Begin typing your search above and press return to search.

ఫ్లాప్ హీరోపై మళ్లీ 'వందల కోట్లు' నమ్మకం..!

కేజీఎఫ్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన యశ్‌ ఇటీవల 'టాక్సిక్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   14 Oct 2026 12:00 AM IST
ఫ్లాప్ హీరోపై మళ్లీ వందల కోట్లు నమ్మకం..!
X

కేజీఎఫ్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన యశ్‌ ఇటీవల 'టాక్సిక్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. కన్నడ ప్రేక్షకులు మినహా టాక్సిక్ సినిమాను మరే భాష ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపించలేదు. అంతే కాకుండా యశ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాదాపు రెండేళ్లు వెయిట్‌ చేసి నువ్వు ఎంపిక చేసుకున్న స్క్రిప్ట్‌ ఇదా అంటూ యశ్‌ ను ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేశారు. అంతే కాకుండా దర్శకురాలును కాదని యశ్‌ సినిమాను తీసినట్లుగా అనిపించిందనే విమర్శలు సైతం వచ్చాయి. కేజీఎఫ్‌ సినిమా కేవలం ప్రశాంత్‌ నీల్‌ వల్ల హిట్ అయింది, కనుక యశ్‌ మళ్లీ ఆ రేంజ్‌ సినిమాల కోసం ప్రయత్నాలు చేయక పోవడం మంచిదని కొందరు సలహా ఇచ్చారు. కాస్త కిందికి దిగి యశ్ సినిమాలు చేస్తే బెటర్‌ అని, లేదంటే కెరీర్‌ చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

యశ్‌ టాక్సిక్‌ మూవీ తర్వాత...

టాక్సిక్ సినిమా ఫలితం తర్వాత కూడా యశ్‌ మళ్లీ అదే స్థాయి సినిమాను చేయాలని, మళ్లీ కేజీఎఫ్‌ రేంజ్‌ హిట్‌ కొట్టాలని ఆశ పడుతున్నాడు. అందుకోసం స్క్రిప్ట్‌ను చూస్తున్నాడు, ఆ రేంజ్‌లో సినిమాను తీసే వారిని, ఆ స్థాయిలో బడ్జెట్‌ ఖర్చు చేసే వారిని యశ్‌ చూస్తున్నట్లు కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫైనల్‌గా యశ్‌ తో పీఎస్ మిత్రన్‌ ఒక భారీ సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. ఆ మధ్య ధనుష్‌ తో మిత్రన్‌ అనుకున్న సినిమాను కొన్ని కారణాల వల్ల యశ్‌ తో చేసేందుకు సంజయ్ లీలా భన్సాలీ రెడీ అయ్యాడని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే భారీ ఫారెస్ట్‌ అడ్జెంచర్‌ మూవీ కావడంతో సినిమాకు వందల కోట్ల బడ్జెట్‌ ఖర్చు అవుతుందని అంటున్నారు. యశ్‌ పై ఆ స్థాయిలో ఖర్చు పెట్టడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. యశ్‌ పై బలమైన కంటెంట్‌ ఉంటే తప్ప ఖర్చు పెట్టకూడదని విశ్లేషకులు అంటున్నారు.

సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో...

సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాను నిర్మించేందుకు రెడీగా ఉన్నాడు. అయితే యశ్‌ ను సైతం నిర్మాణ భాగస్వామిగా చేర్చే అంశమై పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పీఎస్ మిత్రన్‌ హాలీవుడ్‌ మూవీ ఇండియానా జోన్స్ రేంజ్‌లో ఒక స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడట. విదేశాల్లో ఎక్కువగా షూట్ ఉంటుందని అంటున్నారు. కనుక ఈ సినిమా కచ్చితంగా భారీ బడ్జెట్‌ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. పీఎస్ మిత్రన్‌ గత చిత్రాల ఫలితాలను చూస్తే ఇప్పుడు ఇలాంటి మూవీ అవసరమా అనే అభిప్రాయం కలుగక మానదు. మిత్రన్‌, యశ్‌ కాంబో అంటే కనీసం బజ్ క్రియేట్‌ అయ్యే పరిస్థితి లేదు. సినిమా మొదలు అయితే ఏమైనా మ్యాజిక్‌ జరిగి బజ్‌ క్రియేట్‌ అవుతుందా అనేది చూడాలి. సాధారణంగా ఒక సినిమా గురించి చిన్న పుకారు వచ్చినా సోషల్‌ మీడియాలో ఆహా... ఓహో అనే రేంజ్‌ లో ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకునే వారే లేరు.

రామాయణ మూవీ లో రావణుడిగా యశ్‌..

యశ్‌ గత చిత్ర ఫలితం అభిమానులతో పాటు అందరినీ తీవ్రంగా నిరాశకు గురి చేసింది. అందుకే ఆయన నుంచి సినిమా అనగానే ప్రేక్షకులు ఉత్సాహంతో ఆసక్తి చూపించే పరిస్థితి లేదు. పైగా మిత్రన్‌ దర్శకత్వంలో అనగానే చాలా మంది పెదవి విరుస్తున్నారు. యశ్‌ పై వందల కోట్ల బడ్జెట్‌ అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే అంటూ సినీ విశ్లేషకులు, మార్కెట్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యశ్‌ నటిస్తున్న రామాయణ సినిమా తర్వాత అయినా ఆయన సినిమాలకు బజ్‌ క్రియేట్‌ అయ్యేనా చూడాలి. రామాయణ సినిమాలో రావణుడి పాత్రలో యశ్‌ నటిస్తున్నాడు. ఈ దీపావళికి సినిమా రాబోతుంది. రామాయణలో అత్యంత పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్న కారణంగా యశ్‌ కి మంచి పేరు వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే సంజయ్ లీలా భన్సాలీ ఈ భారీ అడ్వెంచర్‌ మూవీని ప్లాన్‌ చేస్తున్నాడు. రామాయణ సినిమా అటు ఇటు అయ్యి, రావణుడి పాత్రకు నెగిటివ్ మార్కులు పడితే కచ్చితంగా ఈ మూవీ పట్టాలెక్కడం అనుమానమే అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.