగా యశ్ ఎంచుకున్న ఏకైక సినిమా టాక్సిక్ మాత్రమే. ప్రస్తుతం యశ్ లైనప్ లో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ ప్రాజెక్ట్ రామాయణ ఉంది.
ఇందులో రావణుడి పాత్ర చేయడంతో పాటు నిర్మాణంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ తో కేజీఎఫ్ 3 గురించి అప్పుడప్పుడు చర్చలు జరుగుతున్నాయని, సరైన సమయం వచ్చినప్పుడు ఆ మూవీ ఉంటుందని యశ్ క్లారిటీ ఇచ్చాడు. రామాయణ ఎలాగూ మరో పార్ట్ కూడా ఉంది. అయితే ఆ తర్వాత యశ్ చేయబోయే కొత్త సోలో ప్రాజెక్ట్ పై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫో బయటకు రాలేదు.
