Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి, గంభీరా పాత్ర తన నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో పవన్ కళ్యాణ్‌కు ‘ఓజీ’ సినిమా ప్రత్యేకంగా నచ్చిందట. ‘ఓజీ 2’పై గతంలో చర్చలు జరిగినా ఆరోగ్య సమస్యలు, ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం నానితో ‘బ్లడీ రోమియో’ చేస్తున్న సుజీత్.. అది పూర్తయ్యాక ‘ఓజీ 2’ను తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Gopi Velupala   |   13 Nov 2026 12:36 PM IST
పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?
X

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్... కెరీర్ స్టార్టింగ్ లో వరుస సక్సెస్ లతో అలరించాడు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. అభిమానుల కోరిక మేరకు సమయం దొరికినప్పుడు సినిమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఈమధ్య కాలం లో చేసిన సినిమాల్లో 'ఓజీ' సూపర్ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ కి పర్సనల్ గా ఈ సినిమా అంటే చాలా ఇష్టం...ప్రస్తుతం 'ఓజీ 2' గురించి చర్చలు నడుస్తున్నాయి...

ఓజీ అంటే పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఇష్టం...

నిజ జీవితం లో పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. తను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్పించే గురువు కోసం చాలా రోజులు తిరిగాడట. అందుకే కెరీర్ స్టార్టింగ్ లో బాక్సింగ్ కి, మార్షల్ ఆర్ట్స్ కి ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేశాడు. ఒకవేళ వాటికి ప్రాముఖ్యత లేకపోయినా సినిమాల్లో వాటి కోసం కొన్ని సీన్స్ పెట్టేవాడు. ఇక ఓజీ సినిమాలో ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వ్యక్తిగా కనిపించాడు. దానికి తోడు కటారా పట్టుకొని రౌడీలను నరుకుతాడు. దాంతో ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కి ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. ఓజీ మూవీ సెట్స్ మీద ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ సెకండ్ పార్ట్ కూడా చేద్దాం అని సుజీత్ కి చెప్పాడట. కొద్ది రోజుల కిందట ఓజీ 2 కి సంబంధించిన చర్చలు జరిగాయి. కానీ పవన్ కళ్యాణ్ కి హెల్త్ బాగాలేకపోవడం, ఈ లోపే ఎలక్షన్స్ రావడంతో ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు. అందుకే సుజిత్ ఇప్పుడు నాని తో 'బ్లడీ రోమియో' మూవీ చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయ్యాక ఓజీ 2 ని సెట్స్ మీదకి తీసుకువస్తారట. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఎలా ఉంటాడో ఈ మూవీలో క్యారెక్టర్ కూడా అలానే ఉండటం తో ఆయన ఎక్కువగా కనెక్ట్ అయ్యారట. అందుకే గంభీరా పాత్రలో నటించడానికి ఆయన ఆసక్తిగా ఉన్నాడట.

సుజీత్ ఓజీ 2 లో ఏం చూపించబోతున్నాడు...

మొదటి పార్ట్ లో గంభీరా అవసరం రావడం తో ముంబై కి వచ్చి తన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు మరోసారి ముంబై ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి వస్తాడట. ఇందులో పాలిటిక్స్ కి ప్రాధాన్యత ను ఇస్తూ కథ ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.