Begin typing your search above and press return to search.

జోరు పెంచిన శ్రీలీల.. నిర్మాతల పాలిట వరం!

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది శ్రీలీల. ఏడాదికి రెండు మూడు సినిమాల్లో కనిపిస్తూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది.

By:  Madhu Reddy   |   7 Aug 2025 6:00 PM IST
జోరు పెంచిన శ్రీలీల.. నిర్మాతల పాలిట వరం!
X

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది శ్రీలీల. ఏడాదికి రెండు మూడు సినిమాల్లో కనిపిస్తూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. కేవలం సౌత్ ఇండస్ట్రీని మాత్రమే కాదు నార్త్ ఇండస్ట్రీని కూడా తన మాస్ ఎనర్జీతో కట్టిపడేస్తోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీగా మారింది. అంతేకాదు ఒకవైపు హీరోయిన్ గా చేస్తూనే.. అదే సినిమాలో స్పెషల్ సాంగులో కూడా చేస్తూ నిర్మాతలకు వరంలా మారిందని చెప్పవచ్చు.

వాస్తవానికి చాలామంది నిర్మాతలు సినిమాలు తెరకెక్కించేటప్పుడు.. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఒకరిని తీసుకుంటే.. స్పెషల్ సాంగ్ కోసం మరో హీరోయిన్ ని తీసుకుంటారు. అయితే మెయిన్ హీరోయిన్ గా చేసే హీరోయిన్ కి ఎంత రెమ్యూనరేషన్ ఉంటుందో.. కేవలం 4,5 నిమిషాలు ఉండే స్పెషల్ సాంగ్ లో చేసే హీరోయిన్ కు కూడా అంతే రెమ్యూనరేషన్ ఉంటుంది. అయితే ఆ స్పెషల్ సాంగ్ లో కనిపించే హీరోయిన్ కోసం బాగా పాపులారిటీ ఉన్న వారిని.. యూత్లో మంచి క్రేజ్ ఉన్న వారిని మాత్రమే తీసుకుంటారు. పైగా స్పెషల్ సాంగ్స్ కోసం హీరోయిన్స్ ని రంగంలోకి దింపాలంటే దర్శక నిర్మాతలకు కత్తి మీద సాములాగ పరిస్థితి మారిపోయింది. కానీ శ్రీలీల హీరోయిన్ గా చేసే సినిమాల్లో మాత్రం అలాంటి హీరోయిన్ల అవసరమే ఉండదు. ఎందుకంటే శ్రీలీల అటు హీరోయిన్ గా మెప్పించడమే కాదు. ఇటు ఐటెం సాంగ్ తో కూడా అందరినీ ఒక ఊపు ఊపేస్తోంది.

ఎందుకంటే ఇప్పటివరకు శ్రీలీల ఓవైపు సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్ కూడా ఓకే చేస్తూ తన డ్యాన్స్ తో ఆకట్టుకుంటోంది. అలా రవితేజ ధమాకా

సినిమాలో పల్సర్ బండి, మహేష్ బాబు గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి, కిరీటి రెడ్డి జూనియర్ మూవీలో వైరల్ వయ్యారి.. ఇలా ఈ మూడు సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ గా చేస్తూనే.. స్పెషల్ సాంగ్ లో కూడా చేసి సెంటరాఫ్ అట్రాక్షన్ అయింది. ఇక శ్రీలీల సినిమాల్లో హీరోయిన్ గా ఉంటే స్పెషల్ సాంగ్ ల కోసం డబ్బులు పెట్టి వేరే హీరోయిన్లను పెట్టుకోవాల్సిన పనిలేదు. శ్రీలీలనే రెండింటినీ కవర్ చేస్తుంది. అలా ఓవైపు ఐటెం సాంగ్స్ తో మెప్పిస్తూనే.. మరోవైపు హీరోయిన్ గా కూడా రాణిస్తోంది. ఒకరకంగా ఈ విషయంలో శ్రీలీల నిర్మాతలకు బంగారు బాతే అని చెప్పుకోవచ్చు.

శ్రీ లీల ప్రస్తుతం రవితేజతో కలిసి మాస్ జాతర మూవీ చేస్తోంది.ఇప్పటికే వీరి కాంబోలో ధమాకా వచ్చి సూపర్ హిట్ కొట్టింది. మళ్ళీ మాస్ జాతర మూవీతో హిట్ కొట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన తూ మేరీ లవర్, ఓలే ఓలే రెండు సాంగ్స్ కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇందులో ఓవైపు మాస్ సాంగ్స్ తో కుర్రకారుని స్టెప్పులు వేయించడమే కాకుండా క్లాసీ లుక్స్ తో అదరగొట్టింది శ్రీలీల.