కరీనా కపూర్ తో ప్రయాణం కష్టమనేసిన భర్త!
ఈ విషయంలో డైరెక్టర్లు కూడా ఇలాగే ఆలోచిస్తారేమో. కానీ ఇలా భార్యభర్తలు కలిసి నటించడం సైఫ్ అలీఖాన్ ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటున్నారు.
By: Srikanth Kontham | 7 Oct 2025 10:00 PM ISTభార్యభర్తలు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఆ కాంబినేషన్ వెండి తెరపై కనిపిస్తే సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తుంది. పాత్రల పరంగా నటించే క్రమంలో ఒకర్ని ఒకరు అర్దం చేసుకోవడంలో తప్పిదాలకు ఆస్కారం ఉండదు. కెమిస్ట్రీ కూడా పర్పెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. నటనలో సహజత్వం కనిపిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. ఈ విషయంలో డైరెక్టర్లు కూడా ఇలాగే ఆలోచిస్తారేమో. కానీ ఇలా భార్యభర్తలు కలిసి నటించడం సైఫ్ అలీఖాన్ ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటున్నారు.
తనను అధిగమించే సహనటులతో పని చేస్తున్న సమయంలోనే ఆ పాత్రను తాను కూడా సవాల్ గా తీసుకుని నటించడానికి అవకాశం ఉంటున్నారు. అవే సన్నివేశాలు భార్యతో కలిసి నటించాల్సి వచ్చినప్పుడు తన వరకూ చాలా కష్టంగా ఉంటుందన్నారు. అలా నటించడంలో తనకు ఎంత మాత్రం కిక్ ఉండదన్నారు. అందుకే తానెప్పుడు భార్యతో కలిసి నటించకూడదనే అనుకుంటానన్నారు. మిత్రులతో కలిసి పని చేయడాన్ని కూడా తాను అలాగే భావిస్తానన్నారు. ఇలాంటి కలయికలు కొన్నిసార్లు బంధాలను కూడా దూరం చేసే అవకాశం లేకపోలేదన్నారు.
తప్పిదాలు కారణంగా అందుకు ఆస్కారం ఉంటుందన్నారు. అదే తెలియని నటులతో అయితే ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఆ రోజు కాసేపు ఆ సన్నివేశంలో నటించి వెళ్లిన తర్వాత వాళ్లెవ్వరో మనకు తెలియదు..నేను ఎవరో తనకు తెలియదు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రావు అన్నారు. వేర్వేరు నటులతో కలిసి పనిచేసినా ఇలాగే ఉంటుందన్నారు. అందుకేనేమో పెళ్లైన తర్వాత కరీనా కపూర్ తో సైఫ్ అలీఖాన్ మళ్లీ కలిసి నటించలేదు. వివాహనికి ముందు మూడు సినిమాలు చేసారు. `ఎల్ ఓ సీ కార్గిల్`, `ఓంకార`, `ఏజెంట్ వినోద్` చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత మళ్లీ ఆ కాంబినేషన్ లో మరో సినిమా చేయలేదు.
భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా పని చేయడం మినహా కలిసే ప్రయత్నం చేయలేదు. అయితే రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ మాత్రం పెళ్లైనా భార్యలతో కలిసి సినిమాలు చేస్తున్నారు. భార్యభర్తల బంధం అన్నది ఇంటి వరకే పరిమితం చేసి సెట్స్ కు వచ్చిన తర్వాత స్నేహితుల్లా కలిసి సినిమాలు చేస్తున్నారు. ఇతర భాషల్లోనూ అలాంటి జోడీలు కొన్ని ఉన్నాయి.
