Begin typing your search above and press return to search.

హృతిక్ భయపడిన చోటే యశ్ గెలుపు వెతుక్కుంటున్నాడా?

పరిశ్రమలో కొన్నిసార్లు ఒక నటుడు వదులుకున్న పాత్ర మరొక నటుడికి జీవితాంతం గుర్తుండిపోయే మైలురాయిగా మారుతుంది.

By:  Srikanth Kontham   |   23 Oct 2026 8:00 PM IST
హృతిక్ భయపడిన చోటే యశ్ గెలుపు వెతుక్కుంటున్నాడా?
X

పరిశ్రమలో కొన్నిసార్లు ఒక నటుడు వదులుకున్న పాత్ర మరొక నటుడికి జీవితాంతం గుర్తుండిపోయే మైలురాయిగా మారుతుంది. నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న `రామాయణ` చిత్రంలో రావణాసురుడి పాత్ర విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ముందుగా ఈ పాత్ర కోసం బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌ను సంప్రదించినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. అయితే ఈ రిజెక్షన్ వెనుక కేవలం గ్రే షేడ్స్ వద్దు అనే సాధారణ కారణం కంటే? ఒక స్టార్ హీరో తన డిజిటల్ ఇమేజ్ ..పబ్లిక్ పెర్సెప్షన్‌ను కాపాడుకోవడానికి పడే అంతర్గత మధనమే అసలు కారణమనేది వెలుగులోకి వ‌స్తోంది.

సాధారణంగా హృతిక్ రోషన్ కెరీర్‌లో ప్రయోగానికి పెద్ద పీఠ వేస్తారు. కానీ `విక్రమ్ వేద`, `వార్` వంటి చిత్రాలలో భయపెట్టే విలనిజం లేదా గ్రే షేడ్స్ చేసిన తర్వాత మళ్లీ పౌరాణిక నేపథ్యంలో రాక్షస రాజు పాత్రలో కనిపించడం ద్వారా తనలోని హీరోయిక్ చాక్లెట్ బాయ్ ఇమేజ్ శాశ్వతంగా దెబ్బతింటుందనే అప్రకటిత భయం ఆయనలో ఉండి ఉండవచ్చని తెలుస్తోంది. భారతదేశంలో ఇప్పటికీ పౌరాణిక పాత్రలను ప్రేక్షకులు నిర్దిష్టమైన నైతిక కోణంలోనే చూస్తారు. అలంటి పాత్రలో నటించి.. ఒకవేళ నెగెటివ్ రెస్పాన్స్ వస్తే మార్కెట్ సమీకరణాలు మారుతాయనే ఆందోళనే హృతిక్‌ను ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గేలా చేసిందా? అన్న‌ది హైలైట్ అవుతుంది.

హృతిక్ వదిలేసిన ఈ డేంజరస్ బాటనే కన్నడ రాకింగ్ స్టార్ యశ్ విప్లవాత్మక అవకాశంగా మలచుకున్నారు. `కేజీఎఫ్` వంటి మాస్ ఇమేజ్ తర్వాత యశ్ సాధారణ హీరోగా మిగిలిపోవడానికి ఇష్టపడలేదు. రావణుడి పాత్రను ఒక సాంప్రదాయ విలన్‌గా కాకుండా అత్యంత శక్తివంతమైన, బహుళ లేయర్లు ఉన్న మానవీయ కోణాలతో కూడిన ఓ యాంటీ-హీరో లెజెండ్‌గా మలచాలని డిమాండ్ చేశారు. హృతిక్ భయపడిన ఆ నెగెటివ్ షేడ్ రిస్క్ నే యశ్ పాన్-ఇండియా మార్కెట్‌ను మరింత విస్తరించడానికి ఒక అస్త్రంగా మార్చుకోవడం విశేషం.

ఇద్దరు స్టార్స్ ఆలోచనా విధానంలోని ఈ వైరుధ్యం అనేది భారతీయ సినిమా పరిశ్రమలో ఓ కొత్త చర్చకు తెరలేపింది. హృతిక్ రోషన్ గతాన్ని దృష్టిలో పెట్టుకుని సేఫ్ జోన్‌ను ఎంచుకుంటే? యశ్ మాత్రం భవిష్యత్ ప్రయోగాల కోసం మాస్ ఇమేజ్‌ను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఒక నటుడిగా తన పరిధులను బద్దలు కొట్టడానికి పౌరాణిక పాత్రల కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదని యశ్ భావిస్తే.. హృతిక్ మాత్రం తనను తాను ఒకే ఫ్రేమ్‌లో బంధించుకోవడానికి ఇష్టపడలేదు. ఈ నిర్ణయమే `రామాయణ` చిత్రంలో రావణుడి పాత్ర స్వభావాన్నే పూర్తిగా మార్చేసింద‌ని చెప్పొచ్చు.

ఈ కాస్టింగ్ మార్పు నటీనటుల మార్పు మాత్రమే కాదు. సినిమా కథాంశం డైనమిక్స్‌ను కూడా పూర్తిగా మార్చేసింది. ఒకవేళ హృతిక్ గనుక ఈ పాత్ర చేసి ఉంటే? ఆ పాత్ర కేవలం స్టైలిష్ విలనిజానికి పరిమితమయ్యేది. కానీ యశ్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ పాత్రకు ఓ సరికొత్త రాక్షస రాజసం గూస్‌బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ తోడయ్యాయి. దీంతో రాముడు, రావణుల మధ్య జరిగే సంఘర్షణ మరింత తీవ్రంగా.. ఇద్దరు సమాన స్థాయి హీరోలు తలపడినట్లుగా స్క్రీన్‌పై పండటానికి అవకాశం ఏర్పడిందనే మాట వినిపిస్తోంది.