మెడలో షూ వేసుకుని.. ఆఫర్ల కోసం ఇలా చేస్తారా?
మెడలో షూస్ ఎందుకు వేసుకుంది? అంటే... ఇలా షూస్ వేసుకోవడం అనేది ఫ్యాషన్ కోసం చేసిన పని కాదు.. అది ఒక సామాజిక కారణంతోనే.. మూర్ఛ వ్యాధి (ఎపిలెప్సీ పై అవగాహన కల్పించడానికి చేసిన ప్రయత్నం.
By: Sivaji Kontham | 22 Jan 2026 10:29 PM ISTమెడలో షూ వేసుకుంటే ఆఫర్లు వెంటపడతాయా? `దంగల్` బ్యూటీ ఫాతిమా సనా షేక్ ఎందుకిలా చేస్తోంది? అసలు తనకు ఫ్యాషన్ సెన్స్ ఉందా?
ఫాతిమా సనా షేక్ మెడలో షూస్ వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇలాంటి సందేహాలెన్నో వచ్చాయి. కానీ దీని వెనుక ఒక ముఖ్యమైన, సున్నితమైన కారణం ఉంది. దీని గురించి సందేహించేవారికి ఇదే అసలైన సమాధానం.
మెడలో షూస్ ఎందుకు వేసుకుంది? అంటే... ఇలా షూస్ వేసుకోవడం అనేది ఫ్యాషన్ కోసం చేసిన పని కాదు.. అది ఒక సామాజిక కారణంతోనే.. మూర్ఛ వ్యాధి (ఎపిలెప్సీ పై అవగాహన కల్పించడానికి చేసిన ప్రయత్నం. భారతదేశంలో ఎవరికైనా మూర్ఛ (ఫిట్స్) వచ్చినప్పుడు, వెంటనే పాత షూ లేదా సాక్స్‌లను వాసన చూపించడం ఒక మూఢనమ్మకంగా వస్తోంది. ఇలా చేయడం వల్ల వ్యాధి తగ్గుతుందని చాలామంది నమ్ముతారు.
ఫాతిమా స్వయంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు ఫిట్స్ వచ్చినప్పుడు కూడా ప్రజలు ఇలాగే షూస్‌ని వాసన చూపించారని, అది చాలా అసహ్యంగా, బాధాకరంగా ఉంటుందని చెప్పారు. మూర్ఛ వచ్చిన వ్యక్తికి షూస్ వాసన చూపించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, అది కేవలం ఒక మూఢనమ్మకం అని చెప్పడానికి ఆమె ఆ విధంగా ఫోటోషూట్ చేశారు. మెడలో షూస్ వేసుకుని ``ఇలా చేయకండి, ఇది ప్రమాదకరం`` అనే సందేశాన్ని సనా షేక్ ఇచ్చారు.
ఫ్యాషన్ సెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫాతిమా సనా షేక్ బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నారు. చీరలు కట్టుకున్నా లేదా మోడరన్ దుస్తులు ధరించినా ఫాతిమా తన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంటారు. అయితే కొన్నిసార్లు ఫాతిమా చేసే ప్రయోగాలు అందరికీ అర్థం కాకపోవచ్చు.. కానీ దాని వెనుక ఒక సామాజిక ఉద్దేశ్యం ఉంటుంది. ఆమె తనను తాను `ఫ్యాషన్ కెమిలియన్` గా అభివర్ణించుకుంటుంది. అంటే సందర్భాన్ని బట్టి తన రూపాన్ని మార్చుకోగల ఊసరవెల్లిని అని అంగీకరించడమే.
ఆఫర్ల కోసం ఇలా చేస్తారా?
మెడలో షూస్ వేసుకోవడం వల్ల ఆఫర్లు వస్తాయనేది కేవలం పుకారు మాత్రమే. ఫాతిమా ఈ పని చేసింది కేవలం మూర్ఛ వ్యాధి బాధితుల పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి మాత్రమే. దీనికి సినిమా ఆఫర్లకు ఎటువంటి సంబంధం లేదు. ఫాతిమా గతంలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి కూడా ధైర్యంగా మాట్లాడారు, కానీ ఈ ఫోటోషూట్ మాత్రం పూర్తిగా సామాజిక అవగాహన కోసమే. ఫాతిమా సనా షేక్ నటించిన `దంగల్` ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లు వసూలు చేసింది. ఇటీవల విజయ్ వర్మతో కలిసి నటించిన ప్రేమకథా చిత్రాని(గుస్తాక్ ఇష్క్)కి క్రిటిక్స్ మంచి మార్కులే వేసిన సంగతి తెలిసిందే.
