Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్ గోల్డెన్ టైమ్ వేస్ట్ చేస్తున్నాడా!

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి `కేజీఎఫ్`తో యావత్ భారత దేశాన్ని ఊపేసిన నటుడు యష్.

By:  Srikanth Kontham   |   30 April 2026 1:30 PM IST
పాన్ ఇండియా స్టార్ గోల్డెన్ టైమ్ వేస్ట్ చేస్తున్నాడా!
X

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి `కేజీఎఫ్`తో యావత్ భారత దేశాన్ని ఊపేసిన నటుడు యష్. రాకీ భాయ్‌గా య‌శ్‌ సృష్టించిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. ఒక్క సినిమాతోనే అసాధారణమైన ఇమేజ్‌ను, గ్లోబల్ మార్కెట్‌ను సొంతం చేసుకున్నాడు. అటుపై కెరీర్ ప్లానింగ్‌లో వేగం తగ్గించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం గానూ మారింది. `కేజీఎఫ్ 2` విడుదలై మూడేళ్లు దాటుతున్నా ఆయన తదుపరి చిత్రం `టాక్సిక్` ఇంకా ప్రేక్షకులకు చేరువ కాలేదు. ఈ విరామం ఆయన కెరీర్‌లోని అత్యంత కీలకమైన గోల్డెన్ పీరియడ్ ను వృధా చేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సినిమా పరిశ్రమలో భారీ విజయం వచ్చినప్పుడు ఆ ఊపు ఉన్నప్పుడే వరుసగా ప్రాజెక్టులు పట్టాలెక్కించడం, మార్కెట్‌ను స్థిరీకరించుకోవడం ముఖ్యం. ప్రభాస్ వంటి ఇతర పాన్ ఇండియా స్టార్లు వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే? యష్ మాత్రం కథా చర్చలకే ఎక్కువ సమయం కేటాయించారు. ఈ మూడేళ్ల సమయం యష్ ఇమేజ్‌ను ఎన్‌క్యాష్ చేసుకోవడానికి సరైన సమయం. కానీ ఆయన అతి జాగ్రత్తతో ఆ గోల్డెన్ టైమ్ చేజారిపోతోందన్న‌ది విశ్లేషకుల భావ‌న‌. ప్రస్తుతం యష్ చేతిలో ఏకైక భారీ ప్రాజెక్ట్ `టాక్సిక్`. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో జరుగుతోన్న జాప్యం నెమ్మదిగా అభిమానుల్లో అసహనాన్ని కలిగిస్తోందన్న‌ది అంతే వాస్త‌వం. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చే సినిమా కావడంతో టాక్సిక్` బాక్సాఫీస్ వద్ద ఓ రకమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. యావరేజ్ హిట్‌తో సరిపెట్టుకుంటే యష్‌కు ఆశించిన మైలేజ్ రాద‌న్న‌ది అంతే వాస్త‌వం.ట్రేడ్ వర్గాల ప్రకారం `టాక్సిక్` విడుదల అన‌ర‌త‌రం బాక్సాఫీస్ వ‌ద్ద 2000 కోట్ల రూపాయల వసూళ్లు రాబడితేనే యష్ తీసుకున్న సుదీర్ఘ విరామానికి అర్థం ఉంటుంది. సినిమా ఫలితం అటు ఇటు అయితే మాత్రం యష్ కెరీర్‌లో అత్యంత విలువైన కాలాన్ని వృధా చేసుకున్నాడ‌నే విమర్శలు తప్పవు.

అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఉన్న తరుణంలో ప్రేక్షకుల జ్ఞాపకశక్తి నుంచి ఇమేజ్ సన్నగిల్లే లోపే ఉనికిని చాటుకోవాల్సిన బాధ్యత య‌శ్‌పై ఉంది. మ‌రోవైపు బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `రామాయణ`లో కూడా య‌శ్‌ భాగస్వామిగా ఉంటూ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు నటన, మరోవైపు నిర్మాణం. ఇలా రెండు పడవల ప్రయాణం చేయడం `టాక్సిక్` డిలేకి కార‌ణం అన్న‌వాదన లేక‌పోలేదు. సొంత సినిమా ఆలస్యమవ్వడం వల్ల కన్నడ ఆడియెన్స్ తో పాటు సౌత్ ఇండియాలో య‌శ్‌ క్రేజ్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. `కేజీఎఫ్` తెచ్చిన క్రేజ్‌ను కొనసాగించాలంటే ?‘ టాక్సిక్ ఓ అద్భుతం చేయాల్సిందే.