‘ధురంధర్’ లో తమన్నాను ఎవరు, ఎందుకు తిరస్కరించారో తెలుసా..!
విడుదలైనప్పటి నుంచీ బాలీవుడ్ తాజా సంచలనం ‘ధురంధర్’ సినిమా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 22 Dec 2025 12:12 AM ISTవిడుదలైనప్పటి నుంచీ బాలీవుడ్ తాజా సంచలనం ‘ధురంధర్’ సినిమా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకలులు, అటు సెలబ్రెటీలు, ఇటు సినీజనాలు... అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు దక్కించుకుంటుంది. ఈ సినిమా వల్లే జమ్మూకశ్మీర్ లోని థియేటర్లకు పూర్వ వైభవం వచ్చిందని చెబుతున్నారు. ఇక కలెక్షన్స్ సంగతి చెప్పే పనిలేదు!
భారత్ నుంచి విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల కలెక్షన్స్ ను బీట్ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతోన్న పరిస్థితి. రాబోయే భారీ సినిమాల ముందు ఈ సినిమా బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ సినిమాలో ఓ పాటకు తమన్నాను ఎంపిక చేసినా.. ‘నో’ చెప్పారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... ‘ధురంధర్’ సినిమాలో హాట్ టాపిక్ గా మారిన "శరరత్" సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటలో అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. అయితే... ఈ పాటకు తొలుత వీరిద్దరూ ఎంపిక కాదని.. తమన్నా భాటియా అయితే బాగుంటుందని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ చెప్పగా.. దర్శకుడు ‘నో’ చెప్పారట.
తాజాగా ఫిల్మీగ్యాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన విజయ్ గంగూలీ... "శరరత్" పాటకోసం తాను తమన్నాను ప్రతిపాదించానని.. అయితే అందుకు దర్శకుడు ఆదిత్య ధర్ అంగీకరించలేదని అన్నారు. అయితే దానికి ఆయన చెప్పిన కారణం... ఈ పాటలో తమన్నా డ్యాన్స్ చేస్తే.. దీన్ని ఓ స్పెషల్ సాంగ్ గా చూస్తారని.. అప్పుడు ప్రేక్షకుడు కథ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని అన్నారంట.
పైగా ప్రజలు ‘శరరత్’ ను ఐటం సాంగ్ గా చూడాలని, అలా ముద్రవేయాలని తాను కోరుకోవడం లేదని ఆదిత్య చెప్పారని గంగూలీ వెల్లడించారు. పైగా ఆ పాటలో తమన్నా లాంటి ఒక అమ్మాయి మాత్రమే ఉంటే అది కథ నుంచి అందరినీ దూరం చేస్తుందని.. అప్పుడు అంతా కథ గురించి కాకుండా ఆమె డ్యాన్స్ గురించి మాట్లాడుకుంటారని.. అందుకే ఇద్దరు వేరే అమ్మాయిలు ఉండాలని ధర్ కోరుకున్నారని వెల్లడించారట.
దీంతో... ఓ పక్క తమన్నాను మిస్సయ్యామన్న బాధ ఉన్నా.. దర్శకుడి ఆలోచన సరైందే అనే కామెంట్లు చేస్తున్నారు సినీప్రియులు! కాగా.. ఇటీవల తమన్నా కనిపించిన ఐటం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘జైలర్’ సినిమాలోని ‘రావాలయ్య, నువ్వే రావాలయ్య’ సాంగ్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందనేది తెలిసిన విషయమే!
