సినిమాలు చూడని ఆడియన్స్.. మైండ్ లో ఉన్న ఆలోచనలేంటి..?
ఒకప్పుడు స్టార్ సినిమాలకు రిలీజ్ ముందు హంగామా ఒక రేంజ్ లో ఉండేది. అదేదో పండగ అన్నట్టుగా చేస్తారు.
By: Ramesh Boddu | 6 Aug 2025 3:31 PM ISTసినిమా థియేటర్లకు ఒకప్పటి వైభవం ఎప్పుడు.. ప్రస్తుతం ఇండస్ట్రీ వాళ్లను షేక్ చేస్తున్న మ్యాటర్ ఇదే. జనాలు అసలు ఎందుకు థియేటర్లకు రావట్లేదు. కేవలం కొన్ని సినిమాలకే అది కూడా బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తేనే తప్ప కదలని పరిస్థితి. అలా చేసినా కూడా కొన్ని సినిమాలను ఆడియన్స్ పట్టించుకోవట్లేదు.
ఒకప్పుడు స్టార్ సినిమాలకు రిలీజ్ ముందు హంగామా ఒక రేంజ్ లో ఉండేది. అదేదో పండగ అన్నట్టుగా చేస్తారు. కంటెంట్ ఉన్న సినిమాలను మౌత్ టాక్ స్ప్రెడ్ చేసి సూపర్ హిట్ చేస్తారు. ఇప్పుడు అంత టైం కూడా లేకుండా థియేటర్ల నుంచి ఎత్తేస్తున్నారు.
ఆడియన్స్ అసలు థియేటర్స్ లో సినిమా చూడకపోవడానికి రీజన్స్ ఏంటి. కోవిడ్ టైం లో కొంతకాలం థియేటర్లు ఆపేశారు. ఆ టైంలో కొంత ఓటీటీ లోనే తమకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ పొందారు. మరి ఇప్పుడు కూడా అది చాలని అనుకుంటున్నారా.. అసలు ఏ కారణాల వల్ల ఆడియన్ థియేటర్ లో సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న దానికి కొన్ని కేటగిరీస్ గా చూస్తే తెలుస్తుంది.
మొదటిది వీక్ కంటెంట్..
థియేటర్ లో ఆడియన్స్ ని రప్పించకపోవడంలో మొదటిది వీక్ కంటెంట్.. ప్రమోషన్స్ లో ఊదరగొట్టి తీరా సర్లే ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందని సినిమా థియేటర్ కి వెళ్లి ఖర్చు పెట్టి మరీ చూస్తే.. టీజర్, ట్రైలర్ లో చూపించిన మ్యాటర్ తప్ప సినిమా వీక్ కంటెంట్ తో నిరాశ పరుస్తున్నారు. ఇలాంటి సినిమాల వల్ల ఆ ఇంపాక్ట్ మరో సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు.
టికెట్ రేట్లు ఒక సమస్యే..
ఆడియన్స్ సినిమా చూడకపోవడానికి మెయిన్ రీజన్ లలో టికెట్ ప్రైజ్ కూడా ఒకటి. స్టార్ సినిమాలకు ఇంకా పాన్ ఇండియా సినిమాలకు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తున్నారు మేకర్స్. అసలు. సినిమాకు ఎంత కుదిరితే అంత తక్కువ రోజుల్లో కలెక్ట్ చేసేలా ఈ టికెట్ రేటు పెంచడం వల్ల సాధారణ ప్రేక్షకుడి జేబుకి బరువు అవుతుంది. ఫ్యామిలీ మొత్తం సినిమాకు వెళ్లాలని ప్లాన్ చేయాలంటే చాలా మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే సినిమా చూడటం మానేస్తున్నాడు.
నెల లోపే OTT రిలీజ్..
సినిమా చూసే ఆడియన్ టైటిల్స్ లో ఓటీటీ లోగో చూసి.. అర్రె ఇది మనకి సబ్ స్క్రిప్షన్ ఉంది కదా.. అనవసరంగా సినిమా చూస్తున్నాం.. నెల ఆగితే ఓటీటీలో వచ్చేది కదా అనే ఆలోచన బలంగా ఉంది. ఓటీటీ రిలీజ్ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు చాలా దగ్గర ఉండటం కూడా ఒక సమస్య అని చెప్పొచ్చు. ఫ్రీగా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాను అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు చూడాలి అన్నట్టుగా ఆలోచిస్తాడు.
