Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడి వైఫ్ ఇప్ప‌టికీ టాలీవుడ్ పై అంతే ఆస‌క్తిగా!

అందం, అభినయం పుష్కలంగా ఉన్న హిందీ నటి యామీ గౌతమ్ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో `గౌరవం`, `యుద్ధం`, `కొరియర్ బాయ్ కల్యాణ్` వంటి నాలుగైదు తెలుగు సినిమాల్లో ఆమె నటిందించారు.

By:  Srikanth Kontham   |   16 Oct 2026 1:00 AM IST
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడి వైఫ్ ఇప్ప‌టికీ టాలీవుడ్ పై అంతే ఆస‌క్తిగా!
X

అందం, అభినయం పుష్కలంగా ఉన్న హిందీ నటి యామీ గౌతమ్ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో `గౌరవం`, `యుద్ధం`, `కొరియర్ బాయ్ కల్యాణ్` వంటి నాలుగైదు తెలుగు సినిమాల్లో ఆమె నటిందించారు. అయితే ఆ సమయంలో నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో టాలీవుడ్‌లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. ఆ తర్వాత ఫోకస్ మొత్తాన్ని బాలీవుడ్ పైనే పెట్టి వరుస ప్రాజెక్టులతో అక్కడ క్రేజీ హీరోయిన్‌గా స్థిరపడ్డారు.

హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టిన తర్వాత యామీ గౌతమ్‌కు మంచి బ్రేక్ లభించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న `విక్కీ డోనర్` నుంచి ప్రారంభించి `ఉరి: ది సర్జికల్ స్ట్రైక్`, `ఆర్టికల్ 370` వంటి పవర్‌ఫుల్ మరియు కంటెంట్ డ్రివెన్ చిత్రాలలో నటించి బాలీవుడ్‌లో న‌టిగ‌తా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ నటనతో బాలీవుడ్ ఆడియన్స్‌ను కట్టిపడేశారు.

ఈ క్రమంలోనే `ఉరి` చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్‌ను ప్రేమ వివాహం చేసుకోవడంతో యామీ గౌతమ్ కెరీర్ పర్సనల్ లైఫ్ కొత్త మలుపు తిరిగింది. ఆదిత్య ధర్ సినిమాలతో పాన్-ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా ప్రత్యేక సంచలనం సృష్టించడంతో యామీకి ఉన్న ఇమేజ్ ..మార్కెట్ క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. నటిగా ఆమెకున్న సబ్జెక్ట్ సెలక్షన్, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌కు తోడు భర్త బ్యాకింగ్ కూడా తోడవడంతో యామీ పేరు నేడు నేషనల్ వైడ్‌గా బలంగా వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే యామీ గౌతమ్ మ‌ళ్లీ టాలీవుడ్ పై మళ్లీ ఆసక్తి గా ఉన్నారు? అనే ప్ర‌చారం బాలీవుడ్ మీడియాలో మొద‌లైంది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమ పాన్-ఇండియా స్థాయిలో గ్లోబల్ మార్కెట్‌ను ఏలుతోంది. పెద్ద బడ్జెట్ సినిమాలు, వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో టాలీవుడ్ మేకర్స్ అంతర్జాతీయ స్థాయిలో మెప్పిస్తుండటంతో ఇక్కడ సరైన ప్రాజెక్ట్‌తో రీ-ఎంట్రీ ఇవ్వాలని యామీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో చేసిన సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఇప్పుడు తనకున్న ఇమేజ్, అనుభవంతో తెలుగులో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి యామీ సిద్ధంగా ఉన్నారనే మాట బ‌లంగా తెర‌పైకి వ‌స్తోంది. పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ కథలు లేదా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన బలమైన పాత్రలు వస్తే నటించడానికి ఆసక్తి చూపు తున్నారట. ద‌క్షిణాది ప్రేక్ష‌కులు ఎల్లుప్పుడు బ‌ల‌మైన‌ కంటెంట్‌.. నటనను ఆదరిస్తారనే నమ్మకం యామీలో అంతే బలంగా ఉంది.

అంతిమంగా ఉత్త‌రాదిన వరుస విజయాలతో దూసుకుపోతున్న అమ్మ‌డు సరికొత్త ప్లానింగ్‌తో టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. మరి తెలుగు మేకర్స్ నుంచి యామీకి ఎలాంటి క్రేజీ ఆఫర్లు వస్తాయో? ఏ టాలెంట్ డైరెక్టర్ మళ్లీ తెలుగు తెరకు పరిచయం చేస్తారో? వేచి చూడాలి.