ఆ పాన్ ఇండియా స్టార్ అక్కడికే పరిమితమా?
కన్నడ స్టార్ యశ్ `కేజీఎఫ్` తో పాన్ ఇండియాలో ఎంత పెద్ద స్టార్ అయ్యాడన్నది చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ప్రాంచైజీ యశ్ కి కొత్త ఇమేజ్ ని తెచ్చి పెట్టింది.
By: Srikanth Kontham | 3 Nov 2025 8:00 AM ISTకన్నడ స్టార్ యశ్ `కేజీఎఫ్` తో పాన్ ఇండియాలో ఎంత పెద్ద స్టార్ అయ్యాడన్నది చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ప్రాంచైజీ యశ్ కి కొత్త ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. అప్పటి వరకూ కన్నడకే పరిమితమైన యశ్ క్రేజ్ అన్ని భాషలకు వ్యాపించింది. అదే క్రేజ్ తో ఇతర భాషల్లో కూడా అవకాశాలొచ్చాయి. ప్రత్యేకించి తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమల్లో ఛాన్సులొచ్చాయి. కానీ యశ్ మాత్రం మాతృ భాషకే పరిమితయ్యాడు. సొంత పరిశ్రమను దాటి బయటకు రాలేదు. తాను ఏం చేయాలనుకున్నా? శాండిల్ వుడ్ నుంచే అంటూ ముందుకు సాగాడు.
యశ్ ప్రయాణంలో అలాగే:
అయితే `రామాయణం`తో మాత్రం బాలీవుడ్ లో లాంచ్ అవుతున్నాడు. అయితే అది హీరో రోల్ కాదన్నది తెలిసిందే. `రావణసురుడు` పాత్రలో నటిస్తున్నాడు. యశ్ బయటకొచ్చి చేస్తోన్నతొలి చిత్రమిదే. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అవి హీరో పాత్రలు కావొచ్చు...నెగిటివ్ రోల్స్ కావొచ్చు. మరి ఆ తర్వాత యశ్ పాత పద్దతిలోనే సినిమాలు చేస్తాడా? అంటే తన ప్రయాణం అలాగే ఉంటుందని సన్నిహిత వరగ్ఆలు తెలిపాయి. కేవలం కీలక పాత్రలు మాత్రమే ఇతర భాషల నుంచి వస్తే చేస్తానని...హీరోగా మాత్రం కొంత కాలం పాటు అక్కడే చేస్తాడని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
రాజమౌళిని ఫాలో అవుతోన్న యశ్:
హీరోగా తనకు అవకాశం కల్పించిన సొంత పరిశ్రమను వదిలి బయటకు వచ్చి సినిమాలు చేయడం అన్నది అప్పు డే జరగదని ఓ ఆరేళ్ల పాటు కన్నడలో పనిచేసి అటుపై ఇతర భాషలవైపు చూసే అవకాశం ఉంటుందన్నారు. ఈలోగా పాన్ ఇండియా స్టార్ గా పూర్తి స్థాయిలో సొంత పరిశ్రమ నుంచి నిలదొక్కుకొవచ్చు అన్నది యశ్ ప్లాన్ గా తెలుస్తోంది. ఈ విషయంలో యశ్ దర్శకధీరుడు రాజమౌళిని అనుసరిస్తున్నట్లే కనిపిస్తోంది. `బాహుబలి` పాన్ ఇండియాలో సంచలన విజయం సాధించిన తర్వాత జక్కన్నకు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి.
గొప్ప అవకాశాలెన్నో:
కరణ్ జోహార్ లాంటి నిర్మాత బాలీవుడ్ కి ఎలాగైనా తీసుకెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు. అమీర్ ఖాన్ కూడా అవకాశం ఇచ్చాడు. వందల కోట్లు గుమ్మరించడానికి బడా నిర్మాణ సంస్థలే క్యూలో నిలిచాయి. కానీ రాజమౌళి మాత్రం తన ప్రతిభ కేవలం సొంత పరిశ్రమకే పరిమితమని పని చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్లు అందరితో పని చేసిన అనంతరం బాలీవుడ్ ఆహ్వానం మేరకు వెళ్లే అవకాశం ఉండొచ్చు.
