Begin typing your search above and press return to search.

టాక్సిక్ ఒత్తిడికి బ్రేక్.. భార్యాపిల్లలతో రీఛార్జ్!

ఇటీవ‌లే భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన టాక్సిక్ వైఫ‌ల్యంతో రాకింగ్ స్టార్ డీలా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   23 Sept 2026 7:49 PM IST
టాక్సిక్ ఒత్తిడికి బ్రేక్.. భార్యాపిల్లలతో  రీఛార్జ్!
X

ఇటీవ‌లే భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన టాక్సిక్ వైఫ‌ల్యంతో రాకింగ్ స్టార్ డీలా ప‌డిన సంగ‌తి తెలిసిందే. మంచి ఓపెనింగ్స్ సాధించినా లాంగ్ ర‌న్ లో సినిమా నిల‌బ‌డ‌లేక‌పోయింది. దీంతో టాక్సిక్ అంచ‌నాలు ఘోరంగా త‌ప్పాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా య‌శ్ కుటుంబంతో వెకేషన్‌లో గడుపుతున్న అందమైన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. `టాక్సిక్` ఒత్తిడి , నిరాశ నుంచి ఉపశమనం పొందేందుకే యష్ ఈ విహార యాత్రను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. య‌శ్క భార్య రాధిక పండిట్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఈ విహారయాత్ర ఫోటోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

సుందరమైన ప్రకృతి ఒడిలో యష్ తన పిల్లలు అయ్రా, యథర్వ్‌లతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్న దృశ్యాలు ఫోటోల్లో కనిపిస్తున్నాయి. వరుస సినిమాలు, నిరంతరం షూటింగ్‌ల హడావుడితో బిజీగా ఉండే యష్ ఇలాంటి క్వాలిటీ టైమ్‌ను కుటుంబంతో పంచుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కెరీర్‌లో విజయాలు - ఓటములు సహజమని నమ్మే యష్ టాక్సిక్ ఫలితాన్ని పరిణతితో స్వీకరించారు.

ఒక సినిమా పరాజయం పాలైనంత మాత్రాన నిరాశ చెందకుండా తదుపరి ప్రాజెక్టుల కోసం కొత్త శక్తిని కూడగట్టుకోవడంలో భాగమే ఈ విహారయాత్ర అని తెలుస్తోంది. కుటుంబంతో గడిపే ఈ ప్రశాంతమైన సమయం ఆయనకు రీఛార్జ్ అవ్వడానికి ఎంతగానో తోడ్పడుతుందని, విజయాపజయాల కంటే కుటుంబ సంతోషమే ముఖ్యమని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో మద్దతు తెలుపుతున్నారు.

ఈ వెకేషన్ ముగిసిన వెంటనే యష్ తదుపరి సినిమాలపై దృష్టి సారించనున్నారు. `టాక్సిక్` ఇచ్చిన అనుభ వాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే చిత్రాల స్క్రిప్ట్ ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఎదురైన ఫలితాన్ని మర్చిపోయి కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా గడుపుతున్న యష్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవ్వ‌డం అభిమానుల్లో మళ్లీ నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

అయితే య‌శ్ కొత్త సినిమా విష‌యంలో ఎన్ని సంవ‌త్సరాలు గ్యాప్ తీసుకుంటారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఎందుకంటే `కేజీఎఫ్` హిట్ త‌ర్వాత `టాక్సిక్` కోసం సంవ‌త్స‌రాలు కేటాయించారు. ఆ త‌ర్వాత ఆ ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించి పూర్తి చేయ‌డానికి సంవ‌త్స‌రాలే కేటాయించారు. ఈనేప‌థ్యంలో వైఫ‌ల్యం వెంట ఉన్న నేప‌థ్యంలో హిట్ కథ కోసం ఎన్ని సంవ‌త్స‌రాలు గ్యాప్ తీసుకుంటారు? అన్న‌ది అభిమానుల్లో జ‌రుగుతోన్న హాట్ డిస్క‌ష‌న్.