Begin typing your search above and press return to search.

ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ మూవీకి నోటీసులు.. అసలేం జరిగిందంటే?

ఈ చిత్రం తర్వాత తెలుగులో యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలు చేసిన ఈమె.. క్రమంగా తెలుగు ఇండస్ట్రీకి దూరమై.. హిందీ, పంజాబీ, తమిళ్ చిత్రాలలో నటిస్తూ కెరియర్ ను కొనసాగిస్తోంది.

By:  Madhu Reddy   |   12 Oct 2025 12:00 AM IST
ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ మూవీకి నోటీసులు.. అసలేం జరిగిందంటే?
X

యామీ గౌతమ్.. ఒకప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిన్నది.. తొలిసారి 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఏకూర్ అనే పంజాబీ చిత్రంలో నటించిన ఈమె 'నువ్విలా' అనే తెలుగు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అల్లు శిరీష్ హీరోగా వచ్చిన.. 'గౌరవం' సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలు చేసిన ఈమె.. క్రమంగా తెలుగు ఇండస్ట్రీకి దూరమై.. హిందీ, పంజాబీ, తమిళ్ చిత్రాలలో నటిస్తూ కెరియర్ ను కొనసాగిస్తోంది.

అలాంటి ఈమె తాజా చిత్రానికి నోటీసులు రావడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. యామి గౌతమ్, ఇమ్రాన్ హష్మీ తాజాగా నటిస్తున్న చిత్రం హక్. ఈ చిత్రం ఇప్పుడు చిక్కుల్లో పడింది. దివంగత షా బానో కుమార్తె సిద్దికా బేగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, దర్శకుడు సుపర్న్ ఎస్ వర్మ, జంగ్లీ పిక్చర్స్, భవేజా స్టూడియోలకు లీగల్ నోటీసులు పంపారు. ముఖ్యంగా తమ నుండి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఈ సినిమాను నిర్మించారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని.. సినిమా ప్రమోషన్స్ తో పాటు సినిమా విడుదలను కూడా ఆపివేయాలి అంటూ ఆమె తన నోటీసులలో తెలిపారు.

విషయంలోకి వెళ్తే.. భారతదేశంలో భరణం దావాపై 1985లో కనీవినీ ఎరుగని రీతిలో షా బానో కి తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్ట్. అలాంటి ఈమె వ్యక్తిగత జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకొని హక్ సినిమా రూపొందించారని, ఇది తమ వ్యక్తిగత విషయాలను వక్రీకరించారని సిద్ధికి ఆరోపించారు. నిజానికి షా బానో కేసులో సుప్రీంకోర్టు ముస్లిం మహిళలు విడాకుల తర్వాత భరణం పొందే హక్కును పొందుతారు అంటూ తీర్పుని ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు తప్పు దోవలో చూపిస్తున్నారు అంటూ సిద్దికీ బేగం నోటీసులు పంపించింది.

ముఖ్యంగా ఆర్టికల్ 21 కింద ఈ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. గోప్యత , గౌరవ హక్కుల ఉల్లంఘన.. వ్యక్తిత్వం, ప్రచార హక్కుల ఉల్లంఘన , సెక్షన్ 356 BNS కింద పరువు నష్టం, కాపీ రైట్ ఉల్లంఘన తో పాటు కాపీ రైట్ చట్టం 1957 లోని సెక్షన్ 57, 63 కింద నైతిక హక్కులు, 1952 సినిమా ఆటోగ్రాఫ్ చట్టం సి బి ఎఫ్ సి మార్గదర్శకాల ఉల్లంఘన చట్టాల కింద కేసు నమోదు నమోదు చేశారు. అంతేకాదు తన లీగల్ నోటీసులో CBFC సినిమా సర్టిఫికెట్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.." మేము హక్కు నిర్మాతలను సంప్రదించాము. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు" అంటూ ఆమె తెలిపారు.

ఇకపోతే ఈ సినిమాలో యామి గౌతమ్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండగా.. ఇమ్రాన్ హష్మీ ఆమె భర్త అహ్మద్ ఖాన్ పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం లక్నోలోని కాకోరి, సందిలాతో పాటు ఇతర ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.