Begin typing your search above and press return to search.

కన్నడ భామలు ఇతర భాషా చిత్రాల వైపు మొగ్గు!

ఈ విధంగా ఇతర భాషా చిత్రాల వైపు కన్నడ భామలు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం మార్కెట్ స్కోప్ .. భారీ పారితోషికాలేనని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

By:  Srikanth Kontham   |   19 Aug 2026 5:00 PM IST
కన్నడ భామలు ఇతర భాషా చిత్రాల వైపు మొగ్గు!
X

శాండిల్ వుడ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతో మంది భామలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల వైపు పెద్ద ఎత్తున అడుగులు వేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల, నభా నటేష్, శ్రద్ధా శ్రీనాథ్ వంటి నటీమణులంతా కన్నడ చిత్రాలకు దూరంగా ఉంటూ ఇతర భాషా ప్రాజెక్ట్‌లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన తారలు ఇప్పుడు దేశవ్యాప్తంగా గ్లోబల్ స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఈ విధంగా ఇతర భాషా చిత్రాల వైపు కన్నడ భామలు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం మార్కెట్ స్కోప్ .. భారీ పారితోషికాలేనని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తెలుగు - హిందీ పరిశ్రమల పరిధి పెద్దదిగా ఉండటంతో పాటు అక్కడ వచ్చే కమర్షియల్ సక్సెస్ తారలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడుతుంది. దీనికి తగినట్లుగానే నిర్మాతలు కూడా భారీ మొత్తంలో పారితోషికాలు చెల్లించడానికి వెనుకాడకపోవడంతో నటీమణులు నేచురల్‌గా ఇతర ఇండస్ట్రీల అవకాశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రష్మిక మందన్నను తీసుకుంటే.. `కిరాక్ పార్టీ`తో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు ఆ తర్వాత టాలీవుడ్‌లో `పుష్ప`తో బాలీవుడ్‌లో `యానిమల్` తో బ్లాక్‌బస్టర్లు కొట్టి గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు.

అమ్మ‌డు కన్నడలో నటించిన చివరి సినిమా వచ్చి ఐదేళ్లు దాటిపోగా మళ్లీ అక్కడ నటించే అవకాశం రాలేదు. అలాగే డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా కన్నడలో `కిస్` సినిమాతో పరిచయమైనా? అటుపై టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు. నభా నటేష్, శ్రద్ధా శ్రీనాథ్ వంటి నటీమణులు కూడా తెలుగు, తమిళ చిత్రాలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తూ సొంత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

ఈ సుదీర్ఘ విరామం తర్వాత కన్నడ ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. `కేజీఎఫ్` ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ శ్రీనిధి శెట్టి మాత్రం విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఇతర భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న భామ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ హోమ్ ఇండస్ట్రీ అయిన కన్నడలో ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆమె తీసుకున్న నిర్ణయం శాండ్‌వుడ్ వర్గాలలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

ఒక నటిగా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే పెద్ద మార్కెట్లు ఉన్న ఇండస్ట్రీలలో పనిచేయడం అవసరమని చాలామంది భావిస్తారు. అయితే తమను ఇండస్ట్రీకి పరిచయం చేసిన హోమ్ ఇండస్ట్రీని పూర్తిగా విస్మరించడం సరైనదేనా? అనే చర్చ కూడా అక్కడక్కడా వినిపిస్తుంటుంది. ఇతర భాషలలో ఎంత బిజీగా ఉన్నా? అప్పుడప్పుడు సొంత పరిశ్రమకు కూడా సమయం కేటాయించడం నటీమనుల బాధ్యత అని కొందరు అభి ప్రాయపడుతున్నారు.

మొత్తంగా కన్నడ భామలు ఇతర భాషా చిత్రాల వైపు పరుగులు తీయడానికి కారణాలు స్పష్టంగా ఉన్నా? గ్లోబల్ రేంజ్‌లో రాణించాలనే వారి కోరికను తప్పుపట్టలేము. అవకాశాలు, మార్కెట్ డిమాండ్‌ను బట్టి నటీమణులు కెరీర్‌ను మలచుకోవడం సహజమే. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లతో ఈ నటీమణులంతా సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.