Begin typing your search above and press return to search.

పీరియాడికల్ స్టోరీ లకు క్రేజ్ పెరగడానికి కారణం ఇదేనా..?

ఇలాంటి నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్, రంగస్థలం, దసర లాంటి సినిమాలతో మన దర్శకులు పీరియాడికల్ సినిమాలు చేసి సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక మార్కును క్రియేట్ చేశారు...

By:  Gopi Velupala   |   11 Oct 2026 1:00 AM IST
పీరియాడికల్ స్టోరీ లకు క్రేజ్ పెరగడానికి కారణం ఇదేనా..?
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఎవరైనా గ్రాండీయర్ సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు మినిమం బడ్జెట్లో వచ్చిన సినిమాలను ఆదరించేవారు. కంటెంట్ నచ్చితే సక్సెస్ లను కట్టబెట్టేవారు, లేకపోతే ప్లాప్ చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. హాలీవుడ్ సినిమాలను చూడడానికి అలవాటు పడిపోయిన ప్రేక్షకులు కొత్త రకం కథలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన మేకర్స్ సైతం పీరియాడికల్ డ్రామాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నారు... ఇప్పుడున్న దర్శకులు పీరియాడికల్ సినిమాని చేయడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ప్రేక్షకులకు ఆ సినిమాలు విపరీతంగా నచ్చడానికి గల కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

గ్రాండియర్ అండ్ విజువల్ ఫీస్ట్

కొన్ని దశాబ్దాల క్రితం నాటి కథలను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. అప్పటి పల్లెటూరులు అక్కడి వాతావరణం, మనుషులు బ్రతుకుతున్న తీరు, వాళ్లు పడే ఇబ్బందులు వాటన్నింటిని దర్శకులు మన కళ్ళకు కట్టినట్టుగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నారు. స్వాతంత్ర్యోద్యమం నాటి కాలంలో భారతీయులు ఎలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడి ప్రజలను బ్రిటిష్ పాలకులు ఏ రకంగా హింసించారు, ఎలా చంపేశారు.. ఎంతమంది రక్తం చిందిస్తే, ఎన్ని గుండెలు ఆగిపోతే ఈ స్వాతంత్ర్యం వచ్చిందనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. మన స్థితిగతులను అప్పటి రోజులతో బేరీజు వేసుకొని చూసుకుంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలోని కొందరు ప్రజలు కులాలు, మతాల పేరుతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాలను పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద చూపించగలుగుతున్నారు. దానికి తోడుగా ఆ రోజుల్లో మనుషుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ స్క్రీన్ మీద కనిపిస్తోంది.

ఫ్రెండ్షిప్ కి ఉన్న వాల్యూ ఎలాంటిది ఆ రోజుల్లో మనుషులు బ్రతికిన పరిస్థితులు ఎలాంటివి. ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఏం చేసేవారు. అప్పటి మానవతా విలువలు ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రేక్షకుల ఇష్టాన్ని గౌరవిస్తూ దర్శకులు సైతం గ్రాండియర్ గా తమ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు.ఆర్ట్ డైరెక్టర్ల దగ్గర నుంచి కొరియోగ్రాఫర్ల వరకు, లిరిసిస్ట్ ల నుంచి సింగర్స్ వరకు ప్రతి ఒక్కరు ఆ కాలం నాటి ప్రతి విషయాన్ని రీ క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్లో ఒక కొత్త ఫీల్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దాని వల్లే ప్రతి ప్రేక్షకుడు పీరియాడికల్ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తద్వారా ఆటోమేటిక్ గా మన దర్శకులు సైతం అలాంటి కథలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం...

ఎమోషనల్ డెప్త్ క్రియేట్ అవుతుంది...

ఇప్పుడున్న జనరేషన్ లో ఎమోషనల్ గా బాండింగ్ అనేది పూర్తిగా మిస్ అవుతుంది. పేరెంట్స్ ఎక్కడో ఊర్లలో ఉంటున్నారు. పిల్లలు సిటీలో జాబులు చేస్తున్నారు. దాంతో వాళ్ళ మధ్య పూర్తిగా ఎమోషనల్ కనెక్టివిటీ అనేది సన్నగిల్లుతుంది. ఒకప్పుడు అందరు ఊర్లోనే ఉండేవాళ్ళు దాంతో అందరి మధ్య ప్యూర్ ఎమోషన్స్ ఉండేవి. ఇప్పుడు దూరంగా ఉంటూ ఫోన్ లో మాట్లాడటానికి టైమ్ దొరకడం లేదు. వాటినే సినిమాల్లో చూపిస్తూ ఎమోషనల్ డెప్త్ క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల ప్రేక్షకులు సైతం వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో దానిని స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ రకంగా ప్రేక్షకులు స్క్రీన్ మీద చూపించే ప్రతి విషయాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్, రంగస్థలం, దసర లాంటి సినిమాలతో మన దర్శకులు పీరియాడికల్ సినిమాలు చేసి సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక మార్కును క్రియేట్ చేశారు...

డైరెక్టర్లు కొత్తదనం కోసం...

రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడం కంటే విభిన్న తరహాలో పీరియాడికల్ మూవీస్ చేస్తే దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేయడానికి అవకాశం దొరుకుతోంది. ప్రతి క్రాఫ్ట్ ను కొత్తగా చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఎమోషన్స్ ను పీక్స్ లో చూపించవచ్చు. తన కష్టానికి తగిన ప్రతి ఫలం దొరుకుతుందనే ఉద్దేశ్యంతోనే చాలా మంది దర్శకులు పీరియాడికల్ సినిమా మీద ఫోకస్ చేస్తున్నారు... వర్తమానంలో ఉన్న ప్రేక్షకుడిని గతంలోకి తీసుకెళ్లి పూర్వ కాలపు వైభవాన్ని అనుభవించేలా చేయడమే ఈ పీరియాడికల్ సినిమాల అసలు విజయం. దాన్ని దర్శకులు పర్ఫెక్ట్ గా వాడుతున్నారు...