Begin typing your search above and press return to search.

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

‘ఇట్లు అర్జున’ హీరో అనీష్ రెడ్డి నేపథ్యం ఆసక్తికరంగా మారింది. రూ.2,200 కోట్ల టర్నోవర్ ఉన్న ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి కుమారుడైన అనీష్.. వ్యాపార రంగం నుంచి సినిమాల్లోకి వచ్చారు. నాగార్జున కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆయన తొలి సినిమాకు టాలీవుడ్ స్టార్లు ప్రచారం చేస్తున్నారు. ఇందులో అనీష్ మూగవాడి పాత్రలో నటించారు.

By:  Sivaji Kontham   |   12 Nov 2026 11:30 PM IST
ఇట్లు అర్జున హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే
X

గ‌త కొంత‌కాలంగా `ఇట్లు అర్జున` హీరో అనీష్ రెడ్డి గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. అత‌డి కోసం టాలీవుడ్ లో దిగ్గ‌జ సినీ కుటుంబాలు బ‌రిలోకి దిగ‌డం.. నాగార్జున‌, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి స్టార్ హీరోలు అత‌డి సినిమాని ప్ర‌మోట్ చేస్తుంటే.. అస‌లు ఎవ‌రు ఈ హీరో? అత‌డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. త‌ర‌చి చూస్తే అత‌డి నేప‌థ్యం నిజంగా అంద‌రికీ షాకిస్తోంది.

2200 కోట్ల ట‌ర్నోవ‌ర్ ఉన్న కంపెనీకి య‌జ‌మాని అత‌డు. ఏఎంఆర్ గ్రూప్ అధినేత‌ మ‌హేష్ రెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి. నిర్మాణ రంగం.. మైనింగ్ ప్రాజెక్టులు .. ఇర్రిగేష‌న్, థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్.. రైల్వే వ‌ర్క్స్.. జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం .. ఇలా ఇన్ ఫ్రా రంగంలో పేరున్న కాంట్రాక్ట‌ర్లు. ఏఎంఆర్ గ్రూప్ పేరుతో అనీష్ తండ్రి మ‌హేష్ రెడ్డి ద‌శాబ్ధాలుగా విజ‌య‌వంతంగా వ్యాపారాల‌ను కొన‌సాగిస్తున్నారు. అత‌డు చాలా కాలంగా నాగార్జున ఫ్రెండ్.. నాగ్ న‌టించిన కొన్ని సినిమాల‌కు పెట్టుబ‌డులు పెట్టారు. నాగార్జున న‌టించిన భ‌క్తిర‌స చిత్రాలు షిరిడి సాయి, ఓం న‌మో వెంక‌టేశాయ చిత్రాల‌కు అత‌డే నిర్మాత‌. ఈ సినిమాలు ఫ్లాపులైనా కానీ.. నాగార్జున‌తో అత‌డి స్నేహం ఎప్ప‌టికీ గొప్పది.

అలాగే నాగార్జున న‌టించే సినిమాలకు ఫైనాన్స్ చేయ‌డమే కాకుండా.. సినీరంగంతో అత‌డి స‌త్సంబంధాలు ఆస‌క్తిక‌రం. అనీష్ న‌టించిన డెబ్యూ సినిమా `ఇట్లు అర్జున‌` ప్ర‌చారానికి అక్కినేని హీరోలు మెగా నంద‌మూరి హీరోలు ముందుకు వ‌చ్చారు. నాగార్జున స్వ‌యంగా స‌మ‌ర్ప‌కుడిగా మారి ఈ సినిమా రిలీజ్ కోసం చాలా విధాలుగా స‌హ‌క‌రిస్తున్నారు.

అయితే వంద‌ల‌ కోట్ల ఆస్తులు.. దిగ్గజ వ్యాపార కుటుంబం నుంచి వచ్చినా సినిమాలపై ఉన్న మక్కువతో అనీష్ రెడ్డి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌పైనే ఆధారపడకుండా నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో పూర్తి స్థాయి శిక్షణ తీసుకుని అనీష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. న‌టించిన మొద‌టి సినిమాలో మూగ‌వాడిగా న‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.