వర్క్ లైఫ్ బ్యాలెన్స్: ప్రమోషన్ల నడుమ డిస్నీల్యాండ్‌లో యశ్ ఫ్యామిలీ టైమ్!
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రామాయణ` చిత్ర ప్రమోషన్స్ కోసం యూనిట్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో బిజీగా ఉంది.
By: Srikanth Kontham | 1 Nov 2026 5:45 PM ISTనితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రామాయణ` చిత్ర ప్రమోషన్స్ కోసం యూనిట్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో బిజీగా ఉంది. టీమ్ అంతా విదేశాల్లో ఉంటే? రాకింగ్ స్టార్ యశ్ మాత్రం ఎంత బిజీగా ఉన్నా?
పిల్లల కోసం సమయాన్ని కేటాయించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా `రామాయణం` ప్రమోషనల్ షెడ్యూల్ మధ్యలో బ్రేక్ తీసుకున్న యశ్ పిల్లలతో కలిసి డిస్నీల్యాండ్‌లో గడపడం అభిమానుల్ని ఆకట్టుకుంటుంది.
అమెరికాలోని ఓ వార్తా ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా చిత్ర బృందం లాస్ ఏంజెల్స్ ట్రిప్ విశేషాలను పంచుకుంది. ఈ ప్రమోషన్లలో భాగంగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి తదితరులు తాము సందర్శిం చాలను కుంటున్న ప్రదేశాల గురించి మాట్లాడగా యశ్ మాత్రం తన పిల్లలతో కలిసి డిస్నీల్యాండ్‌కు వెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని ముందే చెప్పారని తెలిపారు. `నేను నా పిల్లలతో కలిసి డిస్నీల్యాండ్‌కు వెళ్తున్నాను. లాస్ ఏంజెల్స్‌కు రావడం ఇదే మొదటిసారి. అయితే నేను ఇప్పటికే ఆర్లాండో డిస్నీల్యాండ్‌ను సందర్శించాను` అంటూ యశ్ ఆనందాన్ని పంచుకున్నారు.
స్టార్ హీరోగా ఎంత బిజీ లైఫ్ ఉన్నా? పిల్లలతో గడిపే క్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోని యశ్ స్వభావం మరోసారి రుజువైంది. అమెరికా మార్నింగ్ న్యూస్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అనంతరం అక్కడి వాతావరణం ఎలా ఉంటుందనే దానిపై యశ్ ముందే ఆరా తీయడం విశేషం. పిల్లలను బయటకు తీసుకెళ్లే విషయంలో ఆయన ఎంత కేరింగ్‌గా ఉంటారో ఈ సందర్భం తెలియజేస్తోంది. రణ్‌బీర్ కపూర్ కూడా ఈ విషయమై స్పందిస్తూ ప్రమోషన్ల హడావుడిలోనూ యశ్ వాతావరణంపై ఎంత శ్రద్ధ పెట్టారో సరదాగా గుర్తు చేసుకున్నారు.
`రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్` చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండగా, నవంబర్ 4నే స్పెషల్ ప్రీవ్యూలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, యశ్ శక్తివంతమైన రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్న మైలాజికల్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమాకి సంబంధించిన బాధ్యతలు, గ్లోబల్ స్థాయి ప్రమోషన్లు ఉన్నా? పర్సనల్ లైఫ్‌ను .. పిల్లల ఆనందాన్ని సమన్వయం చేసుకునే యశ్ తీరు ప్రశంసనీయం. ప్రమోషన్ల ఉత్కంఠను పక్కన పెట్టి డిస్నీల్యాండ్‌లో పిల్లలతో కలిసి గడిపిన మధుర క్షణాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ రకంగా రామాయణ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దక్కుతుంది.
