Begin typing your search above and press return to search.

సంపత్ నంది కి టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ డైరెక్టర్ అవ్వకపోవడానికి కారణమేంటి..?

‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’, ‘సీటిమార్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది ఇప్పటికీ టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరలేకపోయారు. ఆయన సినిమాల్లో కమర్షియల్ అంశాలు బాగున్నా, ఎమోషన్స్, రొటీన్ సన్నివేశాలు మైనస్ అవుతున్నాయనే విశ్లేషణ ఉంది. ఇప్పుడు ‘భోగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

By:  Gopi Velupala   |   24 Nov 2026 9:26 AM IST
సంపత్ నంది కి టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ డైరెక్టర్ అవ్వకపోవడానికి కారణమేంటి..?
X

సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిని అక్కున చేర్చుకుంటుందో? ఎవరిని పక్కన పెట్టేస్తుందో? చెప్పడం కష్టం... సంపత్ నంది లాంటి దర్శకుడు కెరియర్ స్టార్టింగ్ లోనే 'ఏమైంది ఈవేళ' అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను చేసి సక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత వెంటనే రామ్ చరణ్ తో 'రచ్చ' చేసి సక్సెస్ ని సాధించాడు. రవితేజ తో 'బెంగాల్ టైగర్' ఒకే అనిపించింది. గోపీచంద్ తో చేసిన 'గౌతమ్ నంద' సినిమా డిఫరెంట్ అటెంప్ట్ గా మిగిలింది తప్ప భారీ విజయాన్ని సాధించలేకపోయింది. రెండోసారి గోపీచంద్ తో చేసిన 'సీటిమార్' సినిమా ప్రేక్షకులను అలరించింది. కానీ ఆ తర్వాత ఆయన స్టార్ హీరోతో సినిమా చేయలేకపోయాడు. చాలా ఎక్కువ గ్యాప్ తీసుకొని ఇప్పుడు 'భోగి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంపత్ నంది ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నప్పటికి సరైన సక్సెస్ దక్కలేదు. ఆయన తర్వాత వచ్చిన చాలామంది డైరెక్టర్లు టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. కమర్షియల్ ఫార్మాట్ ను ఎంచుకొని ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ట్విస్టు లను రాసుకొని ఆడియన్స్ లో ఒక హై వోల్టేజ్ డ్రామా ను క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న సంపత్ నంది స్టార్ డైరెక్టర్ గా మారకపోవడానికి గల కారణం ఏంటనేది తెలుసుకుందాం...

సంపత్ నంది మూవీస్ లో అది మైనస్ అవుతుందా?

సంపత్ నంది స్టార్ హీరోలు, మీడియం హీరోలతో సినిమాలు చేసినప్పటికి అతని సినిమాల్లో కమర్షియాలిటీ పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఎక్కడ ఏ సీను రావాలో మీటర్ మీద కొలిచినట్టుగా పర్ఫెక్ట్ గా వస్తూనే ఉంటాయి. తన సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన సినిమాలో ఎమోషన్ భారీ స్థాయిలో ఉండదు. హీరోకి ఉండే బ్యాక్ స్టోరీస్ అంత ఎఫెక్టివ్ గా రాసుకోలేకపోతున్నాడు. సన్నివేశాలు సైతం ప్రేక్షకుడికి ఫ్రెష్ ఫీల్ కలిగించే మాదిరిగా ఉండవు. తను రాసుకున్న సీన్స్ ఇంతకుముందు మనం ఏదో సినిమాలో చూసాం అనే ఫీల్ కలుగుతుంది. గౌతమ్ నంద సినిమాలో ఆయన స్టైల్ పూర్తిగా మార్చి చేసిన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేదు. కారణం ఏంటంటే బ్యాక్ డ్రాప్ సెటప్ అంత బాగా చేసుకున్నాడు. సీన్స్ మధ్య ఫ్లో బాగా కుదిరినప్పటికి కొన్ని సన్నివేశాలు రొటీన్ ఫీల్ ను ఇస్తాయి. అలాగే హీరో పేరెంట్స్ మధ్య ఇంకొన్ని ఎమోషనల్ సన్నివేశాలను యాడ్ చేసి గ్రిప్పింగ్ రాసుకోవాల్సింది. అది పర్ఫెక్ట్ గా సెట్ అయితే సినిమా రిజల్ట్ ఇంకోలా ఉండేది.

నిజానికి ఒక సీన్ ని గొప్పగా రాసుకున్నప్పుడు అందులో కోర్ ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వాలి. అలా కాకుండా ఆ ఎమోషన్ ఏదో ఒక సినిమాలో చూసినట్టుగానే రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లో ఉంటే వర్క్ అవుట్ అవ్వడం కష్టమవుతుంది. అందువల్లే సంపత్ నంది సినిమాల్లోని ఎమోషనల్ సన్నివేశాలు హృదయాన్ని తాకేలా వర్కౌట్ అవ్వడం లేదు. అందుకే ఇప్పటి వరకు ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకోలేదు. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నప్పటికి టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరలేకపోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో తెలియజేశాడు. రీసెంట్ గా 'భోగి' సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఒక కొత్త దర్శకుడు సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా కష్టపడి తీశాను మీరు కూడా కొత్త డైరెక్టర్ తీసినట్టుగానే సినిమాను చూడండి. నా గత సినిమాలతో ఈ మూవీని పోల్చకండి అని చెప్పాడు...మరో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందో చూడాలి...