Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ మ్యాన్‌'లో తెలుగు నటుల సర్‌ప్రైజ్‌...!

ఇండియన్‌ ఓటీటీ ప్రేక్షకులు అమితంగా అభిమానించే వెబ్‌ సిరీస్‌ల్లో ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ ముందు వరుసలో ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Ramesh Palla   |   22 Nov 2025 5:01 PM IST
ఫ్యామిలీ మ్యాన్‌లో తెలుగు నటుల సర్‌ప్రైజ్‌...!
X

ఇండియన్‌ ఓటీటీ ప్రేక్షకులు అమితంగా అభిమానించే వెబ్‌ సిరీస్‌ల్లో ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ ముందు వరుసలో ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్ రెండు సీజన్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ముఖ్యంగా రెండో సీజన్‌లో తెలుగు హీరోయిన్‌ సమంత ముఖ్య పాత్రలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సైతం ఫ్యామిలీ మ్యాన్ మరింత చేరువ అయింది. సమంత పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఫ్యామిలీ మ్యాన్‌ మూడో సీజన్‌ ప్రకటించినప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. తాజాగా ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 3 స్ట్రీమింగ్‌ అయింది. ఇప్పటికే ప్రైమ్‌ వీడియోలో ఈ వెబ్‌ సిరీస్‌ను అత్యధికులు చూస్తూ ఉన్నారు. ఆకట్టుకునే కథ, కథనంతో ఎప్పటిలాగే ఈ సీజన్‌ను రూపొందించారు అంటూ రివ్యూలు వస్తున్నాయి.

ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌లో...

ఫ్యామిలీ మ్యాన్‌ రెండో సీజన్‌లో సమంత నటించడంతో తెలుగు ప్రేక్షకులు తెగ చూశారు. అయితే మూడో సీజన్‌లో తెలుగు వారు ఉండరు కనుక చూడక పోవచ్చు అని అనుకున్నారు. కానీ తెలుగులో మొదటి నుంచే స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తెలుగు నటీనటులు ఉంటారు అనే ముందస్తు సమాచారం లేకుండా మూడో సీజన్‌ను స్ట్రీమింగ్‌ చేస్తున్న ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ అయ్యే విధంగా ఇద్దరు తెలుగు నటులు ఈ వెబ్‌ సిరీస్‌ లో కనిపిస్తారు. ప్రధానమంత్రి సలహాధారు పాత్రలో ప్రముఖ తెలుగు నటుడు రవి వర్మ ఈ వెబ్‌ సిరీస్‌లో కనిపించాడు. అన్ని ఎపిసోడ్స్‌లోనూ ఇతడు ప్రధాన మంత్రి సీన్‌లో కనిపించాడు. ఉన్నది కొద్ది సమయం అయినా చాలా కీలక పాత్రలో రవి వర్మ కనిపించడంతో తెలుగు వాడు ఉన్నాడు అనే ఫీల్‌ కలుగుతుంది.

రవి వర్మ, రాగ్‌ మయూర్‌ లు వెబ్‌ సిరీస్‌లో...

రవి వర్మతో పాటు ఈ వెబ్‌ సిరీస్‌ నాల్గవ ఎపిసోడ్‌లో తెలుగు నటుడు రాగ్‌ మయూర్‌ కనిపించాడు. హిందీ వెబ్‌ సిరీస్‌లో తెలుగు మాట్లాడుతూ రాగ్‌ మయూర్‌ కనిపించాడు. చిత్తూరుకు చెందిన రైల్వే టీసీగా రాగ్‌ మయూర్ కనిపించాడు. ఈ వెబ్‌ సిరీస్‌ మేకర్‌ అయిన రాజ్ డీకే లకు రాగ్‌ మయూర్‌ సన్నిహితుడని, అందుకే అతడికి ఇందులో చిన్న గెస్ట్‌ రోల్‌ దక్కిందని తెలుస్తోంది. ఉన్నది మూడు నిమిషాలే అయినా రాగ్‌ మయూర్‌ పాత్ర నవ్వించాడు. ఫ్యామిలీ మ్యాన్‌ తెలుగు వర్షన్‌ చూస్తున్న ప్రేక్షకులకు రాగ్‌ మయూర్‌ తమిళ్‌ మాటలు వింటారు. కానీ ఇతర భాషల్లో మాత్రం రాగ్‌ మయూర్ తెలుగులోనే మాట్లాడటం వింటారు. మూడు నిమిషాల పాత్ర అయినా కీలక ఎపిసోడ్‌లో, ఆరంభంలోనే రాగ్‌ మయూర్‌ రావడంతో అందరూ అతడిని ఈజీగా గుర్తిస్తున్నారు.

టాలీవుడ్‌ నుంచి వీరిద్దరు కాకుండా...

ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ లో ఇద్దరు తెలుగు నటులు ఉండటం తెలుగు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసే విషయం. ఈ విషయం తెలియకుండా చూస్తే కచ్చితంగా వారు వచ్చిన సమయంలో సర్‌ప్రైజ్ అయ్యి ఉంటారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో తెలుగు ప్రేక్షకులు ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌లో వీరిద్దరు ఉన్నారు అంటూ స్క్రీన్‌ షాట్స్ షేర్‌ చేస్తూ, వీడియోలను షేర్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌కి తెలుగులో ఉన్న ఆధరణ నేపథ్యంలో మరింత మంది తెలుగు నటీనటులకు ముఖ్య పాత్రల్లో ఛాన్స్ ఇవ్వాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ప్రారంభం అయ్యింది మొదలుకుని తెలుగు సోషల్‌ మీడియాలో ఈ విషయాల గురించి చర్చ జరుగుతోంది. రవి వర్మ ఎన్నో పెద్ద సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన విషయం తెల్సిందే. ఇక రాగ్‌ మయూర్ మాత్రం ఇప్పుడిప్పుడే కమెడియన్‌గా అలరిస్తూ వస్తున్నాడు.