Begin typing your search above and press return to search.

ఆ విషయంలో యష్ జాగ్రత్త పడాల్సిందే..!

కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్, వరుసగా డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారనే చర్చ మొదలైంది. ‘టాక్సిక్’ తర్వాత ‘రామాయణం’లో రావణుడిగా నటించి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఒకే తరహా పాత్రలు కొనసాగిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ సహా ఇతర వర్గాల ప్రేక్షకులకు దూరమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   10 Nov 2026 3:08 PM IST
ఆ విషయంలో యష్ జాగ్రత్త పడాల్సిందే..!
X

సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం తప్పేమీ కాదు. నిజానికి ఒక హీరో ఇలాంటి పాత్రలు చెయ్యడం వల్ల.. వాళ్ల గొప్ప నటన కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. అయితే వరుసగా డార్క్ క్యారెక్టర్లు, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఆ నటుడికి ఒక టైప్ ఆఫ్ అభిమానులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు కన్నడ స్టార్ యష్ విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్లు అనిపిస్తోంది.

ఇక ప్రస్తుతం రామాయణ సినిమాలో రావణుడిగా కనిపించి అందరూ ప్రశంసలు అందుకుంటున్న ఈ హీరో.. తన ఇమేజ్ పైన కొన్ని అనుమానాలు కూడా తెచ్చి పెట్టుకుంటున్నాడు.

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో యష్ దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు సంపాదించుకున్నారు. రాఖీ భాయ్ పాత్రలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. యష్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టడంలో ఈ రెండు సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

అయితే ఆ తర్వాత కూడా యష్ ఎంచుకుంటున్న పాత్రలు దాదాపు అదే తరహాలో ఉండటం ఆసక్తికరంగా మారింది. టాక్సిక్ సినిమాలోనూ ఆయన డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమా డిజాస్టర్ అవడమే కాకుండా.. ఈ సినిమాలు హీరో క్యారెక్టర్ పైన ఎన్నో విమర్శలు తెచ్చి పెట్టింది.

ఇక ఇప్పుడు వచ్చిన రామాయణం పార్ట్ 1లో.. రావణుడిగా యష్ నటన ప్రశంసలు అందుకుంటోంది. ఈ హీరోలో ఇంత అద్భుతమైన నటుడు ఉన్నారా అనేలా చేస్తోంది.

నిజానికి యష్ చాలా మంచి నటుడు. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేయగల సత్తా ఆయనకు ఉంది. నెగిటివ్ పాత్రలు చేయడం కూడా గొప్ప విషయమే. కానీ ఒక స్టార్ హీరో ఎప్పుడూ అలాంటి పాత్రలకే పరిమితమైతే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడుతుంది.

ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా ఎదిగిన తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా ముఖ్యం. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, మహిళా ప్రేక్షకులు ఇలా ప్రతి ఒక్కరినీ కనెక్ట్ చేసే సినిమాలు కూడా చేయాలి.

ప్రస్తుతం యష్‌కు ఉన్న క్రేజ్, నటనపై ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ హీరో ఓకే ఇమేజ్ తో సినిమాలు చేస్తే మాత్రం అది కొంచెం డామేజ్ చేసే అవకాశం కూడా ఉంది. మరి వచ్చే కాలంలో ఈ ఇమేజ్ మార్చుకోవడానికి యష్ డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తారేమో చూడాలి.