Begin typing your search above and press return to search.

స్క్రీన్ ప్లే అంటే ఏంటి? కథకి - స్క్రీన్ ప్లే కి మధ్య ఉండే సంబంధం ఏంటి?

సినిమాను చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది. అందువల్లే స్క్రీన్ ప్లే అనేది చాలా కీలకమైనే చెప్పాలి... అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి..?

By:  Gopi Velupala   |   29 Sept 2026 5:28 PM IST
స్క్రీన్ ప్లే అంటే ఏంటి? కథకి - స్క్రీన్ ప్లే కి మధ్య ఉండే సంబంధం ఏంటి?
X

ఒక సినిమాని చూస్తున్నంత సేపు అది ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాలి అలాంటప్పుడే ఆ సినిమా ప్రేక్షకుడిలో ఎంతో కొంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది తద్వారా ఆ మూవీ ప్రేక్షకుడికి నచ్చే అవకాశమైతే ఉంటుంది...కథ బాగున్నా కూడా దానికి స్క్రీన్ ప్లే అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవ్వకపోతే సినిమా ఎంగేజింగ్ గా ఉండదు. సినిమాను చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది. అందువల్లే స్క్రీన్ ప్లే అనేది చాలా కీలకమైనే చెప్పాలి... అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి..?

స్క్రీన్ మీద ప్రేక్షకులు చూసే ప్రతిదీ స్క్రీన్ ప్లే లో భాగమే... ఒక సీన్ లో ఒక యాక్టర్ చెబుతున్న డైలాగులు, ఆ బ్యాక్ గ్రౌండ్ లో ఆర్ట్ కి సంబంధించిన ఎలిమెంట్స్, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి. వర్షం పడుతుందా ఎండ కొడుతుందా? ఆ నటుడి కదలికలు ఏంటి? ఇవన్నీ స్క్రీన్ ప్లే కిందికే వస్తాయి...ఆ కథలోని ట్విస్టులను ఎక్కడ రివిల్ చేయాలి అనేది కూడా స్క్రీన్ ప్లే లో భాగమే... కథ అనేది ఏం జరిగిందో వివరిస్తే స్క్రీన్ ప్లే అనేది ఎలా జరిగింది అనేది చూపిస్తుంది...

కథ - స్క్రీన్ ప్లే

కథకి స్క్రీన్ ప్లేకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కథ లేకపోతే స్క్రీన్ ప్లే వర్కౌట్ కాదు. స్క్రీన్ ప్లే లేకపోతే కథ బోర్ కొడుతుంది. స్క్రీన్ ప్లే లో ముఖ్యంగా లీనియర్ స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని రెండు రకాలుగా ఉంటాయి... లీనియర్ స్క్రీన్ ప్లే అంటే కథను స్ట్రెయిట్ గా చెప్పడం, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ఎక్కడో మొదలుపెట్టి కథను ముందుకు తీసుకెళ్లడం. లీనియర్ స్క్రీన్ ప్లే కి 'ఒక్కడు' మూవీని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అది స్ట్రెయిట్ నరేషన్ ఉంటుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కి 'అర్జున్ రెడ్డి' సినిమాను ఉదాహరణగా చెప్పుకోవచ్చు... కథ విషయానికి వస్తే మనం దేనిగురించైతే చెబుతున్నామో అది కథ... ఉదాహరణకు విజయ్ అనే వ్యక్తి ఒక సాప్ట్ వేర్ ఉద్యోగి మంచోడు అలాంటి వ్యక్తి ఒక మర్డర్ చేసి జైలు కి వెళ్ళాడు అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు అనేది కథ...

స్క్రీన్ ప్లే ప్రకారం విజయ్ జైలు లో పడే ఇబ్బందులను మొదట గా చూపించి అక్కడ అతని మంచితనాన్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడున్న ఎస్సై ద్వారా ఇంతమంచి వాడివి నువ్వు జైలు కి ఎందుకు వచ్చావు అని అడగటంతో అతని ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారు...ఇలా చెప్పడం వల్ల రొటీన్ గా కథ చెప్పినట్టుగా కాకుండా డిఫరెంట్ కోణం లో చెప్పిన ఫీల్ కలుగుతుంది. అలాగే విజయ్ మంచోడు కాబట్టి ఆ మర్డర్ చేసి ఉండడు అని ప్రేక్షకుడికి అతని క్యారెక్టర్ తో ముందుగానే చెప్పేయడం. కాబట్టి విజువల్ గా సినిమాను చూసే ప్రేక్షకుడికి దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది...

స్క్రీన్ ప్లే తేడా కొడితే సినిమా ప్లాప్ అవ్వక తప్పదు. అందుకే దాని విషయంలో డైరెక్టర్లు చాలా కేర్ తీసుకుంటారు... రొటీన్ కథలకు సైతం డిఫరెంట్ స్క్రీన్ ప్లే ను రాసి సక్సెస్ లను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి...