Begin typing your search above and press return to search.

బ్యాక్ గ్రౌండ్ భారీగా ఉన్న తెలివైన నిర్మాణం!

స్టార్ హీరోలకు ఉన్న మార్కెట్ పరిధిని దృష్టిలో పెట్టుకుని ఏ సినిమాకు ఎంత బడ్జెట్ అవసరమో? ఖచ్చితంగా లెక్కగట్టి ఆ పరిమితుల్లోనే క్వాలిటీ చిత్రాలను అందిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   12 July 2026 11:22 AM IST
బ్యాక్ గ్రౌండ్ భారీగా ఉన్న తెలివైన నిర్మాణం!
X

నమ్రత శిరోద్కర్, సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా తమదైన ముద్ర వేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కంటెంట్ బేస్డ్ చిత్రాల‌ను నిర్మిస్తూ తెలివిగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ ముగ్గురి నేపథ్యం బలంగా ఉన్నప్పటికీ భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించాల‌ని.. ఇండ‌స్ట్రీలో ఏదో సాధించేయాల‌ని త‌ప‌న ప‌డ‌టం లేదు. వీరు అడిగితే నో చెప్ప‌ని స్టార్ ఉండ‌డు. క‌చ్చితంగా సినిమా చేస్తామంటారు. కానీ ఆ విష‌యంలో ముగ్గురు ఎక్క‌డా బ్యాలెన్స్ త‌ప్ప‌డం లేదు. ఎంతో వ్యూహాత్మ‌క నిర్ణ‌యాల‌తో ముందుకెళ్తున్నారు. సాధారణంగా పరిశ్రమలో స్టార్డమ్ ఉన్నవారు భారీ బడ్జెట్‌లతో మొదలవ్వాలని చూస్తారు.

కానీ వీరు మాత్రం అందుకు భిన్నంగా కథాబలం ఉన్న చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్ హీరోలకు ఉన్న మార్కెట్ పరిధిని దృష్టిలో పెట్టుకుని ఏ సినిమాకు ఎంత బడ్జెట్ అవసరమో? ఖచ్చితంగా లెక్కగట్టి ఆ పరిమితుల్లోనే క్వాలిటీ చిత్రాలను అందిస్తున్నారు. స్టార్ పవర్‌ని మాత్రమే నమ్ముకోకుండా, కంటెంట్ , క్రాఫ్ట్ పట్ల వీరు చూపిస్తున్న శ్రద్ధ ప్రశంసనీయం. మహేష్ వంటి స్టార్ హీరో భార్యగా ఉన్నా నమ్రత శిరోద్కర్ తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త దర్శకులను, విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన `గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్` ద్వారా కంటెంట్-ఓరియెంటెడ్ కథలనే ఎంచుకుంటున్నారు. సుప్రియ అక్కినేని కూడా అన్నపూర్ణ బ్యానర్ విలువలను కాపాడుతూనే కొత్తతరం ప్రేక్షకులను మెప్పించేలా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నారు. ఆ ర‌కంగా నిర్మాతలుగా బలమైన బ్రాండ్‌ను ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్ద సినిమాల పేరుతో అనవసరమైన ఖర్చులు చేయకుండా కథలో ఉండాల్సిన డెప్త్ .. ప్రొడక్షన్ వాల్యూస్ మధ్య సమతుల్యతను పాటిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో నిర్మాతగా ఆర్థిక భద్రత ఉండటమే కాకుండా క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా పెరుగుతోంది. స్టార్ల డేట్లు అడిగితే క్షణాల్లో దొరుకుతాయి. కానీ ఆ అవకాశం స్టార్డమ్ కోసమే కాకుండా కథకు అవసరమైనప్పుడు మాత్రమే వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు భారీ ప్రొడక్షన్ల వేటలో పడి పంపిణీ వ్యవస్థలో దెబ్బతింటుంటారు. కానీ ఈమహిళా నిర్మాతలు మాత్రం చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు.

ఏ స్టార్ హీరో ఏ పాత్రకు సరిపోతారో? ఆ పాత్ర పరిధి ఏమిటో? వారికి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల వృథా ఖర్చు తగ్గుతోంది . బాక్సాఫీస్ వద్ద లాభసాటి చిత్రాలుగా నిలుస్తున్నాయి. ఆధునిక సినీ నిర్మాణంలో ఈ ముగ్గురు చూపుతున్న పరిణతి కొత్త తరం నిర్మాతలకు దిక్సూచిగా నిలుస్తుంది. భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ దాన్ని భారంలా కాకుండా బాధ్యతగా భావించి కంటెంట్‌కే ప్రాధాన్యత ఇస్తూ నిర్మాణంలో వీరి ప్రయాణం సుస్థిరంగా కొనసాగుతోంది. లాభాల కోసమే కాకుండా నాణ్యమైన సినిమాను ప్రేక్షకులకు అందించడమే ధ్యేయంగా పని చేస్తున్నారు.