Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌లో నెక్స్ట్ నెంబర్ వన్ క్వీన్ రేస్!

ఇండస్ట్రీలో ఖాళీ అయిన అగ్ర పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టాలెంటెడ్ యంగ్ హీరోయిన్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.

By:  Srikanth Kontham   |   29 Jun 2026 9:00 PM IST
బాలీవుడ్‌లో నెక్స్ట్ నెంబర్ వన్ క్వీన్ రేస్!
X

బాలీవుడ్ లో అగ్ర నటిగా సుదీర్ఘకాలం పాటు కొన‌సాగుతున్న న‌టి దీపికా పడుకోణే. అయితే ప్రస్తుతం దీపిక‌ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాల వేగాన్ని తగ్గించారు. దీపికా పడుకోణే తీసుకున్న ఈ చిన్న విరామం బాలీవుడ్ తదుపరి నెంబర్ వన్ క్వీన్ స్థానం కోసం పై ఆసక్తికర రేస్‌కు తెరలేపింది. ఇండస్ట్రీలో ఖాళీ అయిన అగ్ర పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టాలెంటెడ్ యంగ్ హీరోయిన్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఈ నెంబర్ వన్ రేసులో ప్రస్తుతం జాతీయ అవార్డు గ్రహీత అలియా భట్ అందరికంటే ముందంజలో కనిపిస్తున్నారు. అద్భుతమైన నటనతో, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సైతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించగల సత్తా అమ్మ‌డి సొంతం. బాలీవుడ్ పరిధికే పరిమితం కాకుండా పాన్-ఇండియా స్థాయి ప్రాజెక్టులతోనూ అంతర్జాతీయ వేదికలపై తనకున్న క్రేజ్‌తోనూ అలియా భట్ ఈ తరం హీరోయిన్లలో అత్యంత బలమైన పోటీదారుగా నిలుస్తున్నారు.

అలియా భట్‌కు గట్టి పోటీనిస్తూ మరికొందరు స్టార్ హీరోయిన్లు కూడా బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్‌తో దూసుకుపోతున్నారు. కియారా అద్వాని వరుస విజయాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా మారడమే కాకుండా టాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా ప్రాజెక్టులలోనూ క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటున్నారు. మరోవైపు నేషనల్ అవార్డ్ విన్నర్ కృతి సనన్ గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాగే శ్రద్ధా కపూర్ సైతం భారీ కమర్షియల్ సక్సెస్‌లతో బాక్సాఫీస్ వ‌ద్ద స్టామినాను నిరూ పించుకుంటున్నారు.

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా మళ్లీ బాలీవుడ్ చిత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ క్వీన్ రేస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది. అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ అమ్మ‌డు తిరిగి హిందీ పరిశ్రమలో బలమైన కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ప్రియాంకకు ఉన్న అంతర్జాతీయ ఇమేజ్ -సుదీర్ఘ అనుభవం ఈ పోటీని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

బాలీవుడ్ తదుపరి నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించడం అనేది గ్లామర్ లేదా హిట్ సినిమాలపై మాత్రమే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో మార్కెట్‌ను శాసించగల క్రేజ్ - నటన నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. యంగ్ జనరేషన్ నటీమణులైన అలియా, కియారా, కృతి, శ్రద్ధాలతో పాటు సీనియర్ స్టార్ ప్రియాంకా చోప్రా తలపడుతున్న బాక్సాఫీస్ పోరులో రాబోయే రోజుల్లో బాలీవుడ్ సింహాసనాన్ని ఎవరు అధిష్టిస్తారో? చూడాలి.