Begin typing your search above and press return to search.

మహిళల డ్రెస్సింగ్‌పై వివాదం.. మంచు లక్ష్మీ స్ట్రాంగ్ రియాక్షన్

ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ యాంకర్ రష్మిని టార్గెట్ చేస్తూ.. "సుధీర్ గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? మీకు ఆయనంటే ఇష్టం లేదా?" అని అడిగారు.

By:  Madhu Reddy   |   23 Jun 2026 8:42 PM IST
మహిళల డ్రెస్సింగ్‌పై వివాదం.. మంచు లక్ష్మీ స్ట్రాంగ్ రియాక్షన్
X

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' తాజాగా ఈరోజు సరికొత్త షో ‘టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్’ షో ప్రోమో రిలీజ్ చేసారు. అలాగే ప్రెస్ మీట్ జరిగింది. ఈ మీడియా సమావేశంలో నటి మంచు లక్ష్మి, యాంకర్ రష్మి గౌతమ్ పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌లో సుధీర్ గురించి అడిగిన ఓ ప్రశ్నపై మంచు లక్ష్మి, రష్మీకి మద్దతుగా నిలిచి జర్నలిస్ట్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అలాగే మహిళల డ్రెస్సింగ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు చూద్దాం..

'ఆహా' నుంచి క్రేజీ ఓటీటీ షో:

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇన్‌ఫ్లుయెన్సర్ల హడావుడే కనిపిస్తోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్లలో బెస్ట్ అండ్ టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరో తేల్చడానికి ఆహా వీడియో ఈ సరికొత్త రియాలిటీ షోను స్టార్ట్ చేస్తోంది. జూలై 3 నుంచి ప్రతి ఫ్రైడే ఈ షో కొత్త ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ షో ప్రమోషన్స్ కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే అసలు రచ్చ జరిగింది.

రష్మీకి సపోర్ట్‌గా మంచు లక్ష్మి కౌంటర్:

ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ యాంకర్ రష్మిని టార్గెట్ చేస్తూ.. "సుధీర్ గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? మీకు ఆయనంటే ఇష్టం లేదా?" అని అడిగారు. దానికి రష్మి "ఇక్కడ అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా" అని లైట్ తీసుకుంది. కానీ సదరు జర్నలిస్ట్ మళ్లీ ప్రశ్నించడంతో మంచు లక్ష్మి మధ్యలోకి వచ్చి.. "ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంటి? మీరు అడిగే ప్రశ్న ఏంటి? అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు" అంటూ రష్మీకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మహిళల డ్రెస్సింగ్‌పై లక్ష్మి బోల్డ్ కామెంట్స్:

ఇక కొంతకాలంగా మహిళలు వేసుకునే బట్టలపై నెట్టింట జరుగుతున్న వివాదాలపై కూడా మంచు లక్ష్మి ఈ ఈవెంట్‌లో చాలా ఓపెన్‌గా మాట్లాడారు. "మహిళలు ఇతరుల కోసం కాదు, తమకు కంఫర్ట్‌గా ఉండే డ్రెస్‌నునే ఎంచుకోవాలి.. ఇక వేరే వాళ్లకు నచ్చుతుందా లేదా అని ఆలోచించి వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు" అని తేల్చి చెప్పారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలంటూ ఆమె ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇన్‌ఫ్లుయెన్సర్ షో ప్రమోషన్స్ కోసం వచ్చిన మంచు లక్ష్మి, రష్మి ఇద్దరూ ప్రెస్ మీట్‌లో చాలా బోల్డ్‌గా వ్యవహరించారు. అనవసరమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని చూసిన వారికి మంచు లక్ష్మి తన స్టైల్‌లో క్లాస్ పీకడం ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది. ఇక జులై 3 నుంచి మొదలయ్యే ఈ షో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మధ్య ఎలాంటి ఫైట్ తీసుకురాబోతుందో చూడాలి..