Begin typing your search above and press return to search.

హీరోయిన్ల విష‌యంలో సుకుమార్ ఆ రిస్క్ తీసుకోరా?

దర్శకుడు సుకుమార్ తన సినిమాల్లో హీరోయిన్ల ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గత చిత్రాల్లో అనురాధ మెహతా, కాజల్, తమన్నా, కృతి సనన్, సమంత, రష్మిక వంటి 30 ఏళ్లలోపు నటీమణులకే అవకాశమిచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్‌తో తెరకెక్కిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. సారా అర్జున్, అనస్వర రాజన్ పేర్లు వినిపిస్తుండటంతో ఈసారి కూడా యంగ్ హీరోయిన్‌కే సుకుమార్ ప్రాధాన్యత ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. 41 ఏళ్ల రామ్ చరణ్‌కు జోడీగా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.

By:  Srikanth Kontham   |   14 Nov 2026 2:00 PM IST
హీరోయిన్ల విష‌యంలో సుకుమార్  ఆ రిస్క్ తీసుకోరా?
X

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు సుకుమార్ సినిమాల్లో హీరోల పాత్ర‌ల‌తో పాటు హీరోయిన్ పాత్ర‌ల‌కు ప్ర‌త్యేక‌మైన ప్రాధాన్య‌త ఉంటుంది. కేవ‌లం గ్లామ‌ర్ కోణంలోనే కాకుండా బ‌ల‌మైన కోణంలో హీరోయిన్ల‌ను ఆవిష్క‌రించ‌డం సుకుమార్ ప్ర‌త్యేక‌త‌. అయితే హీరోయిన్ల ఎంపిక విషయంలో సుకుమార్ తొలి నుంచీ ఓ నియ‌మాన్ని ఫాలో అవుతున్నట్లు క‌నిపిస్తుంది. వీలైనంత వరకు 30 ఏళ్ల లోపు వయసున్న యువ కథానాయికలకే సుకుమార్ చిత్రాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. 30 ఏళ్లు దాటిన హీరోయిన్ల విషయంలో సుకుమార్ రిస్క్ తీసుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది.

సుకుమార్ గత చిత్రాల ట్రాక్ రికార్డ్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. `ఆర్య`లో అనురాధ మెహతా.. `జగడం`లో ఇషా సహాని, `ఆర్య 2`లో కాజల్ అగర్వాల్, `100% లవ్` లో తమన్నా, ` నేనొక్కడినే`లో కృతి సనన్, `నాన్నకు ప్రేమతో`లో రకుల్ ప్రీత్ సింగ్, `రంగస్థలం`లో సమంత పాన్ ఇండియా లో సంచ‌ల‌నం సృష్టించిన `పుష్ప` సిరీస్‌లో రష్మిక మందన్న.. ఇలా వీరంతా సుకుమార్ సినిమాల్లో నటించే సమయానికి 30 ఏళ్ల లోపు వారే కావడం విశేషం. పాత్రల్లో ఉండే యూత్‌ఫుల్ ఎనర్జీ..అమాయకత్వం ..సహజత్వాన్ని తెరపై అద్భుతంగా పండించడానికి సుకుమార్ ఏజ్ గ్రూప్ హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతారని చెప్పొచ్చు.

ఈ కారణంగానే పలువురు సీనియర్ స్టార్ హీరోయిన్లు సుకుమార్ దర్శకత్వంలో నటించాలని ఆసక్తిగా ఉన్నా? ఆ కాంబినేషన్లు పట్టాలెక్కలేదనే టాక్ ఉంది. హీరోల ఇమేజ్ ఆధారంగా కాకుండా కథలో పాత్ర స్వభావానికి సరిపోయే వయసున్న హీరోయిన్ల‌ను ఎంచుకోవడంలో మాష్టారు ఎక్కడా రాజీ పడరని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇందులో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు. దీంతో ఆ పాత్ర‌కు సుకుమార్ ఏ హీరోయిన్ తీసుకుంటారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే సారా అర్జున్, అన‌స్వ‌ర రాజేశ్వ‌ర‌న్ లాంటి భామ‌ల పేర్లు వినిపించాయి. ఇద్ద‌రు కూడా 30 లోపు వాళ్లే. దీంతో ఈసారి కూడా సుకుమార్ పాత ఫార్ములానే అనుసరిస్తున్న‌ట్లు క‌నిసిస్తుంది.వీలైనంత వ‌ర‌కూ 30 ఏళ్ల లోపు ఉన్న యంగ్ బ్యూటీని రంగంలోకి దించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఏజ్ 41..ఆ వ‌య‌సును మ్యాచ్ చేసే భామ‌ను ఎంపిక చేయాలి. అదీ 30 లోపు ఉండాలి. మ‌రి సుకుమార్ సినిమాలో ఛాన్స్ అందుకునే ఆ ల‌క్కీ గాళ్ ఎర‌వుతారో? చూడాలి.