యష్, అడివిశేష్ వెనక్కి తగ్గుతున్నారా?
రాకింగ్ స్టార్ యష్, టాలెంటెడ్ స్టార్ అడివి శేష్ ఫైనల్‌గా వెనక్కి తగ్గుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
By: Tupaki Entertainment Desk | 3 Feb 2026 6:22 PM ISTరాకింగ్ స్టార్ యష్, టాలెంటెడ్ స్టార్ అడివి శేష్ ఫైనల్‌గా వెనక్కి తగ్గుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న క్రైమ్ యాక్షన్ డ్రామా `డెకాయిట్: ఏ లవ్‌స్టోరీ`. మృణాల్ ఠాకూర్, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షానియల్ డియో డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టీజర్‌తోనే అంచనాల్ని పెంచేసింది. మార్చి 19న ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
అయితే అది ఇప్పుడు కుదిరేలా కనిపించడం లేదు. కారణం `ధురంధర్ 2:ది రివేంజ్`. రణ్‌వీర్‌సింగ్ హీరోగా నటించిన ఈ మూవీని ఆదిత్యధర్ అత్యంత భారీ స్థాయిలో సాహసోపేతంగా తెరకెక్కించాడు. ఫస్ట్ పార్ట్ విమర్శల నడుమ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.1340 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. దీంతో పార్ట్ 2పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీని మార్చి 19న ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ మంగళవారం టీజర్‌ని విడుదల చేసింది. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన అంచనాలకు మించి పార్ట్ 2 భీభత్సం సృష్టిస్తుందని క్లారిటీ రావడంతో చాలా మంది సెలబ్రిటీలు, సినీ లవర్స్, క్రిటిక్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మోన్‌స్టర్‌కు పోటీగా బరిలోకి దిగడం మంచిదికాదని భావంచిన అడివి శేష్ తన `డెకాయిట్: ఏ లవ్‌స్టోరీ` మూవీ రిలీజ్‌ని మార్చి 19 నుంచి పోస్ట్ పోన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే తరహాలో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న `టాక్సిక్` మూవీ రిలీజ్ కూడా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. యష్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా `టాక్సిక్`. గీతూ మోహన్ దాస్ ఈ మూవీని రూపొందిస్తోంది. నయనతార, కియారా అడ్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్, టొవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరో యష్ పుట్టన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన `టాక్సిక్` టీజర్ వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీని మార్చి 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. టీజర్‌లో డేట్ కూడా మెన్షన్ చేశారు.
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ డేట్ మారినట్టుగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన `ధురంధర్`కు సీక్వెల్‌గా వస్తున్న `ధురంధర్ 2:ది రివేంజ్` మార్చి 19నే భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో దానికి పోటీగా వెళ్లడం రిస్క్ అని భావించిన యష్ తన `టాక్సిక్` రిలీజ్‌ని వాయిదా వేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అడివిశేష్ `డెకాయిట్: ఏ లవ్‌స్టోరీ`, యష్ టాక్సిక్` రిలీజ్ డేట్‌లు వాయిదా పడిన విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారకంగా ప్రకటించే అవకాశాం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
