నయనతార ఒప్పుకోకపోతే ఆ సినిమా చూసి పడుకునేవాడిని
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన తాజా సినిమా మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 16 Jan 2026 7:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన తాజా సినిమా మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే కథతో అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచారు. సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పెషల్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలను ప్లాన్ చేశారు.
ఆ పాత్రకు వెంటనే ఆమే గుర్తొచ్చారు
అందులో భాగంగా రీసెంట్ గా రిలీజైన ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మెగాస్టార్, అనిల్ ను ఇంట్రెస్టింగ్ ప్రశ్నలను అడగ్గా, దానికి అనిల్ ఇచ్చిన సమాధానాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు ఈ సినిమాకు నయనతారను ఎలా ఒప్పించావని చిరూ అడిగిన ప్రశ్నకు అనిల్ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కథ రాసుకున్నప్పుడే చిరూ స్థాయికి తగ్గ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నానని, మెగాస్టార్ ముందు ధైర్యంగా వేలు చూపిస్తూ మాట్లాడే అమ్మాయిని తీసుకోవాలనుకున్నప్పుడు వెంటనే నయనతారే గుర్తొచ్చారని అనిల్ చెప్పారు.
అలా కాకుండా ఎవరైనా మామూలు హీరోయిన్ తో చేస్తే కథ మొత్తం మిస్ ఫైర్ అవుతుందని ఆమెను సంప్రదించినట్టు చెప్పారు అనిల్. ఈ విషయంలో నిర్మాతలు సాహు, సుస్మిత చాలా వర్క్ చేశారని చెప్పారు. తర్వాత నయనతారతో ఫోన్ లో మాట్లాడి కథ చెప్పానని, ఆమెకు కథ చాలా బాగా నచ్చి, చిరంజీవి గారితో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉందని, అందులోనే వెంకటేష్ గారు కూడా ఉండటంతో ఈ సినిమా చేయాలనుకుంటున్నట్టు నయనతార చెప్పారు.
హానెస్ట్ గా చెప్పా
కానీ తర్వాత కొన్ని టెక్నికల్ విషయాల వల్ల కుదరడం లేదని, ఇప్పుడేం చేద్దాం. ఒక వేళ నేను ఈ సినిమా చేయనని చెప్తే నువ్వేం చేస్తావని నయనతార అడిగారని, దానికి తాను చెప్పిన హానెస్ట్ ఆన్సర్ వల్లే ఈ సినిమాను ఆమె చేశారని అనిల్ చెప్పారు. మీరు వెంకటేష్ గారి దృశ్యం మూవీ చూశారు కదా. అందులో జరిగినట్టు ఈరోజు నేను నయనతార గారికి కాల్ చేయలేదు, ఆమెకు కథ చెప్పలేదనుకుని ప్రశాంతంగా పడుకుంటానని చెప్పానని అనగానే నయనతార వెంటనే నవ్వారని, ఆ తర్వాతే తన నిర్ణయం చెప్పారని అనిల్ చెప్పారు.
ప్రమోషన్స్ కోసం చాలా సహకరించారు
నీ కోసం నేను ఈ సినిమా చేస్తున్నా. ఆ టెక్నికల్ ఇష్యూస్ ని ఎలా క్లియర్ చేసుకుంటావో చేసుకో అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కథ, క్యారెక్టర్ నచ్చడం వల్లే ఆమె ఈ సినిమాను వదులుకోలేదని, ప్రమోషన్స్ విషయంలో కూడా ఆమెంతో సహకరించారని అనిల్ పేర్కొన్నారు. ఇవే కాక మరిన్ని విషయాలను కూడా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
