Begin typing your search above and press return to search.

సమ్మర్ బాక్సాఫీస్.. ఫస్ట్ వీక్ ఇలా అయిందేంటి?

హిందీ మార్కెట్‌ లో కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. జునైద్ ఖాన్, సాయి పల్లవి నటించిన ఏక్ దిన్ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ సాధించలేకపోయింది.

By:  M Prashanth   |   3 May 2026 6:00 PM IST
సమ్మర్ బాక్సాఫీస్.. ఫస్ట్ వీక్ ఇలా అయిందేంటి?
X

సినీ ఇండస్ట్రీలో సమ్మర్ సీజన్ అంటే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు గోల్డెన్ టైమ్‌ గా భావిస్తారు. పాఠశాలలకు హాలీడేస్, కుటుంబాలతో కలిసి థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో విడుదలయ్యే సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. గతంలో కూడా ఎన్నో చిత్రాలు సమ్మర్‌ ను టార్గెట్‌ గా పెట్టుకుని విడుదలై భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని ఆశించారు.

కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఆశించిన దానికంటే భిన్నంగా కనిపిస్తోంది. ఈసారి మే మొదటి వారంలో వివిధ భాషల్లో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. తెలుగులో విడుదలైన సత్య జెట్ లీ, గాయపడ్డ సింహం వంటి చిత్రాలు ప్రారంభంలో ఆసక్తి రేపినప్పటికీ, కలెక్షన్ల పరంగా మోస్తరు స్థాయిలోనే నిలిచిపోయాయి. వీటిలో క్యాస్టింగ్ యాక్టింగ్ కు కొంతమేర ప్రశంసలు వచ్చినా, కంటెంట్ విషయంలో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాయి.

ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కర కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. విడుదలకు ముందు మంచి హైప్ ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి వచ్చిన మిక్స్ డ్ రెస్పాన్స్ దాని వసూళ్లపై ప్రభావం చూపింది. కంటెంట్ పరంగా కొత్తదనం లేకపోవడం, కథనం బలహీనంగా ఉండటం వంటి అంశాలు ఆ చిత్రానికి అడ్డంకిగా మారాయి. మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌ లాల్ వంటి స్టార్ నటులు కలిసి నటించిన పేట్రియాట్ మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించినా, తర్వాత రోజుల్లో వసూళ్లు తగ్గడం గమనార్హం. స్టార్ పవర్ ఉన్నా సరే, సినిమా కంటెంట్ ప్రేక్షకులను నిలబెట్టలేకపోతే కలెక్షన్లు నిలకడగా రావడం కష్టమనే విషయం మరోసారి స్పష్టమైంది.

హిందీ మార్కెట్‌ లో కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. జునైద్ ఖాన్, సాయి పల్లవి నటించిన ఏక్ దిన్ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ సాధించలేకపోయింది. మంచి నటీనటులు ఉన్నప్పటికీ, కథలో బలం లేకపోవడం ఆ చిత్రానికి నష్టంగా మారింది. మరోవైపు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో వచ్చిన రాజా శివాజీ మూవీ మరాఠీ వెర్షన్‌ లో మంచి వసూళ్లు సాధిస్తున్నా, దాని హిందీ డబ్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మొత్తంగా చూస్తే.. సమ్మర్ బాక్సాఫీస్ వద్ద ఒక క్లియర్ ట్రెండ్ కనిపిస్తోంది. స్టార్ పవర్, భారీ ప్రమోషన్స్ మాత్రమే సరిపోవడం లేదు. ప్రేక్షకులు ఇప్పుడు కొత్త కథలు, స్ట్రాంగ్ కంటెంట్, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ను కోరుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల మొదటి షో నుంచే టాక్ బయటకు వస్తోంది. కంటెంట్ బాగాలేకపోతే, సినిమా నిలబడే అవకాశం తగ్గిపోతోంది.

ఇక మరో ముఖ్య కారణం ఓటీటీ ప్రభావం. ప్రేక్షకులకు ఇంట్లోనే మంచి కంటెంట్ అందుబాటులో ఉండటం వల్ల థియేటర్‌ కు రావాలంటే సినిమా ప్రత్యేకంగా ఉండాలి. లేదంటే వారు వేచి చూసి ఓటీటీలోనే చూడటానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈసారి సమ్మర్ సీజన్ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్‌ కు ఊపు ఇవ్వలేకపోయింది. చివరికి సీజన్ ఏదైనా కావొచ్చు, స్టార్ ఎవరైనా కావొచ్చు.. కంటెంట్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. మరి సమ్మర్ లో రిలీజ్ కానున్న మిగతా సినిమాలు ఏం చేస్తాయో.. ఎలాంటి హిట్ అవుతాయో వేచి చూడాలి.