భర్త సినిమాలో భార్య విలన్ గానా?
బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ప్రోఫెషనల్ యాక్టెర్స్. కెరీర్ ఆరంభం నుంచే అమ్మడు సెలక్టివ్ గా సినిమాలు చేస్తు న్నారు.
By: Srikanth Kontham | 6 Feb 2026 6:00 PM ISTబాలీవుడ్ నటి యామీ గౌతమ్ ప్రోఫెషనల్ యాక్టెర్స్. కెరీర్ ఆరంభం నుంచే అమ్మడు సెలక్టివ్ గా సినిమాలు చేస్తు న్నారు. గ్లామర్ పాత్రలకు..బోల్డ్ కంటెంట్ కు తొలి నుంచి దూరంగానే ఉన్నారు. కానీ కెరీర్ గ్యాప్ మాత్రం రానివ్వలేదు. ఎంత సెలక్టివ్ గా ఉన్నా? 15 ఏళ్ల ప్రయాణంలో చాలా సినిమాలే చేసారు. `విక్కీ డోనర్`, `బద్లా పూర్`, `కాబిల్`, `ఉరి`, `బూత్ పోలీస్`, `దస్వీ`, `లాస్ట్` లాంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసారు. భర్తగా దర్శకుడు ఆదిత్యధర్ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆమె ప్రయాణం మరింత సెలక్టివ్ గా ఉంటుంది.
హబ్బీ గొప్ప క్రియేటర్ కావడంతో పాత్రల ఎంపికలో సూచనలు సలహాలు తీసుకుంటూ కొత్త రకమైన ప్రణాన్ని సాగిస్తోంది. ఈ క్రమంలో సినిమాల జోరు తగ్గిన మాట వాస్తవం. దేశ భక్తి నేపథ్యం గల చిత్రాల్లో భాగమవుతూ తనైదన ముద్ర వేస్తోంది. తాజాగా `ధురంధర్ 2` లో కూడా ఎంపికైన సంగతి తెలిసిందే. మొదటి భాగంలో యామీ పాత్ర ఎక్కడా కనిపించనప్పటికీ రెండ వ భాగంలో అమ్మడు నటించడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో యామీ గౌతమ్ పాత్ర ఎలా ఉంటుంది? హబ్బీ ఆమె కోసం ఎలాంటి రోల్ రాసాడు? అన్న దానిపై చర్చ జరుగుతోంది.
తాజాగా యామీ పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. `ధురంధర్ 2`లో యామీ గౌతమ్ నెగిటివ్ రోల్ పోషిస్తుందని సమాచారం. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో యామీ కనిపించబోతుందిట. తొలుత అతిధి పాత్ర అని ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవం లేదని బాలీవుడ్ మీడియా కథనాలతో అర్దమవుతోంది. ఇప్పటికే యామీ గౌతమ్ వారం రోజులుగా షూటింగ్ లో పాల్గొంటుందని సమాచారం. దీంతో ఈ పాత్రపై చర్చ మొదలైంది. ఈ సినిమాలో చాలా పాత్రలను వాస్తవ పాత్రలను ఆధారంగానే తీసుకున్నారు.
హీరో పాత్ర నుంచి సైడ్ క్యారెక్టర్ల వరకూ ఏ పాత్రలో ఏ నటుడు నటించాడు? అన్నది ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ నేపజథ్యంలో యామీ గౌతమ్ ఎవరి రియల్ పాత్రలో కనిపిస్తోంది? అన్నది ఆసక్తికరంగా మారింది. పైగా పాకిస్తాన్ యువతి రోల్ అంటే మరింత ఇంట్రెస్టింగ్ గానూ ఉంటుంది. ధురంధర్ మొదటి భాగాన్ని చాప్టర్ల వైజ్ గా చూపిం చారు. అందులో స్పై రోల్ కంటే ప్రతినాయక పాత్రలే హైలైట్ అయ్యాయి. `రివేంజ్` లో మాత్రం స్పై రోల్ హైలైట్ అవుతుంది. అంటే రణవీర్ సింగ్ పోషించిన జాస్ క్రిత్ సింగ్ రంగీ రోల్. అలియాస్ హంజా అలీ మిజారీ. రివేంజ్ లో ఇండియన్ స్పై హైలైట్ అవుతాడు. ప్రతిగా యామీ గౌతమ్ రోల్ కూడా పోటా పోటీగా సాగుతుందా? అన్నది చూడాలి.
