Begin typing your search above and press return to search.

ఎడిట‌ర్ పాత్ర దారి త‌ప్పుతోందా?

ఇలా ఎడిట‌ర్ క‌రెక్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌ని చాలా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి.

By:  Tupaki Entertainment Desk   |   14 Feb 2026 1:00 PM IST
ఎడిట‌ర్ పాత్ర దారి త‌ప్పుతోందా?
X

ఒక సినిమాకు టెక్నీషియ‌న్స్‌ ప్ర‌ధాన భూమిక పోషిస్తుంటారు. సినిమాకు ప‌ని చేసే టెక్నీషియ‌న్‌ల‌లో కెమెరామెన్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, ఎడిట‌ర్‌లు కీల‌కంగా నిలుస్తుంటారు. ఇందులో ఏ ఒక్క‌రు స‌రైన ఔట్‌పుట్‌ని అందించ‌లేక‌పోయినా సినిమా ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకోలేదు. అయితే కూర‌లో ఉప్పు క‌రెక్ట్‌గా మిక్స్ కాలేక‌పోతే అది ప‌ర్‌ఫెక్ట్‌గా అనిపించ‌దు అన్న‌ట్టే సినిమాకు ఎడిట‌ర్ క‌రెక్ట్‌గా లేకున్నా అదే ఫ‌లితం ఎదురువుతుంది. ఈ విష‌యంలో ఎడిట‌ర్ గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే. ఎందుకంటే డైరెక్ట‌ర్ అనుకున్న దాన్ని అనుకున్న‌ట్టుగా క‌ట్ చేయ‌డంలో ఎడిట‌ర్‌ది కీల‌క పాత్ర‌.

ఇంకా బెట‌ర్ ఎడిట‌ర్ అయితే ద‌ర్శ‌కుడి విజ‌న్‌ని మించి ఆలోచించి ప‌ర్‌ఫెక్ట్ క‌ట్‌తో సినిమాని రెడీ చేసి స‌క్సెస్‌లో భాగం అవుతుంటాడు. అదీ కాకుండా ఎక్కువ‌ నిడివితో సినిమా తీసినా దాన్ని ప‌ర్ఫెక్ట్‌గా క‌ట్ చేసి స‌రైన రూపుకు తీసుకురావ‌డంలో ఎడిట‌ర్ కీ రోల్ పోషిస్తుంటాడు. డైరెక్ట‌ర్ ఎంత బాగా తీసినా దాన్ని స‌రైన క్ర‌మంలో సీన్ టు సీన్ క‌ట్ చేయ‌క‌పోయినా..ఎక్క‌డా `హై` ఇవ్వాలి..ఎక్క‌డ `లో` ఇవ్వాలో తెలియ‌క‌పోయానా... టెంపోని క‌రెక్ట్‌గా మెయింటైన్ చేయ‌లేక‌పోయినా సినిమా ప‌రిస్థితి గోవిందా గోవిందా.

ఇలా ఎడిట‌ర్ క‌రెక్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌ని చాలా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. సినిమాలో స‌రుకు ఏమీ లేక‌పోయినీ ఎడిట‌ర్ చేసిన జిమ్మిక్కుల‌తో స‌క్సెస్ అయిన‌వి కూడా చాలానే ఉన్నాయి. ఇండ‌స్ట్రీలో కొంత మంది ఎడిట‌ర్ల‌ను మాత్ర‌మే ప‌ర్టికుల‌ర్‌గా డైరెక్ట‌ర్‌లు ఎంచుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కూడా ఇదే. ఒక ఎడిట‌ర్‌తో ప్ర‌యాణం మొద‌లు పెట్టిన ద‌ర్శ‌కులు ఏళ్ల త‌ర‌బ‌డి వారినే కంటిన్యూ చేస్తూ ఉంటారు కార‌ణం డైరెక్ట‌ర్ మైండ్‌కు త‌గ్గ‌ట్టుగా ఎడిట‌ర్ సినిమాని క‌ట్ చేసి స‌క్సెస్‌లో భాగం కావ‌డ‌మే.

అయితే ఈ మ‌ధ్య కొంత మంది ఎడిట‌ర్లు త‌ప్పుదారి ప‌డుతున్నట్టు కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఎడిట‌ర్ అనే వాడు ఎప్పుడూ డైరెక్ట‌ర్ ఆలోచ‌న‌కు త‌గ్గ‌ట్టుగా త‌ను చెప్పింది చెప్పిన‌ట్టు చేయాలి. అలా చేసిన‌ప్పుడు అనుకున్న అవుట్‌పుట్ ప‌ర్‌ఫెక్ట్‌గా వ‌స్తుంది. అలా వ‌చ్చిన ప్రోడ‌క్ట్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. కానీ ఇప్పుడు కొంత మంది ఎడిట‌ర్స్ డైరెక్ట‌ర్స్ విజ‌న్ కంటే ప్రొడ్యూస‌ర్‌ల మాట‌ల‌కే ప్రాముఖ్య‌త ఇస్తున్నారు. ప్రొడ్యూస‌ర్ల‌ని సంతృప్తి ప‌ర‌చ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తూ డైరెక్ట‌ర్ల‌ని ప‌క్క‌న పెట్టేస్తున్నారు.

దాంతో ఆయా సినిమాల ఫ‌లితం మారిపోతోంది. బ్లాక్ బ‌స్ల‌ర్‌, హిట్ అనిపించుకోవాల్సిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద చేతులెత్తేస్తున్నాయి. గ‌త కొంత కాలంగా విడుద‌లైన సినిమాల‌ని ప‌రీక్ష‌గా ప‌రిశీలిస్తే డైరెక్ట‌ర్ ఫాల్ట్ క‌న్నా ఎడిటింగ్ జ‌రిగిన త‌ప్పిదాలే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. పేరున్న ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ, కొత్త ద‌ర్శ‌కుల చిత్రాల‌కు చాలా వ‌ర‌కు ఇదే జ‌రుగుతోంది. కార‌ణం పేరున్న ప్రొడ‌క్ష‌న్ కంప‌నీకి ఫేవ‌ర్‌గా ఉండాల‌న్న ఆలోచ‌న వ‌ల్లే ఎడిట‌ర్‌లు ద‌ర్శ‌కుల మాట‌కు విలువ ఇవ్వ‌డం లేద‌ని, వారి విజ‌న్‌కు త‌గ్గ‌ట్టుగా క‌ట్ చేయ‌కుండా పేరున్న ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు చెప్పిన‌ట్టుగా చేస్తూ సినిమాల‌ని కిల్ చేస్తున్నార‌నే వాద‌న ఇప్పుడు టాలీవుడ్‌లో బ‌లంగా వినిపిస్తోంది.