కానీ ఇంట్లో ఎంత పెద్ద హోం థియేటర్ ఉన్నా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వదు అన్నది ఆలోచించరు. ఎర్లీ ఓటీటీ రిలీజ్ థియేటర్ కి ఆడియన్స్ ని రానివ్వకుండా చేస్తున్నాయన్నది అందరికీ తెలిసిన వాస్తవం.
పాన్ ఇండియా మోజులో సినిమాలు.
ఒక్క పాన్ ఇండియా హిట్ పడగానే అందరు అదే తరహాలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. ఈ కథ పాన్ ఇండియా రీచ్ ఉంటుందా లేదా అన్నది కూడా ఆలోచించట్లేదు. అందుకే ఆడియన్స్ కూడా అలాంటి సినిమాల మీద ఆసక్తి చూపించట్లేదు.
స్టార్ రెమ్యునరేషన్ తో పెరుగుతున్న బడ్జెట్
ఇక స్టార్ సినిమా కోట్ల రెమ్యునరేష.. వందల కోట్ల బడ్జెట్ ఇది ఒక పెద్ద సినిమా లెక్కలు. ఐతే ఇందులో కంటెంట్ ఎలా ఉంది అన్నది కూడా సెకండరీ అవుతుంది. స్టార్స్ తీసుకుంటున్న భారీ రెమ్యునరేషన్ వల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుంది. దాన్ని రికవర్ చేయడానికి టికెట్ రేట్లు పెంచుతారు. సో సాధారణ ఆడియన్ బడ్జెట్ కి మించేలా ఈ రేట్లు ఉంటాయి. ఈ కారణాలు కూడా సినిమా మీద ఆడియన్స్ కు ఆసక్తి తగ్గించేలా చేస్తున్నాయి.
ఇలా పైన చెప్పిన కారణాలు అన్నీ కూడా ఒక్కో యాస్పెక్ట్ లో ఆడియన్స్ ని థియేటర్ కు రాకుండా చేస్తున్నాయి. ఐతే పెరుగుతున్న కాలాన్ని బట్టి అన్నిటికీ రేట్లు పెరిగాయి. అలానే సినిమా టికెట్ రేట్లు అని చెప్పొచ్చు. కానీ ప్రతి సినిమాకు టికెట్ ప్రైజ్ హైక్ చేస్తూ వెళ్తే జనాల జేబులకు బొక్క తప్ప మరోటి ఉండదు.
వీకెండ్ అయితే రిలీజైన సినిమా చూడటం అన్నది ఒక ఆనవాయితీగా కొందరు చేస్తుంటారు. అలాంటి వాళ్లు కూడా ఈ పెరిగిన టికెట్ ప్రైజ్ లు.. కంటెంట్ లేని సినిమాల వల్ల సినిమాలు థియేటర్ లో చూడాలన్న ఇంట్రెస్ట్ ని కోల్పోతున్నారు. ఎంచక్కా ఓటీటీలో నచ్చిన జోనర్ లో నచ్చిన భాషలో సినిమా చూడొచ్చని భావిస్తున్నాడు.
కానీ సినిమాను ఓటీటీలో కాకుండా ముందు చెప్పినట్టుగా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది. ఐతే జనాలను థియేటర్ కి రప్పించడానికి దర్శక నిర్మాతలు స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ వాళ్లకు కూడా జనాల మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది అర్ధం కావట్లేదు. టికెట్ రేట్లు తగ్గించినా కూడా సినిమాలు చూస్తారా లేదా అన్న నమ్మకం రావట్లేదు. ఐతే సినిమాకు టికెట్ రేట్లు పెంచడం అన్నది ఒక్కటే కాదు కొన్ని సినిమాలు ఆహా ఓహో అంటూ బిల్డప్ ఇచ్చి తీరా థియేటర్లో చూశాక సినిమా డిజప్పాయింట్ చేయడం కూడా థియేటర్ లో సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ కలగట్లేదని తెలుస్తుంది.
